సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను గొర్రెల తో పోల్చడం దారుణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అలాగైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ నాయకుడైన కేసీఆర్ కూడా పెద్ద గొర్రె అని విమర్శిం చారు. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులను గొర్రెలుగా అభివర్ణించడం సరికాదన్నారు.
సీఎం కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమన్నారు. దీనికి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ వీరయ్యతో కలసి గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్ పాలనను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగిడిన కర్ణాటక మంత్రి రేవన్నపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలియకుండా మాట్లాడిన కర్ణాటక నేతపై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వీరయ్య మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment