సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. టికెట్ల ధరలను రూ.5, రూ.10 డినామి నేషన్లలోనే ఉండేలా సవరించింది. దీంతో ఇక రూపాయి, రెండు రూపాయల చిల్లర సమస్య దాదాపుగా తీరిపోనుంది. ఇదే సమయంలో పలు స్టాపుల మధ్య చార్జీల్లో మార్పులు జరగను న్నాయి. ఇప్పటివరకు రూ.7గా వున్న కనీస టికెట్ ధర రూ.5కు తగ్గనుంది. దీంతోపాటు రూ.8, 11, 13, 17, 22, 28 వంటి చార్జీలను ఆయా ధరలకు (రూ.5, రూ.10, రూ.15, రూ.20, రూ.25, రూ.30గా) మార్చారు. హైదరాబాద్, వరంగల్‌ల లోని సిటీ బస్సులకు ఇది వర్తిస్తుంది. అయితే బస్సు పాసుల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. సంక్రాంతి రోజు (సోమవారం) నుంచే ఈ సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ రమణారావు వెల్లడించారు.
చిల్లర లేక గొడవలు..
2016 జూన్‌లో ఆర్టీసీ టికెట్ ధరలను సవరిం చింది. దీంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనిష్ట టికెట్ ధర రూ.7 గా మారింది. స్టేజీల సంఖ్య పెరిగే కొద్దీ రూ.8, 9, 11, 13, 16, 17, 18, 19... 28 వరకు వివిధ ధరలు నిర్ణయించారు. మెట్రో బస్సుల్లో రూ.8 నుంచి రూ.31 వరకు, మెట్రో డీలక్స్‌లలో రూ.9 నుంచి రూ.32 వరకు నిర్ధారిం చారు. అయితే టికెట్ ధరల కారణంగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ప్రయా ణికులు సరిపడా చిల్లర ఇవ్వక పోవడం, కండక్టర్ల వద్ద చిల్లర సరిపోకపోవడంతో.. ఇద్దరు ముగ్గురు ప్రయాణికులకు కలిపి నోట్లు ఇచ్చి చిల్లరగా మార్చు కొమ్మని చెప్పాల్సి వచ్చింది. దీని కారణంగా ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వా దాలు, ఘర్షణలు కూడా జరిగాయి. ఆర్టీసీ అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను హేతుబద్ధీకరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఇవీ చార్జీల్లో మార్పులు
- సిటీ ఆర్డినరీ బస్సుల్లో.. కనీస టికెట్ ధర రూ.7 నుంచి రూ.5కు తగ్గింది. రూ.8 నుంచి రూ.11 టికెట్ ధరలు రూ.10గా.. రూ.13 నుంచి రూ.17 ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు ధరలు రూ.20గా.. రూ.23 నుంచి రూ.27 వరకున్న ధరలు రూ.25గా.. రూ.28 టికెట్ రూ.30గా మారింది.
- మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. రూ.8 నుంచి రూ.12 వరకున్న టికెట్ ధరలను రూ.10కి మార్చారు. రూ.13 నుంచి రూ.17 వరకు ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు చార్జీలు రూ.20గా.. రూ.23 నుంచి రూ.27 వరకు ధర రూ.25గా.. రూ.29 నుంచి రూ.31 వరకు చార్జీలు రూ.30గా మారా యి.
- మెట్రో డీలక్స్ బస్సుల్లో.. రూ.9, రూ.11 టికెట్ ధరలు రూ.10గా మార్చారు. రూ.13 నుంచి రూ.17 ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు ధర రూ.20గా.. రూ.23 నుంచి రూ.26 వరకు చార్జీలు రూ.25గా.. రూ.28 నుంచి రూ.32 వరకున్న ధరలు రూ.30గా మారాయి.
- ఇక చిన్న పిల్లల టికెట్ ధరను సాధారణ టికెట్ ధరలో సగంగా నిర్ధారించారు. అయితే ఇందు లోనూ చిల్లర సమస్య రాకుండా సమీపంలోని రౌండ్ ఫిగర్ ధరకు (రూ.5, 10, 15.. ఇలా) మార్చుతున్నారు. ఉదాహరణకు పెద్దవారి టికెట్ రూ.25 ఉంటే చిన్నపిల్లల టికెట్ రూ.15గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment