మైండ్ గేమ్‌లు టీఆర్‌ఎస్‌వే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మైండ్ గేమ్ పేటెంట్ టీఆర్‌ఎస్ సొంత మని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై సీఎం కేసీఆర్ చేసిన సర్వే బూమరాంగ్ అయ్యిందని అన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగళ్ల మహేశ్, మైనారిటీ సెల్ చైర్మన్ ఫక్రు ద్దీన్‌లతో కలసి ఆయన గురువారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
అభద్రతతోనే కేసీఆర్ ఇప్పుడు సిట్టింగులు అందరికి టికెట్లు అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, రెండవ స్థానంలో ఎవరుంటారో టీఆర్ ఎస్, బీజేపీ తేల్చుకోవాలన్నారు. అసలు 2019 వరకు టీఆర్‌ఎస్ అధికారంలో ఉం టుందో లేదో కూడా అనుమా నమేనని, మంత్రి హరీశ్‌రావు బాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. భూ సర్వేకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, రైతు సమితిలో టీఆర్‌ఎస్ నేతలను నింపడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. తక్షణమే జీవో 39ని రద్దుచేసి అఖిలపక్ష సమావేశం జరపాలని రవి డిమాండ్ చేశారు.