ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసీబీ గురువారం తెల్లవారుజాము ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసీబీ గురువారం తెల్లవారుజాము ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. వరంగల్తో పాటు మరో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హయాంలో సాంబశివరావు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కాగా 108 అంబులెన్స్ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని సాంబశివరావు చెబుతున్నారు.