ramavaram
-
రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది..
సాక్షి, కొత్తగూడెం: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. విడాకులు ఇవ్వకుండా, మరదలిని పెళ్లి చేసుకున్న అతగాడిని మొదటి భార్య అందరి ముందు దేహశుద్ది చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజతో వివాహం అయింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
అగ్నిప్రమాదం..8 బైక్‌లు దగ్ధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరంలోని ఓ బైక్ మెకానిక్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది చెత్తను తగలపెట్టడంతో, ఆ అగ్గి రవ్వలు వచ్చి దుకాణంలో ఉన్న బైకులకు తగులుకోవడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటూ దుకాణం యజమాని, మెకానిక్ సాయి రామవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫొటో ఒకటే.. పాస్ పుస్తకాలు నాలుగు
దళారుల మాయాజాలం కంప్యూటర్ పహాణీ మార్పునకు దరఖాస్తు చేసుకోగా వెలుగులోకి.. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు కొడకండ్ల : అవి నాలుగు వేర్వేరు పట్టాదారు పాసు పుస్తకాలు. కానీ.. వాటిపై ఒకే మహిళ ఫొటో ఉంది.. పేర్లు, కుటుంబపరమైన వివరాలు మాత్రం అమాంతం మారి పోయాయి. రామవరం గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో సదరు మహిళ కులం ఎస్టీ అనిరా యగా..రేగుల గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో బీసీ అని రాశారు. ఎంతో కన్ఫూ్యజ్ చేసేలా ఉన్న ఈ వివరాలను చూసి రెవె న్యూ అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు. నకిలీ పాస్ పుస్తకాల తయారీదారులు వాటిలో మిగ తా వివరాలన్నీ సవరించి, కేవలం ఫొటోలు మార్చకపోవడంతో తతంగం బట్టబయలై ఉండొచ్చని భావిస్తున్నారు. కొడకండ్ల మండల ఇన్చార్జి తహసీల్దార్ రాములు నాయక్ సమయస్ఫూర్తితో ఈ బాగోతాన్ని వెలుగులోకితెచ్చారు. దాదాపు మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పేరిట కూడా ఇదే విధంగా మూడు, నాలుగు నకిలీపాస్ పుస్తకాలను సృష్టించినట్లు ఆయన గుర్తించారు. మూడురోజుల క్రితమే ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతకుముందు నకిలీ పాస్‌పుస్తకాల సృష్టికర్తలు వాటికి సంబంధించిన కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఇన్చార్జి తహసీల్దార్‌కు అనుమానం కలిగి, వాటిలోని భూముల వివరాల ఆధారంగా సిబ్బంది తో క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. ఈక్రమంలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. అసలు భూమిలేని వారు కూడా పాస్ పుస్తకం కలిగి ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాలపై పేర్లు, ఊర్ల వివరాలు మార్చి, ఆన్లైన్లో కరెక్షన్ చేయించుకోవాలనే కుటిల పన్నాగం బట్టబయలైంది. ఒకవేళ ఈ పాస్ పుస్తకాల కరెక్షన్ పూర్తయి ఉంటే బ్యాంక్‌లో రుణాలకు దళారులు దరఖాస్తు చేయించేవారని పేర్కొం టున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో అనుమానితులు ఈ వ్యవహారానికి సంబంధించి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకొందరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై ఎంబాడి సత్యనారాయణ నకిలీ పాసుపుస్తకాల త యారీ ముఠాపై కూపీ లాగుతున్నారు. విచారణలో అనుమానితులు అందించే సమాచారం ఆధారంగా ముఠా సభ్యులకు సహకరించిన పలువురు రెవెన్యూ సిబ్బంది వివరాలు కూడా వెలుగుచూడనున్నట్లు సమాచారం. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని గిరిజన తండా కేంద్రంగా నకిలీ పాసు పుస్తకాలను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ, కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఇటువంటి బాగోతాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
రామవరం (బిక్కవోలు) : రామవరం గ్రామ శివార్లలోని అయ్యప్ప ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుతుకులూరుకు చెందిన సబ్బెళ్ల సురేంద్రరెడ్డి(17) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం అనపర్తి నారాయణ జూనియర్ కళాశాలలో సురేంద్ర ఫస్టియర్ ఎంపీసీ విద్యార్థి. ఉదయం తన టూ వీలర్‌పై కళాశాలకు వెళుతుండగా, ఎదురుగా వస్తున్న టాటా ఏస్ మినీవ్యాన్ వేగంగా దూసుకువచ్చి అతడిని ఢీకొట్టి పక్కనే ఉన్న పంటబోదెలోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో తలకు బలమైన గాయమైన సురేంద్ర ఆక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు హెచ్‌సీ సన్నిబాబు తెలిపారు. పుత్రశోకంతో ఉన్న సబ్బెళ్ల సూర్యనారాయణరెడ్డి, సుబ్బలక్ష్మి దంపతులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు పరామర్శించి తమ సంతాపం తెలిపారు. కాగా సురేంద్రరెడ్డి ఆ దంపతుల రెండో కుమారుడు. -
లారీని ఢీకొన్న కారు; ఇద్దరి మృతి
జగ్గంపేట(తూర్పుగోదావరి జిల్లా): ఆగి ఉన్న లారీని మారుతి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం సమీపంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. వైజాగ్ శాంతినగర్‌కు చెందిన దుస్తుల వ్యాపారి కిశోర్ కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి శనివారం రాజమండ్రి వెళ్లాడు. కాగా, ఆదివారం రాజమండ్రి నుంచి తిరిగి వైజాగ్ వెళ్తుండగా మార్గ మధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కిశోర్ కుమారుడు నవీన్‌కృష్ణ(16), కుమార్తె పద్మశ్రీ(19)లు అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య జయప్రద, కుమారుడు సాయిలతో పాటు తనూ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని రాజానగరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మావోయిస్టుల విధ్వంసం
వై.రామవరం, న్యూస్‌లైన్ :‘తూర్పు’ సరిహద్దుకు సమీపంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని పలకజీడి పోలింగ్ బూత్‌లో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. వై.రామవరం మండలం జంగాలతోటకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆ గ్రా మానికి బుధవారం మధ్యాహ్నం సుమారు 12.30 గం టలకు వచ్చిన మావోయిస్టులు పోలింగ్ కేంద్రాన్ని స్వా ధీనం చేసుకున్నారు. ఎన్నికల సామగ్రి, రెండు ఈవీ ఎంలు, వాటి కనెక్టర్లు, రెండు రిజర్వు ఈవీఎంలతో పాటు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు అద్దెకు తెచ్చిన ఒక జీపును తగులబెట్టారు. ఎన్నికల సిబ్బంది జోలికి రాని మావోయిస్టులు పోలింగ్ కేంద్రం అధికారి ఆర్.ఇరుకులుకు ఓ లేఖ ఇచ్చి, ఉన్నతాధికారులకు, మీడియాకు అందజేయమన్నారు. ఎన్నికల బహిష్కరణకు తాము పిలుపు ఇస్తున్నా, ప్రజలకు అన్ని సౌకర్యాలూ రద్దు చేస్తామని బెదిరించి, నాటకీయంగా ఎన్నికలను జరిపిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఉద్యోగ భ ద్రత పేరుతో పోలింగ్ సిబ్బందినీ బెదిరించి, ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గాలికొండ ఏరియా మావోయిస్టు కమిటీగా చెప్పుకొన్న ఈ బృందంలోని ఏడుగురు మావోయిస్టుల్లో మహిళ కూడా ఉన్నారు. పలకజీడి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో మావోలు సునాయాసంగా గ్రామంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడగలిగారు. మావోయిస్టులు వెళ్లిపోయిన అనంతరం పోలింగ్ సిబ్బంది కాలినడకన వై.రామవరం చేరుకున్నారు.