sambasivarao
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్‌రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్‌ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్‌గా బీఆర్ఎస్కు రూ.13 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. -
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
సాక్షి, హైదరాబాద్: శ్రీ రాముడు బీజేపీ ఖైదీగా ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరు విముక్తి చేస్తారా అని ఆ రాముడు ఎదు రుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్య్లూజే) మంగళవారం కూనంనేని సాంబశివరావుతో మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీయూ డబ్య్లూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టు మల్లయ్య మోడరేటర్‌గా వ్యవహరించారు.కూనంనేని మాట్లా డుతూ పేద హిందువులకు మోదీ ఏం చేశారని నిలదీశారు. మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేస్తు న్నారని, రాజ్యాంగాన్ని మార్చబోనని చెబుతున్న బీజేపీ, ముస్లిం రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని ముందు జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతు న్న డబ్బులు ఎక్కడి నుంచి వ స్తున్నాయని ప్రశ్నించారు. ప్రధా ని మోదీ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అధి కారం కోసం ఆయన ఏమైనా చేస్తా రని కూనంనేని విమర్శించారు. ఇక దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీజేపీయేనని, అందుకే ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుస్తుందని, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని ఆయన అంచనా వేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, ఉద్య మకారుల గొంతు నొక్కారని, ఢిల్లీలో మోదీ కూడా అలాగే వ్యవహారిస్తున్నారని విమర్శించారు.మా మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలవదు...లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని కూనంనేని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు తమకిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
‘ఇండియా’లో బీఆర్ఎస్ లేకున్నా పొత్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ లేకపోయినా ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి సీపీఐ, సీపీఎంకు ఎలాంటి సమస్య లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అంశం తలెత్తదన్నారు. ‘ఇండియా’ కూటమికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితు లకు సంబంధం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ కూటములే ప్రధా న ప్రత్యర్థులని, అలాగే పశ్చిమ బెంగాల్లో సైతం తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థు లని, కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రజల ప్రయోజ నాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు. ప్రీ పోల్, పోస్ట్ పోల్ పొత్తులు కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్), కొన్ని ఎన్నికల అనంతర (పోస్ట్ పోల్) పొత్తులు ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మని, ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఈ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. 26 నుంచి ’సేవ్ ఆర్టీసీ’ పేరిట నిరసన ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరు తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్య క్రమాలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తా మని కూనంనేని తెలిపారు. ఆగస్టు 7న ఇళ్లు, గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో పాటు ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు. -
పర్చూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కారంచేడు మండల టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం నిర్వహించిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం దీనికి వేదికైంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓ వర్గానికి కొమ్ముకాయడంతో రెండో వర్గం నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో గురువారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. స్థానిక నేత అక్క య్య చౌదరికి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశా రు. గంటకు పైగా కారంచేడులో టీడీపీ నేతల వీరంగం కొనసాగింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అనూరాధతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల సమక్షంలోనే విభేదాలు రచ్చకెక్కడం గమనార్హం. నేపథ్యమిదీ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమం గురువారం కారంచేడు చేరింది. తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్యచౌదరి టీడీపీ కార్యాలయంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కోరారు. ఎమ్మెల్యే అందుకు అంగీకరించకపోవడంతో రావాల్సిందేనని అక్కయ్యచౌదరి పట్టుబట్టాడు. బస్సులోంచి దిగిన ఎమ్మెల్యే కార్యాలయం బయటే నిలబడి కార్యకర్త ఇచ్చిన జెండా నిలబెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అక్కయ్యచౌదరి వర్గం ఎమ్మెల్యే ఎగురవేసిన టీడీపీ జెండాను అక్కడికక్కడే పీకేశారు. పార్టీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘పార్టీ వద్దు.. బొక్కా వద్దు’ అంటూ చిందులు తొక్కారు. పార్టీ పదవికి రాజీనామా ఈ ఉదంతంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కయ్యచౌదరి ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని అనునిత్యం కాపాడుకుంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. ఇంత కష్టపడినా ఎమ్మెల్యే వద్ద తనకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ పార్టీని పాడు చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై అధిష్టానంతోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. కారంచేడుకు చెందిన సీనియర్ నేత అక్కయ్యచౌదరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలో బలమైన నాయకుడైన ఆయన గతంలో కారంచేడు ఎంపీపీ, పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ప్రస్తుతం కారంచేడు–2 ఎంపీటీసీగా ఉన్నారు. కాగా, అక్కయ్యచౌదరికి వ్యతిరేకంగా ఇదే మండలానికి చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి ప్రహ్లాదరావు ప్రత్యేకంగా గ్రూపు కట్టా రు. అక్కయ్య చౌదరి వ్యతిరేక వర్గీయులను చేరదీశారు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదా లు తారస్థాయికి చేరగా.. తాజాగా రోడ్డునపడ్డాయి. -
విజయవాడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి
సాక్షి, గుంటూరు : ఇటీవలే టీడీపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన చందు సాంబశివరావు బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్ చౌహాన్ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరావుకు కండువా కప్పిన చౌహాన్ సాదారంగా బీజేపీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన సాంబశివరావు.. గతకొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో.. పార్టీకీ రాజీనామా చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండా మోసిన అనుభవం సాంబశివరావుకుంది. 2004లో గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేశారు. సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించలేదని.. ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితుల సమాచారం. -
టీడీపీకి మరోషాక్.. సీనియర్ నేత రాజీనామా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని ఆయన అత్యంత సన్నిహితుల సమాచారం. గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన సాంబశివరావు.. గతకొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో.. పార్టీకీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండా మోసిన అనుభవం సాంబశివరావుకుంది. 2004లో గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేశారు. సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించలేదని.. ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది..
సాక్షి, కొత్తగూడెం: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. విడాకులు ఇవ్వకుండా, మరదలిని పెళ్లి చేసుకున్న అతగాడిని మొదటి భార్య అందరి ముందు దేహశుద్ది చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజతో వివాహం అయింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘టాలీవుడ్ అంత సులువుగా వదలదు’
సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ తెలుగు టీవీ ఛానెల్ అనుసంధానకర్త సాంబశివరావుపై నటి మంచు లక్ష్మీ మండిపడ్డారు. సదరు చానెల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌తో సహా ట్వీట్ చేసిన ఆమె.. సినీ పరిశ్రమలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ అంతసులువుగా వదలదని తేల్చిచెప్పారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తూ పబ్లిసిటీ తెచ్చుకుందామని ప్రయత్నించడం కంటే నీచమైన పని మరొకటి లేదన్నారు. జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారు బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. మంచు లక్ష్మీ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి.. మహిళలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్న వీడియోలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అయ్యాయని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా మహిళలను అవమానిస్తున్నారని.. శనివారం టీవీ చానెల్ డిబేట్లో ఓ ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుని మరీ అసభ్యంగా మాట్లాడారని అన్నారు. కాగా, శనివారం రాత్రే టాలీవుడ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సాంబశివరావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన వారిలో టాలీవుడ్ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్ తదితరులు ఉన్నారు. -
ఏపీలో పోలీసుల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల విషయంలో 2017లో రాష్ట్ర పోలీసులు ఎక్కడా ఫెయిల్ కాలేదని, పోలీసుల పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఎర్రచందనం విషయంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారంటూ ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, స్మగ్లర్లను పట్టుకోవడంలో మంచి పురోగతి సాధించామని విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ నేరాలు 46 శాతం పెరిగాయన్నారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఎ, బి, సి, డి కేటగిరీలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. రహదారి ప్రమాదాలను 5 శాతం తగ్గించామన్నారు. రూ.68 కోట్లను చలానా రూపంలో వసూలు చేశామని, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు 20 టీమ్‌లను ఏర్పాటు చేశామని, నక్సల్స్‌ను నియంత్రించడంలో విజయం సాధించామని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నక్సల్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. కోడి పందేల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ పిన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ వల్ల పోలీసులు సీజ్ చేసిన వాహనం ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల విషయంలో ఇది ఎంతో ఉపయోగకరమని సాంబశివరావు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ఎంజాయ్ చేయొచ్చని, అయితే మత్తు పానీయాలు తాగని వారితోనే వాహనం నడిపించాలని సూచించారు. -
ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య!
అమారావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. -
భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్: ఏడంతస్థుల భవనం పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబ్సిగూడ కాకతీయనగర్‌లో శనివారం వెలుగుచూసింది. కాలనీలోని సూర్యాస్పేన్డెర్ టవర్‌లో నివాసముంటున్న సాంబశివరావు(65) అనే వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
అగ్రిసెట్‌లో ‘పురం’ విద్యార్థి ప్రతిభ
హిందూపురం టౌన్ : పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన సాంబశివరావుకు అగ్రిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 57వ ర్యాంకు వచ్చినట్లు విద్యార్థి తం డ్రి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. విద్యార్థి సాంబశివరావు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసి గత జూలైలో నిర్వహించిన అగ్రిసెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 57వ ర్యాంకుతో తిరుపతి అగ్రికల్చర్ బీఎస్సీలో ఉచిత సీటు సంపాదించాడు. -
లక్ష ఆర్జిత సేవాటికెట్ల విడుదల
అరగంటలోనే 25వేల టికెట్ల బుకింగ్ సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవల కు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మొత్తం 1,09,092 టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. భక్తులు www.ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు. ఇంతపెద్ద మొత్తంలో శ్రీవారి సేవా టికెట్లు విడుదల చేయటం ఇదే తొలిసారి. సేవా టికెట్లు విడుదల చేసిన 30 నిమిషాల్లోనే 80వేల మంది భక్తులు 25వేల పైచిలుకు టికెట్లు రిజర్వు చేసుకున్నారన్నారు. శ్రీవారి, పద్మావతి చిత్రాలతో కూడిన రెం డు గ్రాముల బంగారు డాలర్లు శుక్రవారం నుండి అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 15 రోజుల్లో తక్కువ ధరతో కూడిన రాగి డాలర్లు కూడా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఆ ప్రాంతీయత ఇక్కడ పనిచేయదా?
తెరాస పార్టీని రక్షిస్తేనే అది తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందనే ప్రాంతీయ చైతన్యంతోనే వరంగల్ ఉపఎన్నికలో ఓటర్లు అసాధారణ తీర్పునిచ్చారు. అది హైదరాబాద్‌లో గెలుపుకు మార్గం సుగమం చేయదు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా పునరావృతం అవు తుందనే ప్రకటనలు పరం పరగా వెలువడుతున్నాయి. అంటే వరంగల్‌లో సాధిం చినట్లే గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా తెరాస ఘన విజయం సాధిస్తుందని చెప్పటమే వాటి ఉద్దేశ్యం. వరంగల్ ఫలితాలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు గానీ, కేవలం ఆ ప్రభావంతో గెలుపు సాధ్యం కాదు. వరంగల్ క్షేత్రస్థాయి పరిస్థితి వేరు.. గ్రేటర్ హైదరాబాద్ క్షేత్రస్థాయి పరిస్థితి వేరు. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమానికి వరంగల్ ప్రధాన కేంద్రం. అందుకే ఓరుగల్లు తెలంగాణ పోరాట పోరుగల్లుగా పేరుగాంచింది. కానీ హైదరాబాద్ నగరం తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డాగా, హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా, ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలని అడ్డం తిరిగిన ప్రతికూల శక్తుల కేంద్రంగా పేరుగాం చింది. అంతేకాదు.. ఎలాంటి పోరాటాలతో పని లేకుండా ఓట్లు, సీట్లు లాబీయింగ్ ద్వారా సులభ మార్గంలో తెలంగాణ సాధిస్తానని ప్రగల్భాలు పలికి తెలంగాణ ఉద్యమ శక్తులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, 2009 సాధారణ ఎన్నికల తర్వాత ఏ అధికార పార్టీ అండలేక, లాబీయింగ్‌కు అవకాశం లేక చివరికి 2009 నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయటానికే భయపడి పలాయనం చిత్తగించాల్సిన దుస్థితి కల్పించిన రాజధాని నగరం. చివరికి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి, తెలంగాణ ప్రాంతీయతకే అస్తిత్వం లేకుండా చేసిన సంక్షోభ స్థితిలో, కేసీఆర్ సులభ మార్గానికి తెరపడి ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యం అనే ఉద్యమకారుల బాటపట్టక తప్పని స్థితి కల్పించిన హైదరాబాద్‌ని