మల్లు రవి
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పెట్టబోయే థర్డ్‌ఫ్రంట్ కి ఆయనే రాజు..ఆయనే మంత్రి..ఆయనే బంటు అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నేతలు ఎవరూ కేసీఆర్‌తో కలిసి రారని జోస్యం చెప్పారు. కేసీఆర్ రాజకీయ నిలకడలేని వ్యక్తి అని, ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల తర్వాత ఓ మాటా మారుస్తాడని విమర్శించారు. దేశంలో భూకంపం సృష్టిస్తా అంటున్నాడు అంటే ప్రజలను, ప్రకృతి సర్వనాశనం చేయడమేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదని, మద్దతు ధర కల్పించలేకపోయారని మల్లు రవి ఆరోపించారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ ఎటువంటి గుణాత్మక మార్పు తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్‌రూం, కేజీ టూ పీజీ, దళితులకు భూమి లాంటి ఏ పథకాలను సరిగా అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి, టీఆర్‌ఎస్ కి ఓటమి తప్పదని మల్లు రవి జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment