Srinivas Yadav
-
యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జి ల్లా: కొట్లాడి తెచ్చుకున్న తెలంగా ణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తుల ను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సా మాజిక అంశాల్లో వచి్చన మార్పు లు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పు స్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాస్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని చెప్పారు. రచయితలు ప్ర జల పక్షాన ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉధృతమైంద ని గుర్తు చేస్తూ మరోసారి కవులు కళాకారులు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్ సర్కారు తిరోగమన దిశగా ఆలోచించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.పదేళ్ల తెలంగాణ పాలనలో ప్రజలకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదని కేసీఆర్ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బాలమల్లు, శరత్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు, బీఆర్ఎస్ యువ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి రాసిన ‘హౌ టు బయ్ ఆన్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకాన్ని కూడా కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో సమగ్ర ఎన్నికల ప్రక్రియలో పారీ్టల పాత్ర, ఓటర్లు, తదితర అంశాలతో ఈ పుస్తకం రాశారు. -
అనిల్ కుమార్ గురించి ఇంకోసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే ... కోటంరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
-
ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు
-
హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో దింపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ను వీడిన ఈటల బీజేపీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం వంటి పరిణామాలు ఆసక్తిని పెంచాయి. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోన్న కేసీఆర్ సర్కారు.. తమ పార్టీ అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసి చివరకు గెల్లు శ్రీనివాస్ వైపు మొగ్గు చూపింది. చదవండి: దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే -
టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీనివాస్ పేరును బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం. సాగర్ ఉపఎన్నిక తరహాలోనే నామినేషన్ల సమయంలోనే అభ్యర్థిని ప్రకటిస్తారని భావిస్తున్నా.. హుజూరాబాద్‌లోని ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థిని ఎన్నిక షెడ్యూల్‌కు ముందే ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, టీఆర్ఎస్ ఉపఎన్నిక ఇన్చార్జ్, మంత్రి హరీశ్ తొలిసారిగా బుధవారం నియోజకవర్గానికి వెళ్లనుండటంతో భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. -
చేపా.. చేపా ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే చెరువులు అలుగు దూకుతుండడంతో పంపిణీకి కొద్దిరోజులు ఆగితే మంచిదనే ఆలోచనలో మత్య్సశాఖ ఉంది. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా, మరికొన్ని చెరువులు సగంకంటే ఎక్కువగా నిండాయి. నిండిన చెరువుల్లో ఇప్పుడే చేపపిల్లలు వదిలితే.. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. అవి కొట్టుకుపోయే ప్రమాదముంది. అలాగని, సకాలంలో వదలకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. గతేడాది తేలని లెక్క గతేడాది ప్రభుత్వం గుర్తించిన చెరువుల్లో ఉచిత చేపపిల్లలు వదిలిన తర్వాత భారీ వర్షాలతో చెరువులు అలుగుదూకాయి. దాదాపు 80 శాతం చెరువుల్లోని చేపలు కొన్ని ఎదురెక్కిపోతే, మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో ఏ చెరువులో ఎన్ని చేపలున్నాయనే లెక్క తేలలేదు. ఈసారి 43,870 చెరువుల్లో 24వేల చెరువులు పూర్తిగా నిండి అలుగు దూకాయి. మిగతా చెరువుల్లో సగానికంటే ఎక్కువగానే అలుగు దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది చేప, రొయ్యలు కలిపి 71.02 కోట్ల మేరకు చెరువుల్లో వదిలారు. ఈసారి రెండూ కలిపి 99 కోట్ల వరకు వదలాలని మత్స్యశాఖ యోచిస్తోంది. అందుకనుగుణంగా టెండర్లను సిద్ధం చేసింది. అప్పుడే కాదు భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్ది రోజులు ఆగిన తర్వాత చెరువుల్లో చేప, రొయ్యపిల్లలు వదలాలని అనుకుంటున్నాం. ఈసారి వంద శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తాం. – తలసాని శ్రీనివాస్‌యాదవ్, మత్స్యశాఖ మంత్రి -
తెలంగాణ భవన్ లో తెరాస నేత గన్ తో హాల్ చల్ చేసాడు
-
కేసీఆర్ గురి పెడితే టీఆర్ఎస్కు గెలుపు ఖాయం
సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ గురి పెడితే ఏ ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీదే విజయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమంలో మంత్రి పువ్వాడ పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో పట్టభద్రులకు చెప్పాలని అన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు తీసుకొని రావటం ద్వారా ఎక్కువ శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కలిగిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్‌ఓటీని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఎల్‌ఓటీని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనాతో భయపడొద్దని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని మంత్రి పిలుపునిచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. శాశ్వత ఆక్సిజన్ ట్యాంక్‌తో కష్టాలు తొలగాయన్నారు. త్వరలో రూ.50 లక్షలతో రాష్ట్రంలో రెండో ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’గా పేరు పెట్టారు. (దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇక రయ్ రయ్) కేబుల్ బ్రిడ్జి వివరాలు.. కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96) అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు క్యారేజ్ వే వెడల్పు: 2x9 మీటర్లు (2x3 లేన్లు) ఫుట్‌పాత్ : 2x1.8 మీటర్లు స్టే కేబుల్స్ 56 (26x2) ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ -
లష్కర్లో గులాబీ రెపరెపలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో తలసాని సాయికిరణ్ యాదవ్ గెలుపుతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూ చిగా మారాయన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సాయి కిరణ్ గెలుపుతో దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ సీనియర్ నేత వల్లభ్‌కుమార్‌కు మం త్రులు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 25న సాయి కిరణ్ నామినేషన్ ఈ నెల 25న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ వద్ద గల అమరవీరుల స్తూపం నుంచి సాయికిరణ్ యాదవ్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో వెళ్లి అబిడ్స్‌లోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. -
హోదాకు కేసీఆర్, కవిత మద్దతిచ్చారు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ సోయి లేకుం డా మాట్లాడుతున్నారని పీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఏపీ నేతలు వ్యతిరేకించినా, సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు స్వరాష్ట్రాన్ని సాకారం చేశారని, అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించా రని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తలసానికి ఈ విషయం తెలియకపోవచ్చు గాని, ఉద్యమంలో పాల్గొన్న జగదీశ్‌రెడ్డికి కూడా తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎంపీ కవిత కూడా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తించాలని ఆయన కోరారు. -
కోదండరాంవి శవ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: విద్యా బుద్ధులు నేర్పే ప్రొఫెసర్ కోదండరామ్ శవ రాజకీయాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు మంచి చెప్పాల్సిందిపోయి వారిని రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపేవారని, కానీ కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఏపీపీఎస్సీ ద్వారా 24,086 ఉద్యోగాలు భర్తీ చేస్తే, కేవలం మూడున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ఎస్పీ ద్వారా 29,201 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. మురళి అనే విద్యార్థి డిగ్రీ పూర్తిచేసి పీజీలో చేరాడని, ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదన్నారు. కనీసం టీఎస్ఎస్పీలో వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కు కూడా దరఖాస్తు చేయలేదన్నారు. ఇంటర్నల్ పరీక్షలు బాగా రాయలేదని భయపడి ఆత్మహత్య చేసుకుంటే నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్నాడని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం శవరాజకీయాలు చేస్తూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి ఓయూలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఓయూకి వచ్చి అనవసరంగా రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేశామన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీం, ఒక సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉండేవిధంగా సిబ్బందిని కేటాయించామని, ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ టీంను 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 800 వీడియో కెమెరాల ద్వారా బాలాపూర్ నుండి ట్యాంక్‌బండ్ వరకు జరిగే గణేష్ నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు. నిమజ్జనంకోసం ఎన్టీఆర్‌మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్‌లో 2, ఎర్ర కుంటలో 2 క్రేన్లు సిద్ధంగా ఉన్నాయని, అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. శానిటేషన్ నిర్వహణకు దాదాపు 9,710 మందితో 3 విడతలలో పనిచేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. భక్తులకోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే పరిశుభ్రత కోసం 14 స్వీపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామని తలసాని చెప్పారు. -
ఈసారి వైభవంగా బోనాల పండుగ
హైదరాబాద్: ఈ సారి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 25న గోల్కొండ బోనాలు ఉంటాయని, ఆగస్టు 2, 3న సికింద్రాబాద్‌లో బోనాలు ఉంటాయని చెప్పారు. ఇక ఆగస్టు 9, 10లలో హైదరాబాద్‌లో బోనాల పండుగ ఉంటుందని ఆయన వివరించారు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధలతో బోనాల పండుగను జరపనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. -
తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులా?
అచ్చంపేట/ఆమనగల్లు: తెలంగాణ ద్రో హులైన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్రావులకు మంత్రి పదవులు ఇచ్చారని, టీఆర్ఎస్లో ఇంతకంటే బలమైన నాయకులు లేరా టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శిం చారు. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు సముచిత స్థానం కల్పించలేదని, కడియం శ్రీహరిది ఏ కులమో ఆయనకే తెలియని పరిస్థితి ఉందన్నారు. బీసీ కులంలో పుట్టడమే తప్పా అని మహబుబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కన్నీరు పెట్టుకోవడం చూస్తే ఈ ప్రభుత్వం వెనకబడిన కులాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుందన్నారు. శుక్రవారం అచ్చంపేట పటేల్ ఫంక్షన్హాల్లో, ఆమనగల్లులోని వాసవీకల్యాణ మండపంలో శుక్రవారం అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గస్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ సెంటిమెంట్‌తోనే అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే సీఎం, మంత్రులు బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని, తామే టీడీపీ తరుఫున రూ.50వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. పింఛన్లు, రేషన్‌కార్డులు లేని వారి జాబితా తయారు చేస్తే వారికి అందే విధంగా చూస్తామన్నారు. కొన్ని రోజులు ఆగితే తెలంగాణలో టీడీపీ కార్యకర్తల కష్టాలు తీరిపోతాయన్నారు. చెంచులను తరలిస్తే ఊరుకోం.. పులుల సంరక్షణ పేరిటా చెంచులను తరలించాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నల్లమల అడవుల్లోని వజ్రాలు, విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకే ఈ కుట్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. జిల్లా మంత్రు లు, ఎమ్మెల్యేలు దీనిపై నోరుమెదపడం లేదంటే వీరికి చెంచులపై ఎంత ప్రే ముందో అర్థమౌతుందన్నారు. వైఎస్సార్ హయాంలో చెంచుల తరలింపు తెరపైకి వచ్చినప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత నల్లమల ప్రాంతానికి వచ్చి గంగోలు పెట్టి, ముసలి కన్నీరు కార్చిన విషయం గుర్తు చేశారు. వజ్రాలు అమ్ముకోవడం కోసం ప్రస్తుతం కేసీఆర్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. భాష, చదువు, జీవ న విధానం తెలియని చెంచులు అడవి వదిలి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలా జీవిస్తారని, కేసీఆర్‌ను అడవిలో ఉండమంటే ఉంటారా అని ప్రశ్నించారు. గువ్వలాలు, గబ్బిలాల శబ్దదారులకు భయపడమని, జానడు లేనివారు ఏమి రాజకీయం చేస్తారో తామూ చేస్తామన్నారు. అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని, ఇక్కడే ఉండి పార్టీని గెలిపిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో ఉన్న మంత్రులంతా సన్నాసులే అని, అటు ఇటు కాని వారు మంత్రులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ఇంటినిండా బంగారం నింపుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణ కాదు అని అన్నారు. దళితుడిని సీఎం చేసి, తెలంగాణకు కాపాల కుక్కలా ఉంటానన్ని చెప్పిన కేసీఆర్ తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకుని, పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి విమర్శించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. తాను ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే పి.రాములు తెలిపారు. ఆయా సమావేశాల్లో అచ్చంపేట పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా రెడ్డి, నేతలు గోపాల్, వెంకటరమణ, కందికొండ శ్రీధర్, టైలర్ శ్రీను, నాగయ్యగౌడ్, రవికుమార్, తిరుపతిరావు, గంటేల గోపాల్, చింతలపల్లి యాదయ్య, బాలస్వామిగౌడ్, జంగ య్యగౌడ్, దామోదర్, వెంకటయ్య, కండె సత్యం, పాల్గొన్నారు. -
సరి కొత్తగా...
సైనికుడు సైన్యంలో ఉండాలి... సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఓ చిత్రం రూపొందనుంది. తనీష్, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్ పతాకంపై శ్రీనివాసయాదవ్ నిర్మించనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి శిరీష, మేగోటి ఉమామహేశ్వరి కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్టైలిష్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. తనీష్ పాత్ర సరికొత్తగా ఉంటుంది’’ అని తెలి పారు. తనీష్ మాట్లాడుతూ-‘‘నా పాత్ర విభిన్న కోణాల్లో సాగుతుంది. నా కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుంది ’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హ యీష్. ఎస్.ఎన్. -
మాస్ టచ్‌తో...
‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’ పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్. -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం: పొన్నాల
కాంగ్రెస్‌లో చేరిన గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందనడానికి ఒక బీసీకి టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించడమే రుజువని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులు, పోరాట సమితి జిల్లాల అధ్యక్షులతో కలసి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం మంది బీసీలు ఉన్నారని, జనాభా దామాషా పద్ధతిలో పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా బీసీలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారని చెప్పారు. గొల్లకుర్మ హక్కుల కోసం జరిగే పోరాటాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. గోసుల శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న గొల్ల కుర్మల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జి.వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామాలు
ఏ పల్లెలో చూసినా ప్రస్తుతం మద్యం ఏరులై పారుతోంది.. ఎక్కడైనా నీటి గోస ఉన్నదేమో గానీ.. మద్యం విక్రయించని గ్రామాలు అరకొరే. ఇదిలా ఉంటే.. మారుతున్న ఆధునికతకు తోడు ఆయా భోజనప్రియుల్లోనూ మార్పులొస్తున్నాయి. నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగని రోజు లివి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తున్నాయి. జీవ హింసకు దూరంగా ఉంటూ.. మాంసం తినేందుకు అయిష్టపడుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. పెద్దల కట్టుబాట్లకు కట్టుబడి.. గ్రామ కమిటీల ఆజ్ఞలతో.. అందరి సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ.. అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. జిల్లాలో మద్యం, మాంసం ముట్టని గ్రామాలపై మద్యం.. మందు.. కళ్లు.. ఇలా ఈ మత్తు పదార్థానికి పేర్లు ఎన్నున్నాయో... అది సృష్టించే అనర్థాలూ అంతకంటే చాలానే ఉన్నాయి. మానవత్వం నుంచి మనిషిని దూరం చేసేది.. మానవ సంబంధాల్ని చంపి పాతరేసేది.. ఏదైనా ఉందంటే అది మందే. అలాంటి మందునే మనుషుల నుంచి దూరం చేయాలనుకున్నారు ఆ పల్లెల ప్రజలు. అనుకున్నది అనుకున్నట్లు ఆచరించి చూపుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ పల్లెల్లో మద్యం అమ్మకం లేదు. బెల్టుషాపులు లేవు. గుడుంబా తయారీదారులు లేరు. ఆ విక్రయాలూ లేవు. తాగేవారు లేరు. తాగించేవారూ లేరు. ఇప్పుడా ఊళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి ఆదర్శ పల్లెలపై ప్రత్యేక కథనం. రాళ్లకన్నెపల్లిలో నాలుగేళ్లుగా నిషేధం తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీ పరిధి రాళ్లకన్నెపల్లి గ్రామస్తులు నాలుగేళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నారు. గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా వారిని ఊరిలోకి రానిచ్చేది లేదని గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా తీర్మానించుకున్నారు. గతంలో గ్రామంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండేవి. ఆడ, మగ తేడా లేకుండా చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. దీంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. దానికి రోజూ పంచాయతీలు పెట్టడం, తీర్మానాలు చేయడం మాములే అయిపోయింది. ఊరి పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రామస్తులు గ్రహించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచించి, గ్రామస్తులంతా ఏకమై గ్రామంలో మద్యం నిషేధించాలని నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించి అప్పటి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌కు తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని తెలుపుతూ రాత పూర్వకంగా తీర్మాన పత్రం రాసి ఇచ్చారు. అప్పటి నుంచి మద్యం బంద్ అయింది. ఊరు బాగు కోసం... గ్రామంలో మద్యం నిషేధ తీర్మానం చేసినప్పటి నుంచి ఊరిలో గొడవలు సద్దుమణిగాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. మాకు మేముగానే ఊరిలో మద్యం అమ్మకాలు సాగించవద్దని నిర్ణయానికి వచ్చాం. మద్యం బెల్టుషాపుల ద్వారా అమ్మసాగించే వారి ఉపాధి పోతుందని విమర్శలు వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఊరు బాగు కోసం త్యాగం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. - మడావి మోతీరాం మేడిగూడలో పెద్దల మాట గౌరవిస్తూ.. ఇచ్చోడ : మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగూడ పదేళ్లుగా మద్య, మాంసాలకు దూరంగా ఉంటూ గిరిజన, గిరిజనేతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో ఈ గూడెంలో మద్యం తాగి తరచూ గొడవలు, పంచాయతీలు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వారు. ప్రశాంతత కరువైంది. 15 ఏళ్ల కిందట గూడెంలో మద్యం తాగి గొడవపడ్డ సంఘటన పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లడంతో అప్పట్లో చాలామంది గిరిజనులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అప్పటి గ్రామపెద్ద మారు పటేల్ గూడెం పెద్దలతో చర్చించి మద్యం మాంసాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నాడు తీసుకున్న నిర్ణయాన్ని నేటి కీ పాటిస్తున్నారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉంది. అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మండలంలోని మాన్కపూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన మేడిగూడలో దాదాపు 70 కుటుంబాల్లో సూమారు 400 మంది జనాభా ఉంటారు. ఇక్కడ నివసించే ప్రజల్లో అందరూ ఆదిమ గిరిజన గోండు తెగకు చెందినవారే. గ్రామానికి ఇతర గ్రామాల నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడ మద్యం తాగనివ్వరు. సాలెగూడలో 27 ఏళ్లుగా మద్యానికి దూరంగా... ఉట్నూర్ : ఆ గూడెంలో ఐదుగురు కలిసి తీసుకున్న నిర్ణయం ఊరి స్వరూపాన్నే మార్చింది. ఒకప్పుడు మద్యం తాగుతూ... మాంసం తింటూ నిత్యం గొడవలు పడే కుటుంబాలున్న ఆ గూడెంవాసులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 27 ఏళ్ల క్రితం అప్పటి గూడెం పెద్దలైన టేకం భీము, కొడప లచ్చు, ఆత్రం లేతు, టేకం రాము, ఆత్రం భీము కలిసి గూడెంలో ఎవరూ మద్యం ముట్టరాదంటూ తీర్మానించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ గూడెం మద్యానికి దూరంగా ఉంటోంది. ఇక గూడెంకు చెందిన దేవతల విగ్రహలు తయారు చేసే టేకం బాపురావు 1989లో తన కుటుంబం ఇక నుంచి మాంసాహారం ముట్టదని ప్రకటించాడు. అతనిని చూసిన ఇతర కుటుంబాల వారు క్రమక్రమంగా మాంసహారానికి దూరమయ్యారు. ప్రస్తుతం గూడెంలో 90 శాతం మంది మాంసాహారమంటే దూరంగా ఉంటారు. అందరూ మద్యమంటే అస్యహించుకుంటారు. ఒకరికొకరు అండగా... ఉట్నూర్ మండలం ఉమ్రి పంచాయితీ పరిధిలోని కొలాం గిరిజనులకు నిలయం సాలెగూడ. 50 ఏళ్ల క్రితం ఐదు ఇళ్లతో వెలసిన ఈ గూడెం ఇప్పుడు దాదాపు 75 కుటుంబాలతో సుమారు 420 వరకు గిరిజన జనాభాతో కళకళలాడుతోంది. గూడెంలో ఎవరిని చూసినా ప్రశాంతంగా కనిపిస్తారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వీరు తెల్లారిందంటే చేను పనులకెళ్లడం సందెవేళ ఇంటికి చేరడం నిత్య దినచర్య. గూడెంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఒక ఇంట్లో శుభకార్యమైదంటే తలో చేయివేసి తమ ఇంట్లో శుభకార్యంలాగా భావిస్తూ దగ్గరుండి పనులు చేస్తారు. మద్యం తాగితే జరిమానా! గూడవాసులు ఎవరైనా మద్యం తాగినట్లు తెలిస్తే గూడ పెద్ద సమక్షంలో పటేల్ ఆధ్వర్యంలో పంచాయితీ పెడుతారు. మద్యం తాగిన వ్యక్తిని పంచాయితీకి పిలిపిస్తారు. మద్యం తాగినట్లు తేలితే రూ.500ల పైచిలుకు జరిమానా విధిస్తారు. ఇలా జమైన మొత్తానికి మరికొంత మొత్తం ఇంటింటి నుంచి సేకరించి గూడెంలో జరిగే శుభకార్యాలకు పనికి వచ్చేలా దాదాపు రూ.30 వేల విలువైన వంట పాత్రలను కొనుగోలు చేశారు. అయితే కొన్ని నెలల క్రితం ఒకరు మద్యం తాగకుండా ఉండలేనంటే కుటుంబంతో సహా పక్క గూడకు వసల వెళ్లాడు. జూన్-2011 నెలలో గూడలో ఓ పెళ్లి జరిగింది. పెళ్లి వారు మహారాష్ట్రకు చెందిన వారు. వారి పెళ్లిళ్లలో మద్యం తాగడం పరిపాటి. వారు కూడా మద్యం సీసాలు తీసుకువచ్చారు. అయితే ఈ గూడెం కట్టుబాటు, నిర్ణయాన్ని గౌరవిస్తూ ఊర్లో మద్యం తాగకుండా సీసాలు తిరిగి తీసుకెళ్లారు. ఇంతలా ఉంటుంది ఇక్కడ మద్యం విషయంలో కట్టుబాటు. శుభకార్యాల్లో శాకాహారమే... గూడెంలో ఏ శుభకార్యం జరిగినా శాకాహార భోజనమే పెడుతారు. మాంసాహారం అస్సలు పెట్టరు. అసలు ఆ మాటే వినిపించదంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో 90 శాతం కుటుంబాలు మాంసం ముట్టరు. వీరి ఆరాధ్య దైవాలకు ముహూర్తాల సమయంలో జంతు బలులు ఉంటాయి. కానీ కొబ్బరికాయలతోనే పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ గూడ పచ్చదనానికి పెట్టింది పేరు. గూడెంలోని రహదారి వెంట గూడ వాసులు చెట్లు పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఇంటి ఎదుట ఏదో పూల మొక్క కానవస్తుంది. టేకం అంకుశ్ నిరక్షరాస్యుడైనా తన ఇంటి ఆవరణలో చేపట్టిన మొక్కల పెంపుదనాన్ని ఆదర్శంగా తీసుకున్న కుటుంబాలు ప్రతీ ఇంటి ఎదుట పచ్చదానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమకు పూర్తిస్థాయి నీటి సౌకర్యం ఉంటే గూడెంనంతటిని పచ్చదనం చేస్తామని అంటున్నారు సాలెగూడవాసులు. -
శీనుతో శ్రీవల్లి
నాలుగు జంటల నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘శీనుతో శ్రీవల్లి’. శ్రీనివాస యాదవ్ దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబీ ఈషా రామ ప్రియ సమర్పణలో ఆడిమోని మల్లికార్జున యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే ప్రేమకథ ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరున గుంటూరులో ప్రారంభోత్సవం జరిపి, గుంటూరు, తెనాలి, భట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. గతంలో ‘ఫ్రెండ్స్ కాలనీ’ డెరైక్ట్ చేశానని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శేషభట్టర్ వెంకటరమణ, పాటలు: బీఎన్ నాయుడు, సంగీతం: థామ్సన్ మార్టిన్. -
‘గ్రేటర్’ గులాబీ దళపతి ఎవరో?
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య సాక్షి,సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ వీడడంలేదు. ఈ పదవిలో కొనసాగిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రెండు నెలలు కావస్తున్నా ఈ పదవీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికీ కట్టబెట్టకపోవడంతో నగరంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఊపుతో ఉన్న గులాబీ దళం గ్రేటర్ పరిధిలోనూ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఉన్న ఆపార్టీ శ్రేణులు నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని పటిష్టం చేసేందుకు యువకుడు,సమర్థులైన వారికే ఈ పదవిని కేటాయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ పదవిపై కన్నేసిన పలువురు నాయకులు ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో పార్టీ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేష్, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహేందర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌కు చెందిన ఆళ్లకుంట హరి ముందున్నారు. మురుగేష్వైపే అధిష్టానం మొగ్గు... ఇప్పటికే గ్రేటర్ టీఆర్ఎస్ కార్యవర్గంలో చురుకుగా పనిచేస్తున్న అధికార ప్రతినిధి మురుగేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల అధినేత కేసీఆర్‌ను కలిసి తాను పార్టీ పటిష్టతకు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై వివరించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు సైతం ఆయనకే మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌తో అనుబంధం ఉన్న నాయకుడు, అందరికీ సుపరిచితుడైన వివాదరహితుడినే ఈ పదవికి ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
శ్రీనివాస యాదవ్ నామినేషన్ ఉపసంహరణ
ప్రిన్స్ మహేష్ బాబు బావ, గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గుంటూరు లోక్‌సభ స్థానం అదే పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన శ్రీనివాస్ యాదవ్ బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గతంలో ఖరారు చేశారు. స్థానికుడికి కాదని చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆ పార్టీకి చెందిన శ్రీనివాస యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. అందులోభాగంగా లోక్‌సభ టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీకి చెందిన జిల్లా, స్థానిక నాయకులు రంగంలో దిగి నామినేషన్ ఉపసంహరించాలని ఆయన్ని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రంగంలోకి దిగి పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి కట్టబెడగానంటూ శ్రీనివాస యాదవ్‌ను బుజ్జగించారు. దాంతో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. -
షి‘కారు’ ఎలా..?
ఎన్నికల వేళ గ్రేటర్ టీఆర్ఎస్లో సంక్షోభం పార్టీని వీడిన కట్టెల,దోసోజు, కాచం కారు జోరుకు బ్రేకులు బరిలోకి దిగిన అభ్యర్థుల్లో టెన్షన్ సాక్షి,సిటీబ్యూరో: మరో పదహారురోజుల్లో ఎన్నికలుండగా గ్రేటర్ టీఆర్ఎస్లో సంక్షోభం నెలకొంది. కీలక సమయంలో పార్టీ గెలుపునకు మార్గదర్శనం చేయాల్సిన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, పోలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జీ కాచం సత్యనారాయణ సహా పలువురు ద్వితీయశ్రేణి నాయకులు కాంగ్రెస్ పంచన చేరడంతో కారు జోరుకు బ్రేకులు పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుతో జోష్‌లో ఉన్న పార్టీలో..ఈ పరిణామమంతో షి‘కారు’ ఎలా అని ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యమస్ఫూర్తితో పనిచేయాల్సిన పార్టీ నాయకగణం, కేడర్ అప్పుడే డీలా పడడంతో బరిలోకి దిగిన నేతలు కలవరపడుతున్నారు. ఎలక్షన్ సమయంలో ముఖ్యనాయకులు పార్టీని వీడడం,టికెట్ల కేటాయింపులో సీనియర్లను పక్కనబెట్టడం,మహానగరాభివృద్ధిని ప్రతిబింబించే లా మేనిఫెస్టో లేకపోవడం,ఉద్యమకారులను,జేఏసీ నాయకులను విస్మరించడం,సొంతబలంపై నమ్మకం లేక ఇతర పార్టీల నేతలను నమ్ముకోవడం వంటి అంశాలన్నీ పార్టీకి చేటు చేస్తాయని పార్టీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నారు. ఈ ప్రతికూల పరిణామం పార్టీపై ఆశలు పెట్టుకున్న పది నియోజకవర్గాలపైనా తప్పక ప్రభావం చూపుతాయని అవి చెబుతున్నాయి. గ్రేటర్‌వ్యాప్తంగా జనంనాడిని తెలుసుకొని ప్రచారం చేసేందుకు ప్రచారకర్తలు సైతం లేకపోవడం కూడా పార్టీకి శాపంగా పరిణమిస్తోందన్నది ఆ వర్గాల భావన. ప్రతినియోజకవర్గంలో సెటిలర్లఓట్లు కీలకంగా మారడం, ఎనిమిది స్థానాల్లో ఎంఐఎం బలంగా ఉండడం,పార్టీలో నెలకొన్నసంస్థాగత లోపాలు, కిందిస్థాయి కేడర్‌కు సరైన దిశానిర్దేశం లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారినట్లు ముఖ్యనాయకులు సైతం వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసేవరకు గ్రేటర్ అధ్యక్షపీఠంలో ఎవరినీ కూర్చోబెట్టరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగీ వర్సెస్ కారు : పొత్తు ప్రతిపాదన లు ఆదిలోనే వికటించి ఒంటరిపోరుకు సిద్ధమైన కాంగ్రెస్,టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ముమ్మరయత్నాలు చేస్తుండడంతో రాజకీయం రంజుగా మారుతోంది. ఒకపార్టీ నుంచి మరొక పార్టీకి నేతల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టికెట్లు దక్కక కొందరు,అధినాయకత్వం ఒంటెత్తు పోకడలు,కుటుంబపాలన నచ్చక మరికొందరు వెంటనే గోడ దూకేస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా కళ్లుతెరచి అసంతృప్త నేతలను బుజ్జగించే యత్నం చేయకుంటే ఎన్నికల వేళ పార్టీకి నష్టమేనని పార్టీవర్గీయులు స్పష్టంచేస్తున్నారు.