వై.రామవరం, న్యూస్‌లైన్ :‘తూర్పు’ సరిహద్దుకు సమీపంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని పలకజీడి పోలింగ్ బూత్‌లో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. వై.రామవరం మండలం జంగాలతోటకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆ గ్రా మానికి బుధవారం మధ్యాహ్నం సుమారు 12.30 గం టలకు వచ్చిన మావోయిస్టులు పోలింగ్ కేంద్రాన్ని స్వా ధీనం చేసుకున్నారు. ఎన్నికల సామగ్రి, రెండు ఈవీ ఎంలు, వాటి కనెక్టర్లు, రెండు రిజర్వు ఈవీఎంలతో పాటు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు అద్దెకు తెచ్చిన ఒక జీపును తగులబెట్టారు.
ఎన్నికల సిబ్బంది జోలికి రాని మావోయిస్టులు పోలింగ్ కేంద్రం అధికారి ఆర్.ఇరుకులుకు ఓ లేఖ ఇచ్చి, ఉన్నతాధికారులకు, మీడియాకు అందజేయమన్నారు. ఎన్నికల బహిష్కరణకు తాము పిలుపు ఇస్తున్నా, ప్రజలకు అన్ని సౌకర్యాలూ రద్దు చేస్తామని బెదిరించి, నాటకీయంగా ఎన్నికలను జరిపిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఉద్యోగ భ ద్రత పేరుతో పోలింగ్ సిబ్బందినీ బెదిరించి, ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గాలికొండ ఏరియా మావోయిస్టు కమిటీగా చెప్పుకొన్న ఈ బృందంలోని ఏడుగురు మావోయిస్టుల్లో మహిళ కూడా ఉన్నారు. పలకజీడి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో మావోలు సునాయాసంగా గ్రామంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడగలిగారు. మావోయిస్టులు వెళ్లిపోయిన అనంతరం పోలింగ్ సిబ్బంది కాలినడకన వై.రామవరం చేరుకున్నారు.
మావోయిస్టుల విధ్వంసం
Published Thu, May 8 2014 1:14 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
Advertisement
Advertisement