ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం
త్వరలో ఖాళీ వైద్య పోస్టుల భర్తీ
డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య
అట్టహాసంగా దంత వైద్యుల సదస్సు ప్రారంభం
హాజరైన 3వేల మంది దంత వైద్యులు, విద్యార్థులు
హన్మకొండ చౌరస్తా :ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడమే కాకుండా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ పద్మాక్షికాలనీ లోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాష్ట్రస్థాయి తొలి దంత వైద్య సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సుకు డాక్టర్ రాజయ్య ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. ఐడీఏ రాష్ట్ర అధ్యక్షు డు త్రినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిం చిన రాజయ్య మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్య సేవలు
రాజయ్య మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే సీఎం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆరువేలమంది వైద్యు ల నియామకం కోసం కేంద్రం రూ.5.17కోట్లు కేటాయించిందన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తికాగానే వైద్యుల నియామకం ప్రారంభమవుతుందన్నారు. దంతవైద్యులు సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
దంతవైద్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆస్పత్రుల్లోని లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘ఆస్పత్రి బస’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్పనాదేవి, జయసింహారెడ్డి, నర్సింగరెడ్డి డాక్టర్లు చలపతిరావు, ప్రవీణ్‌కుమార్, నర్సింగరెడ్డి సురేందర్‌రెడ్డి, కరుణాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.