సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా’ కూటమిలో బీఆర్‌ఎస్ లేకపోయినా ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి సీపీఐ, సీపీఎంకు ఎలాంటి సమస్య లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అంశం తలెత్తదన్నారు. ‘ఇండియా’ కూటమికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితు లకు సంబంధం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేరళ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ కూటములే ప్రధా న ప్రత్యర్థులని, అలాగే పశ్చిమ బెంగాల్‌లో సైతం తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థు లని, కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రజల ప్రయోజ నాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు.
ప్రీ పోల్, పోస్ట్ పోల్ పొత్తులు
కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్), కొన్ని ఎన్నికల అనంతర (పోస్ట్ పోల్) పొత్తులు ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా మని, ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఈ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు.
26 నుంచి ’సేవ్ ఆర్టీసీ’ పేరిట నిరసన
ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరు తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్య క్రమాలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తా మని కూనంనేని తెలిపారు. ఆగస్టు 7న ఇళ్లు, గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో పాటు ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్‌లు ముట్టడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment