
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’గా పేరు పెట్టారు. (దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇక రయ్ రయ్)
కేబుల్ బ్రిడ్జి వివరాలు..
కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు
ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96)
అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు
క్యారేజ్ వే వెడల్పు: 2x9 మీటర్లు (2x3 లేన్లు)
ఫుట్‌పాత్ : 2x1.8 మీటర్లు
స్టే కేబుల్స్ 56 (26x2)
ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు
నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్



Comments
Please login to add a commentAdd a comment