
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ సోయి లేకుం డా మాట్లాడుతున్నారని పీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఏపీ నేతలు వ్యతిరేకించినా, సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు స్వరాష్ట్రాన్ని సాకారం చేశారని, అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించా రని చెప్పారు.
గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తలసానికి ఈ విషయం తెలియకపోవచ్చు గాని, ఉద్యమంలో పాల్గొన్న జగదీశ్‌రెడ్డికి కూడా తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎంపీ కవిత కూడా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment