- దళారుల మాయాజాలం
- కంప్యూటర్ పహాణీ మార్పునకు దరఖాస్తు చేసుకోగా వెలుగులోకి..
- పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు
ఫొటో ఒకటే.. పాస్ పుస్తకాలు నాలుగు
Published Tue, Aug 23 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
కొడకండ్ల : అవి నాలుగు వేర్వేరు పట్టాదారు పాసు పుస్తకాలు. కానీ.. వాటిపై ఒకే మహిళ ఫొటో ఉంది.. పేర్లు, కుటుంబపరమైన వివరాలు మాత్రం అమాంతం మారి పోయాయి. రామవరం గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో సదరు మహిళ కులం ఎస్‌టీ అనిరా యగా..రేగుల గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో బీసీ అని రాశారు. ఎంతో కన్ఫూ్యజ్ చేసేలా ఉన్న ఈ వివరాలను చూసి రెవె న్యూ అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు. నకిలీ పాస్ పుస్తకాల తయారీదారులు వాటిలో మిగ తా వివరాలన్నీ సవరించి, కేవలం ఫొటోలు మార్చకపోవడంతో తతంగం బట్టబయలై ఉండొచ్చని భావిస్తున్నారు. కొడకండ్ల మండల ఇన్‌చార్జి తహసీల్దార్ రాములు నాయక్ సమయస్ఫూర్తితో ఈ బాగోతాన్ని వెలుగులోకితెచ్చారు. దాదాపు మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పేరిట కూడా ఇదే విధంగా మూడు, నాలుగు నకిలీపాస్ పుస్తకాలను సృష్టించినట్లు ఆయన గుర్తించారు. మూడురోజుల క్రితమే ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతకుముందు నకిలీ పాస్‌పుస్తకాల సృష్టికర్తలు వాటికి సంబంధించిన కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఇన్‌చార్జి తహసీల్దార్‌కు అనుమానం కలిగి, వాటిలోని భూముల వివరాల ఆధారంగా సిబ్బంది తో క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. ఈక్రమంలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. అసలు భూమిలేని వారు కూడా పాస్ పుస్తకం కలిగి ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాలపై పేర్లు, ఊర్ల వివరాలు మార్చి, ఆన్‌లైన్‌లో కరెక్షన్ చేయించుకోవాలనే కుటిల పన్నాగం బట్టబయలైంది. ఒకవేళ ఈ పాస్ పుస్తకాల కరెక్షన్ పూర్తయి ఉంటే బ్యాంక్‌లో రుణాలకు దళారులు దరఖాస్తు చేయించేవారని పేర్కొం టున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పోలీసుల అదుపులో
అనుమానితులు
ఈ వ్యవహారానికి సంబంధించి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకొందరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై ఎంబాడి సత్యనారాయణ నకిలీ పాసుపుస్తకాల త యారీ ముఠాపై కూపీ లాగుతున్నారు. విచారణలో అనుమానితులు అందించే సమాచారం ఆధారంగా ముఠా సభ్యులకు సహకరించిన పలువురు రెవెన్యూ సిబ్బంది వివరాలు కూడా వెలుగుచూడనున్నట్లు సమాచారం. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని గిరిజన తండా కేంద్రంగా నకిలీ పాసు పుస్తకాలను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ, కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఇటువంటి బాగోతాలకు అడ్డుకట్ట వేయాల్సిన
అవసరం ఉంది.
Advertisement
Advertisement