There Was No Discussion With BRS Says Chada Venkat Reddy - Sakshi
Sakshi News home page

పొత్తుల కోసం వెంపర్లాడం 

Published Mon, Jul 24 2023 2:41 AM | Last Updated on Wed, Jul 26 2023 4:38 PM

There was no discussion with BRS says Chada Venkat Reddy - Sakshi

హుస్నాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తులపై ముఖాముఖి చర్చలు జరగలేదని, పొత్తులకోసం వెంపర్లాడబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయ న తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో సీపీఐ వల్లే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచారన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆనాడు తమను పిలి చి పొత్తుపెట్టుకున్నారని, వ చ్చే ఎన్నికల్లోనూ ఆయన పిలిస్తేనే పొత్తులపై చర్చిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో తమ స్నేహబంధం ముగియలేదన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసే పయనిస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణలో 15 సీట్లలో సీపీఐ బలంగా ఉందని, 5 సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొత్తగూడెం, వైరా, పెద్దపల్లి, మునుగోడు, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో  తప్పకుండా పోటీ చేస్తామని వెల్లడించారు.  

ఆర్టీసీ డిపోల ఎదుట రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు 
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను నేరవేర్చాలని ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డిపోల ఎదుట తమ పార్టీ ఆ«ధ్వర్యంలో సేవ్‌ ఆర్టీసీ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచుతామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు ఇచ్చి న హామీని నేరవేర్చలేదని చాడ విమర్శించారు.  వచ్చే నెల 7న ప్రజాసమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

బీసీ, దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదన్నా రు.  గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపి క చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా,  మణిపూర్‌ సంఘటనపై ఈనెల 25న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement