మనిషికి విలువ కలిగించే చేనేతలు | wavers will make valuable of respect to human being | Sakshi
Sakshi News home page

మనిషికి విలువ కలిగించే చేనేతలు

Published Tue, Jun 16 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

wavers will make valuable of respect to human being

మనిషికి తను వేసుకునే బట్టల ద్వారానే ఎనలేని విలువ, గౌరవం కలుగుతాయి.  దశావతారాలు ఎత్తిన మహావిష్ణువుకు నూలు దారంతో స్వయంగా పట్టుపంచె నేసి కాను కగా ఇచ్చిన మార్కండేయ మహర్షి వారసు లైన చేనేతకారుల బతుకులు నేడు వెలసి పోతున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి చేనేతకారులకు ప్రయోజనం కలిగిం చేందుకోసం ప్రతి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీలు ఖద్దరు దుస్తులు ధరించేలా ఆదేశాలు జారీ చేసి చేనేతలకు చేయూతనిచ్చిన విష యం పద్మశాలి కులస్తులు మరువరు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సబ్ ప్లాన్ కోసం తెలం గాణ రాష్ట్రంలోని బీసీ కులస్తుల కోసం రూ. 20,000 కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేయాలి. సిరిసిల్ల, దుర్బెడు, ఎలగెడు, హుజూరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో గల చేనేతల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్కో షాపుల ద్వారా చేనేతల వస్త్రాలు అమ్మించి ఆదుకోవాలి.
 
 గత మార్చి 2015లో తెలంగాణ సీఎం వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు కోసం ఎంపీలతో ఆధ్యయనం జరి పించారు. అంతే కాకుండా ఆయన ప్రకటిం చిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో భాగం గా మార్కండేయ టౌన్‌షిప్ పేరుతో చేనేత లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కులస్తుడికి పావలా వడ్డీతో రూ.50,000లు రుణం అందించాలి. తెలంగా ణ రాష్ట్రంలో పనిచేస్తున్న బీసీ విభాగంలోని పద్మశాలి కులస్తులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. బీసీలలోని అన్ని కులాల వారికి సబ్‌ప్లాన్ అమలు చేస్తూ, రూ.20,000 కోట్ల ను కేటాయించినట్లయితే వెనుకబడిన తరగ తుల వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు. అందుచేత వెంటనే సబ్‌ప్లాన్ అమలుకు ప్రధాని నరేంద్రమోదీ పూనుకోవాలి.
- కోలపాక శ్రీనివాసమూర్తి  బెల్లంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement