మాజీ ఎంపీ మల్లు రవి(ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో నిలకడ లేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు ఓటేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీకి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, రుణాల మాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’అని అన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment