సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పార్టీ భవన నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న సీఎం బుధవారం.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి వసంత్ విహార్‌లోని పార్టీ భవన నిర్మాణ స్థలానికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. మార్పులు, చేర్పులపై పార్టీ నేతలకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. సమావేశ మందిరాలు, ఇతర గదులు ఏ విధంగా ఉండాలో సూచించారు.
నేడు మరోసారి సమీక్ష
మంగళవారం సాయంత్రం యూపీ నుంచి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ పార్టీ కోసం తాత్కాలికంగా తీసుకున్న అద్దె భవనాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న భవనానికి సంబంధించి గురువారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment