రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది..  | Wife Protests Over Second Marriage of Husband in kothagudem | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది.. 

Apr 19 2019 6:41 PM | Updated on Apr 19 2019 6:55 PM

Wife Protests Over Second Marriage of Husband in kothagudem - Sakshi

సాక్షి, కొత్తగూడెం: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. విడాకులు ఇవ్వకుండా, మరదలిని పెళ్లి చేసుకున్న అతగాడిని మొదటి భార్య అందరి ముందు దేహశుద్ది చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజతో వివాహం అయింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement