![Chandu Sambasiva Rao Joins In BJP - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/14/Chandu-Sambasiva-Rao.jpg.webp?itok=7sy7qbS8)
సాక్షి, గుంటూరు : ఇటీవలే టీడీపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన చందు సాంబశివరావు బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్ చౌహాన్ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరావుకు కండువా కప్పిన చౌహాన్ సాదారంగా బీజేపీలోకి ఆహ్వానించారు.
గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన సాంబశివరావు.. గతకొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో.. పార్టీకీ రాజీనామా చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండా మోసిన అనుభవం సాంబశివరావుకుంది. 2004లో గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేశారు. సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించలేదని.. ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment