హిందూపురం టౌన్ : పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన సాంబశివరావుకు అగ్రిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 57వ ర్యాంకు వచ్చినట్లు విద్యార్థి తం డ్రి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. విద్యార్థి సాంబశివరావు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసి గత జూలైలో నిర్వహించిన అగ్రిసెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 57వ ర్యాంకుతో తిరుపతి అగ్రికల్చర్ బీఎస్సీలో ఉచిత సీటు సంపాదించాడు.