అవినీతి కూపంలో ప్రభుత్వ ఆస్పత్రులు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్లక్ష్యమే దీనికి కారణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటే భయపడే స్థితి రాష్ట్రంలో ఉందన్నారు.
ఎర్రగడ్డ ఆస్పత్రిలో రూ.150 కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటనతోనైనా కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కళ్లు తెరవాలన్నారు. గాంధీ, నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో చాలా సంఘటనలు జరిగాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.