గెలవటం అంత తేలిక కాదని కేసీఆర్‌కి ఎప్పటి నుంచో తెలుసు. అందుకే వరంగల్ ఉపఎన్నికల కంటే ముందే, నవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలకి చెందిన బలమైన స్థానిక నాయకులను ఏదో ఒక ఆశజూపి వశం చేసుకు న్నారు. ఇప్పుడు ఆ వశీకరణ ఆకర్ష్ పథకాన్ని ముమ్మరం చేశారు. అంతేకాదు తెలంగాణాయేతర సీమాంధ్రులను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా పోటీ చేయిం చడం, 150 వార్డుల్లో 50 వార్డులు ఎంఐఎం వారికి మిన హాయించి మిగతా వంద స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా తెరాస సంస్థాగత బలహీనతను అధిగమించే ఎత్తుగడ వేశారు. ఈ చర్యలేవీ తీసుకోకుండా వరంగల్ ఫలితం దానంతటదే హైదరాబాద్‌లో పునరావృతం కాదనేది స్పష్టం. సంక్షేమ పథకాలతో వరంగల్ ప్రజల్ని ప్రభావితం చేసినట్లే హైదరాబాద్ మీద సంక్షేమ అభివృద్ధి పథకాల వరాల వర్షం కురిపించినా వాటి ప్రభావం పరిమితమే. ‘పద్నాలుగేళ్ల పోరుతో స్వపరి పాలన! ఒకే ఏడాదిలో సుపరిపాలన!’ అనే నినా దంతో నవ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెరాస ప్రభుత్వ పనితీరు, వరంగల్ ఎన్నికల్లో తెరాస సభ్యుల పనితీరు చూసి జనం ఓటేసి గెలిపించారనేది కూడా పూర్తి వాస్తవం కాదు. వరంగల్‌లో గెలుపును నిర్దేశిం చిన ప్రధానాంశం, ఇక్కడ హైదరాబాద్‌లో అప్రధా నాంశం అవుతుంది. అందుకే వరంగల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రధానాంశం ఏమిటో నిర్దిష్టంగా పరిశీలించటం అవసరం. వరంగల్ ఓటర్లు గుండుగుత్తగా తెరాస వైపు అంతగా మొగ్గు చూపటం ఎందుకు జరిగిందనేదే ఆ ఎన్నికల్లో కీలకాంశం. కేసీఆర్ వ్యవహారశైలిపై, తెరాస ప్రభుత్వంపై తొలిదశలో ప్రజల్లో వ్యక్తమైన ప్రాథమిక స్థాయి అసంతృప్తి (వ్యతిరేకత కాదు) మరుగున పడిపోయి, ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణకి తెలం గాణ ప్రాంతీయ పార్టీ అయిన తెరాసను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటం అవసరమనే ప్రాంతీయ చైతన్యం ప్రధానాంశంగా మారటం వల్లనే ఇలా జరిగిం దనేది స్పష్టం. వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస బలహీనపడితే, తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి పెచ్చు పెరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆంధ్రా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కో వటం కష్టమవుతుందేమోననే అభద్రతా భావం వరం గల్ ప్రజల్లో ఏర్పడింది. ఆ అభద్రతా భావమే ఏకైక తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయిన తెరాస పలుకు బడిని భద్రంగా కాపాడుకోవాలనే ప్రజాభిప్రాయా నికి దారి తీసింది. తెరాస పార్టీని రక్షిస్తేనే అది తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందనే ప్రాంతీయ చైతన్యంతోనే ఇలాంటి అసాధారణ తీర్పునిచ్చారు. కనుక ఓరుగల్లు తీర్పు ప్రాంతీయతకే పట్టం కట్టిన పోరుగల్లు తీర్పు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరాసది కావచ్చు, తెరాస కేసీఆర్‌ది కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదు. 2001లో తెరాస ఏర్పడక ముందే 1996 నుంచి ఐదేళ్లపాటు తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమంగా మార్చిన తెలంగాణ ప్రజా ఉద్యమ శక్తులు ప్రజల ఆకాంక్షలకి ప్రాతినిధ్యం వహించగలవు. తెరాస పార్టీయే తెలంగాణకి దిక్కన్నట్లు లెక్కలేకుండా వ్యవహరిస్తే తెలంగాణ ఉద్యమ శక్తుల నుండి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు. కాబట్టి ప్రజల్లో గూడుగట్టుకొన్న అసం తృప్తికి కారణాలేమిటో పరిశీలించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ప్రజలు, ప్రజా ఉద్యమ శక్తులు చూస్తూ వూరుకోవని గ్రహించడం మంచిది. ముందు భౌగోళిక తెలంగాణ రాష్ట్రం రానివ్వండి, సామాజిక తెలంగాణ విషయం తరువాత చూద్దాం అని తెలంగాణ రాకముందు వాగ్దానం చేసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బడుగు వర్గాల వారిని కూడా భాగస్వాముల్ని చేసే సమ్మిళిత అభివృద్ధి నమూనాని అమలు జరపటం ఆయన బాధ్యత అని గుర్తు చేస్తున్నాం. వ్యాసకర్త: సాంబశివరావు, చైర్మన్, బహుళ బహుజన సమితి మొబైల్ :77029 41017 -
ఆటో డ్రైవర్ నిజాయితీ..
తన ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి.. విలువైన వస్తువుల బ్యాగ్ మరిచాడు.. ఇది గమనించిన ఆటో డ్రైవర్ పోలీసుల సాయంతో బ్యాగును ప్రయాణికుడికి చేర్చాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న చౌట శ్రీనివాసరావు మంగళవారం తెనాలి మారీసుపేటలో నివసించే తన అక్క వద్దకు వచ్చాడు. పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆటో ఎక్కి, మారీసుపేటలో దిగాడు. ఆటోను బస్టాండ్ సమీపంలోని స్టాండుకు తీసుకువచ్చిన డ్రైవర్ సాంబశివరావు బ్యాగ్ ఉండడాన్ని గమనించి టూ టౌన్ పోలీసులకు అప్పగించాడు. అందులో రూ. 650 నగదు, బంగారు గొలుసు, ఏటీఎం కార్డులు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. శ్రీనివాసరావు వివరాలను సేకరించిన పోలీసులు అతనికి బ్యాగును అప్పగించారు. బ్యాగును నిజాయితీగా అప్పగించిన డ్రైవర్ సాంబశివరావును టూ టౌన్ పోలీసులు అభినందించారు. -
బ్రహ్మోత్సవాలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5 లక్షల 21 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. మొత్తం 22 లక్షల 60 వేల లడ్డూలను భక్తులకు అందించామని తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో 2 లక్షల 3 వేల మంది తలనీలాలు సమర్పించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.19 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో సాంబశివరావు మీడియాతో వెల్లడించారు. -
శ్రీవారి ప్రసాదంగా శ్రీగంధం మొక్కలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు, రైతులకు ప్రసాదంగా శ్రీగంధం (ఎర్రచందనం) మొక్కలు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలోని శ్రీగంధం వనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాచలంలో 7,500 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందని, అందులో 250 ఎకరాల్లో శ్రీగంధం, మరో 250 ఎకరాల్లో ఎర్రచందనం పెంచుతామన్నారు. ఇప్పటికే 10 లక్షల ఎర్రచందనం మొక్కల పెంచామని, వచ్చే ఏడాదికి మొత్తం 25 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచనున్నట్లు వెల్లడించారు. -
తిరుమలలో 1752 నకిలీ లడ్డూ టికెట్లు!
