యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్‌ | KCR LAUNCHES SON OF THE SOIL BOOK CALLS FOR RENEWED MOVEMENT IN TELANGANA | Sakshi
Sakshi News home page

యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్‌

Published Sat, May 18 2024 4:31 AM | Last Updated on Sat, May 18 2024 4:31 AM

KCR LAUNCHES SON OF THE SOIL BOOK CALLS FOR RENEWED MOVEMENT IN TELANGANA

‘భూమి పుత్రుడు’ పుస్తకం ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జి ల్లా: కొట్లాడి తెచ్చుకున్న తెలంగా ణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ శక్తుల ను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సా మాజిక అంశాల్లో వచి్చన మార్పు లు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ ఎడిటోరియల్‌ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌’ (భూమిపుత్రుడు) పు స్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని చెప్పారు. రచయితలు ప్ర జల పక్షాన ఉండాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉధృతమైంద ని గుర్తు చేస్తూ మరోసారి కవులు కళాకారులు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ సర్కారు తిరోగమన దిశగా ఆలోచించడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు.

పదేళ్ల తెలంగాణ పాలనలో ప్రజలకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదని కేసీఆర్‌ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బాలమల్లు, శరత్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు, బీఆర్‌ఎస్‌ యువ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి రాసిన ‘హౌ టు బయ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎలక్షన్‌’ పుస్తకాన్ని కూడా కేసీఆర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో సమగ్ర ఎన్నికల ప్రక్రియలో పారీ్టల పాత్ర, ఓటర్లు, తదితర అంశాలతో ఈ పుస్తకం రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement