deputy cm rajaiah
-
రాజయ్యకు ఓ న్యాయం... ఆయనకో ..
- కడియంను బర్తరఫ్ చేయాలి - ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి - టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు వరంగల్: వైద్యశాఖలో అవినీతి జరిగితే అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాశాఖలో అదే తంతు జరిగితే సంబంధిత శాఖ మంత్రి కడియం శ్రీహరితో ఎందుకు రాజీనామా చేయించడం లేదని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. అతనికి ఓ న్యాయం...ఇతనికో న్యాయమా అని నిలదీశారు. హన్మకొండలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిలో టీఆర్ఎస్ నేతల్లో కొందరికి సంబంధాలు ఉన్నాయన్నారు. డీఈఓతో డిప్యూటీ డీఈఓలకు కూడా ఈ అవినీతిలో సంబంధాలు ఉన్నాయన్నారు. వారిని కూడ సస్పెండ్ చేయడంతోపాటు ఈ శాఖలో జరిగిన అవినీతికి బాధ్యుడిని చేస్తూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఒక జిల్లాకు చెందిన డీఈఓ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. నేటి ధర్నాను విజయవంతం చేయాలి... ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యానికి నిరసనగా హౌసింగ్ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహిస్తున్న ఒక రోజు దీక్ష, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘ఇప్పుడున్న ఇంట్లో అల్లుడు వస్తే ఎక్కడ పంటారు.. నేను అధికారంలోకి వస్తే రెండు బెడ్రూంలు, డైనింగ్ , కిచెన్, హాల్ ఉండే ఇళ్లు ఇస్తాం’ అని అన్న కేసీఆర్ కట్టుకున్న ఇళ్లకు బిల్లులు ఇచ్చే గతి లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ జిల్లా కన్వీనర్ బస్వారెడ్డి, అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, నాయకులు గండ్ర సత్యనారాయణరావు, పుల్లూరు అశోక్‌కుమార్, మార్గం సారంగపాణి తదితరులు ఉన్నారు. -
రాజయ్య సన్నిహితుడి ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసీబీ గురువారం తెల్లవారుజాము ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. వరంగల్‌తో పాటు మరో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హయాంలో సాంబశివరావు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా 108 అంబులెన్స్‌ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని సాంబశివరావు చెబుతున్నారు. -
ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న రాజయ్య
-
ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తన ప్రెస్‌మీట్‌ను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాజయ్య రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రెస్‌మీట్ రద్దు అయినట్లు రాజయ్య సన్నిహితులు ధ్రువీకరించారు. కాగా ప్రెస్‌మీట్ రద్దుకు గల కారణాలు తెలియరాలేదు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజయ్య సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు. తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు. -
కేసీఆర్‌ను కలిసిన రాజయ్య
-
కేసీఆర్‌ను కలిసిన రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. మంత్రవర్గం నుంచి బర్తరఫ్ తర్వాత రాజయ్య తొలిసారిగా కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. కాగా ఆ తర్వాత రాజయ్య...సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించలేదు. సీఎంతో భేటీ వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజయ్యపై వేటు.. మంత్రివర్గంలోకి కడియం
-
మంత్రి రాజయ్యపై వేటుకు రంగం సిద్ధం!
-
రాజయ్యపై వేటు.. మంత్రివర్గంలోకి కడియం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సుతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. గవర్నర్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. ఉదయం నుంచి క్రమంగా దీనికి సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను తప్పించారు. ఆయ స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరికి విద్యుత్ శాఖను కేటాయించి, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజయ్య పేషీలోని అధికారులందరినీ తప్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తొలగించడం తీవ్ర నిర్ణయమేనంటున్నారు. అవినీతికి పాల్పడితే తన సొంత కుటుంబ సభ్యులనైనా వదిలేది లేదని కేసీఆర్ గతంలో ప్రకటించారు. -
ప్రజలు అభద్రతకు గురికావద్దు: రాజయ్య
-
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం
త్వరలో ఖాళీ వైద్య పోస్టుల భర్తీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య అట్టహాసంగా దంత వైద్యుల సదస్సు ప్రారంభం హాజరైన 3వేల మంది దంత వైద్యులు, విద్యార్థులు హన్మకొండ చౌరస్తా :ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడమే కాకుండా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ పద్మాక్షికాలనీ లోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాష్ట్రస్థాయి తొలి దంత వైద్య సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సుకు డాక్టర్ రాజయ్య ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. ఐడీఏ రాష్ట్ర అధ్యక్షు డు త్రినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిం చిన రాజయ్య మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్య సేవలు రాజయ్య మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే సీఎం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆరువేలమంది వైద్యు ల నియామకం కోసం కేంద్రం రూ.5.17కోట్లు కేటాయించిందన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తికాగానే వైద్యుల నియామకం ప్రారంభమవుతుందన్నారు. దంతవైద్యులు సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దంతవైద్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆస్పత్రుల్లోని లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘ఆస్పత్రి బస’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్పనాదేవి, జయసింహారెడ్డి, నర్సింగరెడ్డి డాక్టర్లు చలపతిరావు, ప్రవీణ్‌కుమార్, నర్సింగరెడ్డి సురేందర్‌రెడ్డి, కరుణాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నీళ్లు, నిధులపై దృష్టి
తెలంగాణ సర్కారు నీళ్లు, నిధులు, నియూమకాలపై ప్రధానంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎమ్మెల్సీ ఎన్నికను సవాల్‌గా తీసుకోవాలని అన్నారు. నయీంనగర్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీర ని నష్టం జరిగిందని.. ఆ లోటు భర్తీ చేయడం పై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తెలి పారు. హన్మకొండ హరిత హోటల్లో టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివా రం జరిగింది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, అభివృద్ధి విషయం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్‌కే ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దీనిలో భాగంగానే రాష్టంలో ఏ జిల్లాకు కేటాయించని విధంగా జిల్లాకు సీఎం నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే, ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో తొలి సారిగా ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నా మని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభు త్వాలు 29 లక్షల పింఛన్లు మాత్రమే ఇవ్వగా.. ప్రస్తుతం అర్హులైన వారందరికీ, గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. పద్నాలుగేళ్ల తర్వాత రోడ్ల అభివృద్ధి శిథిలావస్థకు చేరిన పీఆర్ రోడ్ల అభివృద్ధికి 14ఏళ్ల తర్వాత నిధులు కేటాయించడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పని చేయాలని కోరారు. కాగా, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, పట్టభద్రుల స్థానానికి జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సూచిం చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భా వం నుంచి పనిచేస్తున్న మర్రి యాదవరెడ్డికి గతంలో అన్యాయం జరిగిందని.. ఈసారి ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకం గా తీసుకోవాలన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సం క్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రా వు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయిం చాలని శ్రేణులను కోరారు. కాగా, ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు టీఆర్ఎస్లో చేరగా వారికి డిప్యూటీ సీఎం గులాబీ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టడంపై పలువురు డిప్యూటీ సీఎంను సన్మానించారు. సమావేశంలో నాయకులు గుడిమల్ల రవికుమార్, ముద్దసాని సహోదర్‌రెడ్డి, బూజు గుండ్ల రాజేంద్రకుమార్, మర్రి యాదవరెడ్డి, దోనెపూడి రమేష్‌బాబు, ఇండ్ల నాగేశ్వర్రావు, మొలుగూరి బిక్షపతి, కవిత, వరదారెడ్డి, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి.. ఢీకొట్టి..
* కారు, బైక్‌ను ఢీకొన్న డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం * నలుగురు పోలీసులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు * వరంగల్ జిల్లా యశ్వంతాపూర్ శివార్లలో ఘటన జనగామ రూరల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి కారును, బైక్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ మండలం యశ్వంతాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజయ్య ఆదివారం జనగామలోని ఓ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వరంగల్ వైపు ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఇదే సమయంలో రఘునాథపల్లి పోలీస్‌స్టే షన్ కానిస్టేబుల్ కంజర్ల బాబు, హోంగార్డు వెంకటరత్నం బైక్‌పై జనగామ వైపు వస్తున్నారు. వారి వాహనం వెనుక నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నయీముల్లాఖాన్ (ఎఫ్‌సీఐ ఏడీ) తన బంధువులతో కలిసి జనగామవైపు వస్తున్నారు. ఈ క్రమంలో యశ్వంతాపూర్ శివార్లలో ఎస్కార్ట్ వాహనం టైర్ పంక్చర్‌కావడంతో అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న బైక్, కారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంజర్ల బాబు, వెంకటరత్నంతో పాటు ఎస్కార్ట్ వాహనంలోని పోలీసులు జగన్మోహన్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. కారులో ఉన్న నయీముల్లాఖాన్, ఉన్నిసాబేగం తీవ్రంగా గాయపడ్డారు. -
అసలిది ఆస్పత్రేనా?
పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా.. * జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్ర హం * తీరు మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరిక * జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని వెల్లడి సంగారెడ్డి అర్బన్: ‘అసలిది ఆస్పత్రేనా.. పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఉంటే రోగాలు నయమవడం కాదు...కొత్త వ్యాధులొస్తాయి...ప్రైవేటు ఆస్పత్రులు ఇలాగే ఉంటాయా...అసలు మీరు పనిచేస్తున్నారా.. మీరే సరిగా పనిచేస్తే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందా...ప్రధానమంత్రే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు.. మీరు అంత కంటే ఎక్కువా..సిబ్బంది పనిచెప్పేముందు మనమూ చేసి చూపాలి’ అంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులన్నీ తిరిగి పరిశీలించారు. గైనిక్ ఓపి, నవజాత శిశు సంరక్షణ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని పిల్లల వార్డులో పారిశుద్ధ్యం కొరవడటం, గోడలు బూజు పట్టి ఉండటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడైనా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. అలసత్వం వీడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు స్వాగతం పలకగా ఏజేసీ మూర్తి పుష్పగుచ్ఛం అందజేశారు. మెడికల్ కళాశాల మంజూరుకు చర్యలు సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇది వరకే కోరారన్నారు. వైద్యకళాశాల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మెరుగైన వైద్యం అందించాలి సర్కార్ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఆస్పత్రిలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. వారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనులు కాంట్రాక్టర్ చేస్తున్నట్లయితేఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ డాక్టర్ 24 గంటలూ వైద్యసేవలందించాలన్నారు. కాల్ డ్యూటీ డాక్టర్ పనిచేసే చోట అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులైనా సరే ఇంటికి సాగనంపుతామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత కారణంగా 80 శాతం రోగులు హైదరాబాద్‌లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 22 వైద్యాధికారుల పోస్టులను త్వరలో భ ర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రివాల్వింగ్ ఫండ్ రూ.28 లక్షలు ఉన్నాయని ప్రతిపాదనలు పంపిస్తే ఆ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. హెచ్‌డీఎస్‌లో ఉన్న రూ.5 లక్షలు కనీస అవసరాలు తీర్చేందుకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ సీఎం వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు పిట్టెల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్, అదనపు జే సీ మూర్తి, డీఎంహెచ్ఓ డా.బాలాజీ పవార్, ఆర్ఎంఓ డా.మురహరి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుకర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వైద్య సౌకర్యాల కోసం రూ.113 కోట్లు
- పీహెచ్‌సీలను కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం - విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు - మెదక్ ఏరియా అస్పత్రిని 200 పడకలుగా మారుస్తాం - డిప్యూటీ సీఎం రాజయ్య మెదక్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్లకు దీటుగా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సిఫారసుల మేరకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ మెడికల్ పీజీ యూనివర్సిటీ తెలంగాణకు ఒక వరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారన్న విషయాన్ని గ్రామీణులు తెలుసుకోవాలన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష ్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే 1,273 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. దంత వైద్యులు, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రులలో మెస్ చార్జీలు, శానిటేషన్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా, నియోజకవర్గ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచుతామన్నారు. దీంతోపాటు బ్లడ్‌బ్యాంకును ఏర్పాటుచేసి, అవసరమైన పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల బృందం సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నుస్రత్, సంతోష్ప్రసాద్లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైద్యులు, కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం రాజయ్యను సన్మానించారు. -
త్వరలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
మహబూబ్‌నగర్ : డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.రాజయ్య మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి రోగి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులను మందుల కోసం బయటకు పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జర్నలిస్టులకు త్వరలోనే హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాజయ్య తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకొచ్చా..
హైదరాబాద్ : తనను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మంత్రి రాజయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాక రెండుసార్లు ఓడిపోయినా...వైఎస్ పిలిచి టికెట్ ఇస్తే 11వేల ఓట్లతో విజయం సాధించినట్లు వివరించారు. అయితే గెలిచిన కొంత కాలానికే వైఎస్ మరణించారని, ఆయన లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి వస్తే వైద్యశాఖ మంత్రి పదవి ఇస్తానని వైఎస్ చెప్పారని ఈ సందర్భంగా రాజయ్య గుర్తు చేసుకున్నారు. పశువుల కాపరి నుంచి చిన్న పిల్లల వైద్యుడిగా ఆపై ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన తనకు ఇప్పుడు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.