
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీనివాస్ పేరును బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం. సాగర్ ఉపఎన్నిక తరహాలోనే నామినేషన్ల సమయంలోనే అభ్యర్థిని ప్రకటిస్తారని భావిస్తున్నా.. హుజూరాబాద్‌లోని ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థిని ఎన్నిక షెడ్యూల్‌కు ముందే ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, టీఆర్‌ఎస్ ఉపఎన్నిక ఇన్‌చార్జ్, మంత్రి హరీశ్ తొలిసారిగా బుధవారం నియోజకవర్గానికి వెళ్లనుండటంతో భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.