ఆర్టీసీ బాగుకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 1.20 లక్షల మంది సంస్థ సిబ్బందికి లేఖలు రాయాలని నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బాగుకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 1.20 లక్షల మంది సంస్థ సిబ్బందికి లేఖలు రాయాలని నిర్ణయించింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఒక్క రోజులో రూ.32 కోట్ల ఆదాయంలో 6 కోట్ల లాభాన్ని పొందింది. ఒకే రోజు ఇంత ఆదాయం, లాభం రావటం ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారి. సిబ్బంది సమైక్య కృషివల్లే ఇది సాధ్యపడిందని యాజమాన్యం పేర్కొంది. దీంతో కార్మికులు, ఉద్యోగుల్లో కొత్త చైతన్యం తేవాలని సంస్థ కొత్త ఎండీ సాంబశివరావు నిర్ణయించారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించాలని కార్మికులు, ఉద్యోగులను కోరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.