నాలుగు జంటల నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘శీనుతో శ్రీవల్లి’. శ్రీనివాస యాదవ్ దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబీ ఈషా రామ ప్రియ సమర్పణలో ఆడిమోని మల్లికార్జున యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే ప్రేమకథ ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరున గుంటూరులో ప్రారంభోత్సవం జరిపి, గుంటూరు, తెనాలి, భట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. గతంలో ‘ఫ్రెండ్స్ కాలనీ’ డెరైక్ట్ చేశానని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శేషభట్టర్ వెంకటరమణ, పాటలు: బీఎన్ నాయుడు, సంగీతం: థామ్సన్ మార్టిన్.
శీనుతో శ్రీవల్లి
Published Thu, Jun 5 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement
Advertisement