తిరుమలలో నకిలీ లడ్డూ టికెట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటివరకు తాము 1752 నకిలీ లడ్డూ టికెట్లను గుర్తించామని ఆయన చెప్పారు. అక్రమాల్లో టీటీడీకి చెందిన ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందని ఈవో సాంబశివరావు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఐదుగురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. -
రాజయ్య సన్నిహితుడి ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసీబీ గురువారం తెల్లవారుజాము ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. వరంగల్‌తో పాటు మరో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హయాంలో సాంబశివరావు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా 108 అంబులెన్స్‌ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని సాంబశివరావు చెబుతున్నారు. -
ఆర్టీసీని బాగుచేద్దాం రండి: ఎండీ సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బాగుకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 1.20 లక్షల మంది సంస్థ సిబ్బందికి లేఖలు రాయాలని నిర్ణయించింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఒక్క రోజులో రూ.32 కోట్ల ఆదాయంలో 6 కోట్ల లాభాన్ని పొందింది. ఒకే రోజు ఇంత ఆదాయం, లాభం రావటం ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారి. సిబ్బంది సమైక్య కృషివల్లే ఇది సాధ్యపడిందని యాజమాన్యం పేర్కొంది. దీంతో కార్మికులు, ఉద్యోగుల్లో కొత్త చైతన్యం తేవాలని సంస్థ కొత్త ఎండీ సాంబశివరావు నిర్ణయించారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించాలని కార్మికులు, ఉద్యోగులను కోరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. -
డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సాంబశివరావుపై వేటు
-
వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావుపై వేటు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిరోధించటంతో పాటు, మందుల పంపిణీ విషయంలో వైద్య శాఖ పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఆయన...వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావుపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. దాంతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్‌లో సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
టీటీడీ ఈవో గోపాల్ బదిలీ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రప్రభుత్వం ఈమేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గోపాల్ బదిలీ అయ్యారు. గోపాల్ స్థానంలో డి.సాంబశివరావు నియమితులయ్యారు. మున్సిపల్ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎ. గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించగా, గుల్జార్, ఎంజీ గోపాల్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖను సంప్రదించాలని వారికి ఆదేశాలు అందాయి. కాగా గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపిక అయ్యారు. -
విజయవాడ-అహ్మదాబాద్ మధ్య 30న ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా విజయవాడ-అహ్మదాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 30న రాత్రి 7 గంటలకు నంబర్ 02714 రైలు విజయవాడలో బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం 5.45కు అహ్మదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నంబర్ 02713 రైలు మే 31న రాత్రి 7.30కి అహ్మదాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.55కు విజయవాడ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మంగళవారం తెలిపారు. కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ పాక్షిక రద్దు కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలు(నం.57623) 6 గంటలకుపైగా ఆలస్యంగా నడుస్తుండడంతో మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దీనిని కర్నూలుసిటీ వరకే నడుపుతున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కాచిగూడకు బదులు తిరిగి గుంటూరుకు పయనమవుతుందన్నారు. ఫలితంగా 22న కాచిగూడ-క ర్నూలు రైలు ఉండదన్నారు. -
విద్యా శాఖలో కలకలం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యా శాఖలో అవినీతి వ్యవహారం మరోసారి బట్టబయలైం ది. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఓ ఉపాధ్యాయుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా బోధన్ డిప్యూటీ ఈఓ సాంబశివరావు, జుక్కల్ ఎంఈఓ దేవారావులను మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో డీఈఓను సైతం ప్రశ్నిస్తామని ఏసీబీ డీఎస్పీ పేర్కొనడం విద్యాశాఖ వర్గాలలో చర్చనీయాంశమైంది. గతం నుంచి పాఠాలు నేర్వకుండా 2009లో డీఈఓ భృగుమహర్షి తన ఇంటిలో ఓ టీచర్ వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అయినా విద్యాశాఖలోని కొందరు అధికారులలో మార్పు రాలేదు. డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడుతున్నారు. జిల్లాలో 150 పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుం డానే సాగుతున్నాయి. ఆయా పా ఠశాలలకు అగ్నిమాపక శాఖ, వైద్యశాఖల అనుమతి లేదు. అయినా ఆయా పాఠశాలలకు గుర్తింపు పత్రం ఇచ్చారు. అధికారులు రూ. 20 వేలనుంచి రూ. 30 వేలు తీసుకొని గుర్తింపు పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రుతి మించి రాగాన బోధన్ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి, ఎంఈఓల వ్యవహారం మరీ శ్రుతి మిం చినట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీల పేరుతో తనిఖీలు చేస్తూ ఉపాధ్యాయులకు మె మోలు ఇస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని సమాచారం. ఇలా సస్పెం డైనవారిని తిరిగి విధులలోకి తీసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. సదరు అధికారి డబ్బులు తీసుకొని ఈ డివిజన్లో ఎనిమిది పాఠశాలలకు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. జుక్కల్, మద్నూర్, బాన్సువాడలలో అనుమతిలేని పాఠశాల లు చాలా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలనుంచి మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని తెలిసింది. ఈ వ్యవహారానికి విద్యా సంఘాలకు చెందిన కొందరు నాయకులు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. డివిజన్లో అక్రమ పదోన్నతులు, బదిలీలు కూడా జరిగాయని, పలువురు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతుల విషయమై సీబీసీఐడీ విచారణ సైతం జరిగింది. దోషులను తేల్చి కేసులు నమోదు చేశారే కానీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన విద్యాశాఖ అధికారులే అవినీతికి పాల్పడుతుండడంపై విద్యాభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నివారణే ఉత్తమ బీమా
అగ్నిమాపక శాఖ డీజీ సాంబశివరావు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాల నివారణే ఉత్తమ బీమా అని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ సాంబశివరావు అన్నారు. ఇదే నినాదంతో ఈ ఏడాది ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ముందుకు వెళుతున్నామని చెప్పారు. రూ.40 లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మోడల్‌గా నిర్మిస్తున్న ఇన్నీస్‌పేట అగ్నిమాపక కే ంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా బ్రోచ ర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్రిబ్సీ విధానంతో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే నెల 15న ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామన్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అగ్నిప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నూతన పరికరాలను పరిశీలించారు. సివిల్ డిఫెన్స్ డెరైక్టర్ కె.జయానందరావు, డీఎఫ్ఓ ఉదయ్‌కుమార్, ఏడీఎఫ్‌ఓ ప్రశాంత్‌కుమార్, రాజమండ్రి ఫైర్ ఆఫీసర్ ఎ.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తతే నివారణోపాయం : డీఎఫ్ఓ కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించడమే.. వాటి నివారణకు మార్గమని జిల్లా అగ్నిమాపకాధికారి (డీఎఫ్ఓ) టి.ఉదయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ఆయన ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో ఆయుధాలు, గన్‌పౌడర్ కలిగిన నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి.. 336 మంది పౌరులతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించిన వారి సంస్మరణార్థం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ అప్రమత్తతే ప్రమాదాల నివారణకు ఆయుధమన్నారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయనే అంశాలపై ప్రాథమిక అవగాహన ఉండాలన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలో పరేడ్ నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అత్యాధునిక అగ్నిమాపక యంత్రాలు, ఇతర పరికరాలను ప్రదర్శించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలకు వాటి వినియోగంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణపై రూపొందించిన కరపత్రాలను డీఎఫ్ఓ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ డీఎఫ్ఓ బీజేడీఎస్ ప్రశాంత్ కుమార్, ఎస్ఎఫ్ఓ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు. -
ట్రావెల్స్ బస్సులపై దాడులు ఆపండి
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: ప్రైవేటు ట్రావెల్స్‌పై అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్‌చేశారు. అక్రమ దాడులతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయం ఎదుట కార్మికులు, నిర్వాహకులు ధర్నా చేశారు. బస్సులతోసహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, తమ జీవనోపాధికి గండి కొట్టవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు చేస్తున్నారని, దీంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 500 కుటుంబాల వరకు ఈ ట్రావెల్స్‌పై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణాశాఖ అధికారుల తీరుతో తమకు ఉపాధి ఉండడం లేదన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్‌చేశారు. ఈ రంగంలో అనేక మంది మెకానిక్‌లు, క్లీనర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండ.. ట్రావెల్స్ బస్సు కార్మికులు ఆర్టీవో కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ నసీర్ అహ్మద్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, ఎస్సీ విభాగం నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకులు జూలూరి హేమంగద గుప్తా, శ్రీకాంత్‌యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సులు ఆపడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. నగరంలోనే వందల కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలకు కార్మికులు, నిర్వాహకులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. డీటీసీ సుందర్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఈనెల 27న మళ్లీ ఆందోళన చేపడతామని నాయకులు తెలిపారు. -
సమైక్య తీర్మానం, ఓటింగ్‌తోనే పరిష్కారం
ఒంగోలు కలెక్టరేట్/మార్కాపురం/కందుకూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలన్న తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పాలకుల వాదనపై జిల్లాలోని సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానంతోగానీ, విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియతోగానీ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. బిల్లుపై చర్చ పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు సీఎం కుట్రచేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై జిల్లావాసుల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి... ఓటింగ్‌తో నిజమైన సమైక్యవాదులు తేలుతారు రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్‌తోనే నిజమైన సమైక్యవాదులు తేలుతారు. సమైవాదుల ముసుగులో కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు. కాలయాపన కోసమే చర్చను తెరపైకి తీసుకువచ్చారు. - శెట్టి గోపి,ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాష్ట్రనేత ప్రభుత్వంతో అశోక్‌బాబు కుమ్మక్కు రాష్ట్ర విభజనపై ప్రజలు రగులుతుంటే ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. ఉద్యోగులు 66 రోజులపాటు సమ్మె చేస్తే దానికి సరైన ఫలితం లేకుండానే ముగించేశారు. విభజనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలను కలుపుకోలేదు. సీఎం డెరైక్షన్‌లో సమైక్యాంధ్ర పోరాటం చేశారు. సమైక్యాంధ్ర కోసం నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను చర్చల్లో పాల్గొనకుంటే ముట్టడిస్తామనడం అశోక్‌బాబు అవివేకం. - మాంటిస్సోరి ప్రకాష్, సమైక్యాంధ్ర ట్యుటోరియల్స్ నేత చర్చించినా పరిష్కారం లభించదు రాష్ట్ర విభజన బిల్లు గురించి చర్చించినా ఎలాంటి పరిష్కారం లభించదు. ఎన్ని రోజులు చర్చించినా ఉపయోగం ఉండదు. చర్చ అంశాన్ని పక్కనపెట్టి ఓటింగ్ కోసం సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు పట్టుబట్టాలి. ఓటింగ్ ద్వారా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తేలుతోంది. వైఎస్ విజయమ్మ సూచనకు అన్ని పార్టీలు సహకరించాలి. - సాంబశివరావు, విద్యుత్ జేఏసీ జిల్లా కన్వీనర్ -
విద్యార్థుల ఆకలి కేకలు
చీరాల రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారుతోంది. చీరాల పట్టణంలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..చీరాల పట్టణంలోని ఆంధ్రరత్న మునిసిపల్ ఉన్నత పాఠశాల, ఎన్‌ఆర్‌అండ్‌పీఎం, కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. ఆంధ్రరత్న మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలోని 388 మంది విద్యార్థుల్లో 50 నుంచి వంద మంది రోజూ పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఈ పాఠశాలకు అత్యధికంగా వాడరేవు, బుర్లవారిపాలెం, మరియమ్మపేట, జయంతిపేట, జాన్‌పేట, పేరాల, గాంధీనగర్, శృంగారపేట, ఆనందపేట, ప్రసాదనగర్లకు చెందిన పేద విద్యార్థులు వస్తుంటారు. అలానే కస్తూరిబా గాంధీ మునిసిపల్ బాలికోన్నత పాఠశాల లో కూడా ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. రోజూ 150 నుంచి 200 మంది విద్యార్థినులు పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఎన్‌ఆర్‌అండ్‌పీఎం పాఠశాలలో వంద మంది భోజనం చేస్తారు. అయితే వారం రోజుల క్రితం కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులను తహసీల్దార్ రద్దు చేశారు. దీంతో ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు రోజూ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నారు. పథకం నిలిచి వారం రోజులైనా సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఆయా పాఠశాలల్లో కుకింగ్ ఏజెన్సీలను కొన్ని రాజకీయ కారణాలతో తొలగించినట్లు సమాచారం. ఏజెన్సీల నిలుపుదల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఏదైనా కారణాలతో ఆగితే ప్రత్యామ్నాయం చూపించాలి. బియ్యం అందకపోయినా ప్రత్యామ్నాయంగా బియ్యం తెప్పించి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. దీనిపై తహసీల్దార్ బీ సాంబశివరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈఓ, ఈఓఆర్డీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన తరువాతే దాని ఆధారంగా కుకింగ్ ఏజెన్సీలను రద్దు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నూతన ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు.