బీసీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ చట్టం సాధించే వరకు ఉద్యమించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 51 శాతమున్న బీసీలకు విద్య, వైద్యపరంగా తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
గీత కార్మిక, చేనేత, రజక, విశ్వబ్రాహ్మణ, మత్స్య కార్మిక ఫెడరేషన్‌లకు అరకొరగా కేటాయిస్తున్న నిధులతో ఎవ్వరికీ అందే పరిస్థితి లేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. శనివారం మగ్దూంభవన్‌లో వృత్తిసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బీసీ సబ్‌ప్లాన్ సాధన సమాఖ్య రాష్ట్రస్థాయి ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతివృత్తిదారులకు జనాభా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశం తీర్మానించింది.