Minister Lakshma Reddy
-
రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రులకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పూర్వ జిల్లాకేంద్రాల్లో వీటిని ప్రారంభించాల ని అధికారులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో 5, కరీంనగర్లో 5, వరంగల్‌లో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టామని తెలిపారు. ‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా సర్కారు ఆస్పత్రుల బలోపేతం, కొత్త దవాఖానాల ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని వివరించారు. డిసెంబర్లో 175 ప్రారంభం గత నెలలో బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఆస్పత్రికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక వైద్యం కోసం ప్రైవేటు క్లినిక్‌లలో డబ్బులు ఖర్చు చేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని చెప్పారన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే వాటి విస్తరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్‌లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి సుమారు 175 దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో మ్యాపింగ్ బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఐటీ శాఖ సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో నెలకొల్పే 500 బస్తీ దవాఖానాలకు భవనాలు గుర్తించాలని, అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న 28 బస్తీ దవాఖానాలను వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్ తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల సేవలను కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెం టర్లకు మంచి స్పందన వస్తోందని మంత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త డాక్టర్లొచ్చారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరుల నేతృత్వంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. భర్తీ చేసిన వెంటనే సంబంధిత వైద్యులకు నియామక ఉత్తర్వులను ఆన్లైన్లో పంపారు. వారం రోజుల్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జిల్లాలు, ఆసుపత్రుల వారీగా పోస్టుల కేటాయింపు చేస్తారు. వివిధ విభాగాల వారీగా 15 రకాల స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేశారు. ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తల్మాలజీ–34, సైకియాట్రిక్–22, అనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. సొంత జిల్లాల్లో కేటాయింపు.. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆసుపత్రులు 31, ఏరియా ఆసుపత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్‌లో ఫస్ట్ రిఫరల్ యూనిట్లు 14 ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 1,133 స్పెషలిస్టు పోస్టుల కోసం వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అందుకు 2,200 మంది స్పెషలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు. 1,133 పోస్టుల్లో 919 పోస్టుల భర్తీ జరిగింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా నియామకాలు జరిపారు. వారు సాధించిన మార్కులు, పాసైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నేళ్లయిందో దానికి వెయిటేజీ, కాంట్రాక్టు పద్ధతిలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే దానికీ వెయిటేజీ, అలాగే రోస్టర్ పాయింట్ల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. నియమించిన 919 మందిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. వైద్యులందరికీ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. అన్యాయం జరిగింది: నియామకాలు జరిపిన ప్రభుత్వం తక్షణమే ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదో చెప్పాలని కొన్ని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొందరు కుమ్మక్కయినందునే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. అలాగే నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈఎన్టీ విభాగపు మెరిట్ లిస్టులో రోస్టర్ ప్రకారం ఐదో స్థానం వచ్చిందని డాక్టర్ అనిల్ చెబుతున్నారు. మొత్తం 18 పోస్టులు ఉన్నందున తప్పక రావాల్సి ఉందని, కానీ తుది నియామకపు ఉత్తర్వులో తన పేరు కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇక డాక్టర్ నరహరి అనే స్పెషలిస్టు మాట్లాడుతూ నోటిఫికేషన్ మార్చి 19న వచ్చిందని, దాని ప్రకారం 46 ఏళ్లున్న వారు అర్హులన్నారు. ఆ తేదీ నాటికి తనకు 45 ఏళ్ల 10 నెలలుందన్నారు. కానీ జూలై 1వ తేదీని కట్ ఆఫ్‌గా తీసుకోవడం శోచనీయమన్నారు. ఈఎన్టీ జాబితాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలోనూ తనకు విషయం చెప్పలేదని, అప్పుడు తన దరఖాస్తును తిరస్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం వయసు లేదంటూ భర్తీలో తన పేరు లేకుండా చేశారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య మంత్రి హర్షం.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి భారీ నియామకాలు జరిపామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీరిందన్నారు. మొదటిసారిగా అందుబాటులోకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల స్పెషలిస్టులు వచ్చారన్నారు. ఈ నియామకాలతో మౌలిక వసతులతో పాటు వైద్యుల కొరత తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ఓపీ, ఐపీలకు అనుగుణంగా నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు. -
145 కొత్త ‘108’ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 145 ఉచిత అత్యవసర వైద్య సేవల (108) వాహనాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 316 వాహనాలు ఈ సేవలను అందిస్తుండగా 145 వాహనాలు సరిగ్గా పని చేయటం లేదు. వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. -
‘ఆరోగ్యసేవలు’ కొనసాగుతాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆర్యోగ సేవల పథకం(ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్) కొనసాగుతుందని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్‌తో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు రవికుమార్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ పథకంపై ఇటీవల వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి అందరికీ ఆమోద్యయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సమాచార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. వెల్నెస్ సెంటర్లలో మందుల కొరత, కొన్ని ఆసుపత్రులు హెల్త్‌కార్డులను నిరాకరిస్తున్నాయని కేటీఆర్‌కు చెప్పారు. ఓ చానల్లో సీనియర్ సబ్ఎడిటర్గా ఉన్న కరీం అనే జర్నలిస్టు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె వైద్య ఖర్చులకు రూ.12 లక్షల ఎల్వోసీ ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
అంధత్వ నివారణ అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ అందరి బాధ్యతని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలలో భాగంగా ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ కంటి ఆస్పత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవేర్నెస్ వాక్‌ను ఆయన ప్రారంభించారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా సంక్రమించే ఈ గ్లకోమా వ్యాధిని సాధ్యమైనంత తొందరగా గుర్తించగలిగితే వైద్య చికిత్స అందించవచ్చన్నారు. కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, నొప్పి ఉండటం, చూపు మందగించడం, కాంతి లేకపోవడం దీని లక్షణాలని చెప్పారు. ఇండియాలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని సర్వేలు చెబుతున్నాయన్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రే ఏడాదికి 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా గ్లకోమా స్క్రీనింగ్ పరీక్షలు వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి, చికిత్స చేయించుకుంటే గ్లకోమా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సరోజినీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో వారం పాటు గ్లకోమా స్క్రీనింగ్ కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రజా చైతన్యం కలిగించే ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, రోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆదివారం సరోజినీ ఆస్పత్రిలో అవేర్నెస్ వాక్ని ప్రారంభించనున్నారు. గ్లకోమా (నీటి కాసులు) వ్యాధిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ వాక్ని నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా గ్లకోమా సంక్రమిస్తుంది. త్వరగా గుర్తిస్తే వైద్య చికిత్స అందించవచ్చు. గ్లకోమాతో కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మూడు శాతం మంది గ్లకోమా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మన దేశంలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. ఆ మేరకు ప్రపంచంలోని గ్లకోమా వ్యాధిగ్రస్తుల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. సరోజినీలో ఏటా 10 వేల మందికి వైద్యం సరోజినీ దేవి ఆస్పత్రి ఏటా 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తోంది. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం, క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటే గ్లకోమా నుంచి తప్పించుకోవచ్చు. సరోజినీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజా చైతన్యం, ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, స్లోగన్స్, పోస్టర్ల పోటీ నిర్వహిస్తు న్నారు. ఈ వారం రోజులు గ్లకోమా నిర్ధారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాల్ని వినియోగం చేసుకోవాలని కోరారు. -
నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్: పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్ల నుంచి వంటల్లో వాడే మసాలాలు, నూనెల వరకు...కిరాణా కొట్లో కొనే సరుకుల నుంచి కర్రీ పాయింట్లలో విక్రయించే కూరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే వంటకాల వరకు జరుగుతున్న కల్తీలకు ఇకపై నిమిషాల వ్యవధిలోనే అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి వాటి నాణ్యతను తేల్చేందుకు ఎక్కువ కాలం పడుతుండగా ఇక నుంచి ఫిర్యాదులు అందిన చోటే పరీక్షలు జరగనున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై అక్కడికక్కడే ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఆహార కల్తీని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్’రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కార్యాలయ ఆవరణలో ఈ వాహనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, శాసన మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ తదితరులు ప్రారంభించారు. రూ. 50 లక్షలతో రూపొందిన ఈ వాహనంలో కల్తీలను నియంత్రించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహన నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం ఏటా రూ. 5 లక్షలను సైతం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇకపై ఈ వ్యాన్ నేరుగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫిర్యాదులు చేసే వినియోగదారుల ఇళ్ల వద్దకు వచ్చి మరీ పరీక్షలు చేయనుంది. చాలా రకాల నమూనాలపై కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడించనుంది. ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వాహనం సేవలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అవగాహన... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ కేవలం ఆహార పరీక్షలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ సంచరించనుంది. ఆహారం, తాగునీరు కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు, స్వీయ శుభ్రతలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించనుంది. వాహనంలోని టీవీ ద్వారా కల్తీకి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. వాహనంలో డ్రైవర్, ఫుడ్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, అటెండర్ ఉంటారు. నెలవారీ టార్గెట్ ప్రకారం ఈ వాహనం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటిస్తుంది. వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం 54 రకాల పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తాం. వెంటనే ఫలితాలను కూడా ప్రకటిస్తాం. ఈ వ్యాన్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. – డాక్టర్ కె.సావిత్రి, చీఫ్ ఫుడ్ ఎనలిస్ట్ (ఐపీఎం) ఇంట్లో వాటినీ పరీక్షించుకోవచ్చు ఇళ్లలో పాల నాణ్యతపై సందేహం ఉన్న వారు నేరుగా ఈ వ్యాన్ వద్దకు వచ్చి పాలను పరీక్షించుకోవచ్చు. – బి.విజయలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ వైరాలజీ స్పాట్‌కు వెళ్తాం సాల్వ్ చేస్తాం మాకు ఫిర్యాదు అందినా..అందకున్నా మేం స్పాట్‌కు వెళ్తాం. పాలు, ఉప్పు, పప్పు, కూరలు, అన్నం, నూనె వంటి వాటిపై తక్షణం పరీక్షలు నిర్వహిస్తాం. అక్కడికక్కడే రిజల్ట్‌ని ప్రకటిస్తాం. – బి.శారద, ఫుడ్ ఎనలిస్ట్ వీటిపై పరీక్షలు.. పాలు, నెయ్యి, పన్నీరు, నూనె, కారం, కారాబూందీ, ఆలూ చిప్స్, తీపిపదార్థాలు, ఉప్పు, మసాలాలతో కూడిన నిల్వ పదార్థాలు, అన్ని రకాల పచ్చళ్లను పరీక్షించి మొబైల్ ల్యాబ్ అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తుంది. ఆహార పదార్థాల్లో నిషేధిత రంగులుంటే వెంటనే పసిగడుతుంది. సందేహాలు ఉన్న కొన్ని నమూనాలను మాత్రం ఐపీఎంకు తరలించి పరీక్షిస్తారు. అలాగే చిన్న దుకాణాలు, బేకరీల్లో విక్రయించే నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్లు, పాల ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్‌లో 24 గంటల సమయం పట్టనుంది. ఫోన్ కొట్టు భరతం పట్టు.. ఆహార కల్తీలపై 9100107309 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిబ్బంది వాహనంతో వచ్చి నమూనాలు సేకరించి అక్కడికక్కడే ఫలితాలు ప్రకటిస్తారు. కల్తీ నిజమని తేలితే కల్తీదారుడిని జైలుకు పంపుతారు. వ్యాన్‌లో ఉండేవి ఇవే... వ్యాన్‌లో పరీక్షలు నిర్వహించడానికి ‘మిల్క్ స్క్రీన్, పీహెచ్ మీటర్ (నీరు, ఆయిల్ల అనాలసిస్ కోసం), న్యూమరికల్ బ్యాలెన్స్ పరికరం, కెమికల్ స్టాండ్, బ్యూరెట్, బ్యూరెట్ స్టాండ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ల్యాడర్, సెటప్ రేడియో, యాంప్లిఫ్లయర్, వర్క్ బెంచ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్, వాటర్ ట్యాంక్, సింక్, ఫైర్ ఎగ్జాస్ట్, కంప్యూటర్, ప్రింటర్, టీవీ ఉన్నాయి. త్వరలో మరో వాహనం: లక్ష్మారెడ్డి ఆహార కల్తీని నియంత్రించేందుకు తొలి దశలో రెండు వాహనాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రస్తుతానికి ఒక వాహనాన్ని పంపారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే మరో వాహనం వస్తుందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు, వ్యాపారులు కల్తీలను అరికట్టడంలో నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. ఆహార కల్తీ చట్టాన్ని మరింత కఠినంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. పటిష్టమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
ఇక హోటళ్లకూ గ్రేడింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేసే అన్ని రకాల హోటళ్లకు వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఆహార భద్రతా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాల సరఫరాకు ప్రధానంగా ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం, నాణ్యత విషయంలో వర్తకులు, వినియోగదారుల మధ్య భరోసా కలిగించడం, నాణ్యత పరీక్ష కేంద్రాలను పటిష్టపరచడం, పౌష్టికాహారాన్ని తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆహారపు అలవాట్లలో మార్పులను ప్రోత్సహిం చడం, వర్తకుల నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాల అమలుకు పక్కా వ్యవ స్థను ఏర్పాటు చేయడం.. లాంటి అంశాల అమలుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించామన్నారు. -
బ్యాంక్ ఖాతాల్లోకి ఆశావర్కర్ల వేతనాలు
హైదరాబాద్: ఆశా వర్కర్ల వేతనాలను వచ్చే నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. డీఎంహెచ్‌వో ద్వారా జీతాలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో నెలకు రూ.6 వేల వేతనం చొప్పున జమ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గురువారం ఇక్కడ డీఎంహెచ్ఎస్ ఆవరణలో జరిగిన తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో మంత్రి మాట్లాడారు. 2వ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎంల సమస్యలను సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులంటే ‘నేను రాను బిడ్డో.. సర్కారీ దవాఖానాకు... అనే వారని, ఇప్పుడేమో ‘పోదాం పదా బిడ్డో.. సర్కారు దవా ఖానాకు’అంటున్నారని చమత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ డీహెచ్ లలితకుమారి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా పురుషోత్తం రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారా మెడికల్, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సర్కారు ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ కేంద్రాలు ఉండేవని, తొలుత గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనమండలిలో మంగళవారం కేసీఆర్ కిట్ పథకంపై లఘు చర్చ జరిగింది. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్‌పేషెంట్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరిగేవని, అందులో 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుండేవని చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆసుపతుల్లో ప్రసవాలు 55 శాతం పెరిగాయన్నారు. గర్భిణులకు రూ.12–13 వేలు ఇస్తున్నామన్నారు. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయించామన్నారు. కేసీఆర్ కిట్ పథకం కింద రాష్ట్రంలో 98,189 ప్రసవాలు జరిగాయని, సిజేరియన్లు తగ్గాయన్నారు. కేసీఆర్ కిట్‌కు సభ్యుల నుంచి ప్రశంసలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను నిలబెట్టాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. చికిత్స చేయా ల్సిన ప్రదేశాలే.. తగిన భద్రతా ప్రమాణాలు పాటించక తుదిశ్వాసకు కేంద్రాలుగా మారు తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల కాసుల కక్కుర్తి కూడా ఈ దుస్థితికి కారణామని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రి ఘటనతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీస స్పందనా లేదేం? రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వపరంగా పర్యవేక్షణ కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. రోహిణి ఆస్పత్రి ప్రమాదంలో ఇద్దరు చనిపోయినా వైద్యారోగ్య శాఖలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు రోహిణి ఆస్పత్రి ప్రమాదం నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎలా ంటి చర్యలు తీసుకోబో తున్నారనేది ఆ శాఖలో ఉత్కంఠ కలిగించింది. కానీ ఉన్నతాధి కారులు మాత్రం ఏమీ జరగనట్లు గానే వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై జిల్లా అధికారుల ను ంచి కనీసం ఆరా కూడా తీయలేదని తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉన్న రోహిణిలో ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారులే చెబుతున్నారు. అయితే ఘటనకు కారణాలను తెలుసుకుని విశ్లేషించే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలను ప్రారంభించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికారుల ‘భాగస్వామ్యం’తోనే.. రోహిణి ఆస్పత్రి దుర్ఘటనపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రోహిణి ఆస్పత్రి యాజమాన్యంలో ఓ ఉన్నతాధికారికి భాగస్వామ్యం ఉండడమే చర్యలపై వెనుకంజకు కారణమని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన రోహిణి ఆస్పత్రి సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా. దీంతో అధికారులు ఆస్పత్రిపై చర్యల విషయంలో వెనుకంజ వేస్తున్నా రనే చర్చ జరుగుతోంది. అసలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండడమే రక్షణ చర్యల విషయంలో లోపాలకు కారణామని వైద్య వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అనుమతులు అక్కర్లేదా..? రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి 6,964 వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆస్పత్రులు 537 ఉన్నాయి. ఇలాంటివాటిలో చాలా ఆస్పత్రులు వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యుల భాగస్వామ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణకు ప్రధానంగా 15 శాఖల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ వైద్యశాఖ అధికారుల ‘చల్లని చూపు’ కారణంగా చాలా వరకు అనుమతులు లేకుండానే ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ‘‘వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు భాగస్వాములుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతుల విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా వెంటనే అనుమతులు ఇస్తున్నారు. ఇదే రోగుల భద్రతకు ఇబ్బందిగా మారుతోంది..’’ అని వైద్యారోగ్య శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్త వైద్య విద్య కళాశాలల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి పంపించాలని వైద్య, ఆరోగ్యమంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త వైద్య కాలేజీల ఏర్పాటు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ కొత్త వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన మిగతా విభాగాల అధికారులు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు సహకరించాలని ఆదేశించారు. -
వైద్య శాఖకు ‘కాంట్రాక్ట్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ‘కాంట్రాక్టు’చిచ్చు రగిలింది. కొత్త వైద్యుల నియామక పద్ధతిపై ప్రస్తుత కాంట్రాక్టు వైద్యులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లో తాము చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పటికైనా నియామక ప్రక్రియలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలోని కాంట్రాక్టు వైద్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం(సీడబ్ల్యూఏటీఎస్) సోమవారం ప్రకటన జారీ చేసింది. అంతకుముందు సీడబ్ల్యూఏటీఎస్ అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధానకార్యదర్శి ఎల్.పూర్ణచందర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు వైద్యులు సోమవారం హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మూకుమ్మడిగా సర్వీసు నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రికి, అధికారికి లేఖలు రాశారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 700 మంది కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. గరిష్టంగా 10 ఏళ్లుగా మారుమూల, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు పద్థతిపై పనిచేసే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో వైద్య విభాగ నియామక కమిటీ ఆధ్వర్యంలో ప్రాధాన్యత కల్పించేది. శాశ్వత నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేది. ఈ నేపథ్యంలో వైద్య విద్య పూర్తి చేసినవారు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు ముందుకు వచ్చేవారు. ప్రభుత్వం శాశ్వత నియామకాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీతో కాకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో నియమించాలని నిర్ణయించారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్న మాకు కొత్త విధానంతో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్టు వైద్యులుగా పనిచేసేందుకు ఏ ఒక్క వైద్యుడూ ముందుకురారు. ప్రజారోగ్య సేవలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం మాపై అశ్రద్ధ వహిస్తూ మా నియామక ప్రక్రియకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కాంట్రాక్టు వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మా సేవలను గుర్తించి డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీతోనే నియామకాలు చేపట్టాలని కోరుతున్నాము. లేని పక్షంలో కాంట్రాక్టు వైద్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూఏటీఎస్) అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి ఎ.పూర్ణచందర్, నాయకులు ఎల్.రాంబాబు, బి.శ్రీనివాస్, టి.శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హెల్త్ హబ్‌గా హైదరాబాద్
‘డబ్ల్యూసీవో–2017’లో మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగానికి ప్రత్యేక బడ్జెట్, అధిక నిధులు కేటాయించడంతో హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తోమెట్రీ(డబ్ల్యూసీవో)–2017’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, వ్యాక్సినేషన్ వంటి హెల్త్ ఇండికేటర్స్‌లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 48 దేశాల నుంచి 1,500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జి.ఎన్. రావు, ప్రొఫెసర్ కోవిన్నాయుడు, డబ్ల్యూసీవో ప్రెసిడెంట్ డాక్టర్ ఉదక్ ఉడోమ్, ఇండియా విజన్ సీఈవో వినోద్ డానియేల్, ఆప్తోమెట్రీ వరల్డ్ కౌన్సిల్ ఎండీ స్యూచైలిస్ తదితరులు పాల్గొన్నారు. ఎసిలార్, ఎఫ్ఐఏ ఒప్పందం నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ అటోమొబైల్ (ఎఫ్ఐఏ), కంటి అద్దాల తయారీ సంస్థ ఎసిలార్లు చేతులు కలిపాయి. ఈ సందర్భంగా సదస్సులో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. -
పేదలకు ఉచితంగా డయాలసిస్
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా డయాలసిస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మం త్రి హరీశ్‌రావుతో కలసి ఆయన ప్రారం భించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీ బాధితుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియ నెలలోగా పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్ పరికరాలను వాడుతున్నామని తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఖరీదైన వైద్యం చేయిం చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేశా రని చెప్పారు. ప్రైవేట్ వైద్యులు చిన్నాచితకా వ్యాధులకూ అనవసరంగా ఆపరేషన్లు చేస్తే సహించమని మంత్రి హెచ్చరించారు. సర్కార్ ఆస్పత్రుల వద్ద క్యూలు ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’అని పాడుకున్న తెలంగాణ ప్రజలే ఇప్పుడు అవే ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. ఆర్థికంగా బక్కచిక్కిన తెలంగాణ పల్లెల్లో కిడ్నీ వ్యాధి భూతంలా విస్తరి స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్, జర్మనీ మెడికల్ టెక్నాలజీ లతో కూడిన అధునాతన పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. మొదటి డయాలసిస్ సెంటర్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఆస్పత్రుల ఆధునీకర ణకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మని మంత్రి వివరించారు. -
‘జీవన్‌దాన్’కు ఐదు వేల మంది అంగీకారం
యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ - మంత్రి లక్ష్మారెడ్డి, హీరో నాగార్జున - సహా పలువురు ప్రముఖుల హాజరు సాక్షి, హైదరాబాద్: జీవన్‌దాన్‌కు విశేష స్పందన లభించింది. చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసేందుకుగాను శనివారం ఐదువేల మంది ముందుకు వచ్చారు. ఈ మేరకు వారంతా జీవన్‌దాన్ అంగీకారపత్రంపై సంతకం చేశారు. యశోద ఆస్పత్రి, జీవన్‌దాన్ సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, డీజీపీ అనురాగ్‌శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యశోద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు, జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ జి స్వర్ణలత, వైజీహెచ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. జీవన్‌దాన్‌లో ఇప్పటి వరకు 18 వేల మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిందని చెప్పారు. అరుదైన కాలేయ, గుండె మార్పిడి చికిత్సలను కూడా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఏటా 15 లక్షల మంది వివిధ ప్రమాదాల బారిన పడి మరణిస్తుండగా, వీరిలో 5 నుంచి 10 శాతానికి మించి కుటుంబాలు అవయవదానానికి అంగీకరించడం లేదన్నారు. నాగార్జున మాట్లాడుతూ తాను అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేసి, నిజ జీవితంలో సూపర్‌హీరో అయ్యానని అన్నారు. అవయవదానం చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైజీహెచ్ చైర్మన్ జి రవీందర్రావు మాట్లాడుతూ జీవన్‌దాన్‌కు అత్యాధునిక అంబులెన్స్‌ను విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దాతల నుంచి సేకరించిన అవయవాలను వేగంగా, సురక్షితంగా స్వీకర్తల చెంతకు చేర్చవచ్చన్నారు. -
సరోగసీ దందాకు ఇక అడ్డుకట్ట
కొత్త విధానం రూపకల్పనకు అధ్యయన కమిటీ సాక్షి, హైదరాబాద్: సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర సరోగసీ బోర్డు(ఎస్ఎస్బీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త విధానంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని వైద్య నిపుణులు, తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సారథ్యంలో ఈ కసరత్తు వేగం పుంజుకుంది. 6 నెలల క్రితం ఓ విదేశీయురాలు హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం భర్తతో కలసి వారి దేశం తిరుగుపయనమయ్యే సమయంలో ఎంబసీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పాపను తీసుకెళ్లాలంటే డీఎన్ఏ పరీక్షలు చేయించాలని స్పష్టంచేశారు. తీరా ఆ పరీక్షల ఫలితాల్లో ఆ పాపకు, దంపతులకు జన్యు సంబంధం లేదని తేలింది. దీంతో అప్పుడే సరోగసీ ముసుగులో ప్రైవేటు క్లినిక్‌ల అక్రమాలు తెరపైకి వచ్చాయి. కానీ తనిఖీలు లేకపోవటంతో ఈ దందా క్రమంగా విస్తరించినట్లు ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
త్వరలో సరోగసీ బోర్డు
- అద్దె గర్భం వ్యాపారానికి ముకుతాడు - 22న మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసిన అద్దె గర్భాల దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. సరోగసీ వ్యాపారాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సరోగసీ చట్టం–2016 ప్రకారం రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 22న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులోనే సరోగసీ బోర్డు ఏర్పాటుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్రం తెచ్చిన సరోగసీ నియంత్రణ చట్టం–2016 ప్రకారం అద్దె గర్భాన్ని వ్యాపారం చేస్తే కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో హైదరాబాద్ కేంద్రంగా సరోగసీ వ్యాపారం ఎల్లలు దాటింది. సరోగసీపై ఏ దేశంలో ఎలా..? సరోగసీని వ్యాపారం చేస్తే దక్షిణాఫ్రికాలో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. బ్రిటన్‌లో గరిష్టంగా మూడు నెలలు, నెదర్లాండ్‌లో ఏడాది, గ్రీస్‌లో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రష్యాలో అలాంటి శిక్షలేమీ లేవు. ఆ దేశంలో సరోగసీ ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. మన దేశంలో పెళ్లయిన దంపతులే సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు అర్హులు. పైన పేర్కొన్న ఏ దేశంలోనూ ఈ నిబంధన లేదు. పెళ్లి కాని వారెవరైనా సరోగసీ ద్వారా బిడ్డకు తల్లి కావచ్చు. నెదర్లాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోనైతే పురుషుడు లేదా మహిళ పెళ్లికాకపోయినా సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు. సరోగసీకి బంధుత్వం తప్పనిసరి.. విదేశాల్లో అద్దె గర్భం ఇచ్చే తల్లికి, బిడ్డను పొందే వారికి మధ్య బంధుత్వం అవసరం లేదు. కానీ మన దేశంలో మాత్రం సరోగసీ ఇచ్చే మహిళకు, సరోగసీ ద్వారా బిడ్డను పొందే దంపతులకు మధ్య తప్పనిసరిగా బంధుత్వం ఉండాలన్న నిబంధనను కేంద్ర చట్టంలో పొందుపరిచారు. దీనివల్ల వ్యాపారాత్మక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. -
ముప్పు ముంచుకొస్తున్నా.. మొద్దు నిద్రే!
కలెక్టర్లతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమైనా అప్రమత్తం కాని వైద్యాధికారులు రాష్ట్రంలో వ్యాధుల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. దోమల స్వైరవిహారానికి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా వర్షకాలంలో మురుగు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు అలసత్వం మాత్రం వీడడంలేదు. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అమాత్యుడు ఆదేశించినా.. పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు సైతం వెక్కిరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ డెంగీ హైరిస్క్ జిల్లాలు పాత ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి,నిజామాబాద్, మహబూబ్‌నగర్ డెంగీ హైరిస్క్‌లో ఉండే ప్రజలు 54,23,000 మలేరియా హైరిస్క్ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ మలేరియా హైరిస్క్ గ్రామాలు 2,067 మలేరియా హైరిస్క్‌లో ఉండే ప్రజలు 9,57,000 ఈ సీజన్లో వచ్చే ముఖ్య వ్యాధులు... తాగునీటి కాలుష్యంతో.. డయేరియా, టైఫాయిడ్ దోమల కారణంగా.. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా చిన్నారులకు.. న్యూమోనియా ఏజెన్సీ ప్రాంతాల్లో.. విషజ్వరాలు ఏంచేయాలి.. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు జిల్లాకో రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ఒకేచోట పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సంభవిస్తే జిల్లా టీంలు రంగంలోకి దిగుతాయి. అవసరమైతే రాష్ట్రస్థాయి టీం కూడా రంగంలోకి దిగాలి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 61 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. ఏం చేస్తున్నారు... మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించినా.. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. రెస్పాన్స్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 61 రకాల మందులకుగాను కొన్నింటినే అందుబాటులో ఉంచారు. -
సంబరాలకు సర్వం సిద్ధం
♦ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ♦ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న అమరవీరుల స్థూపం ♦ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి లక్ష్మారెడ్డి ♦ రెండో రోజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్.. ♦ మూడో రోజు ఒంటరి మహిళలకు పింఛన్ల అందజేత సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సంబరాలు అంబరాన్నంటనున్నాయి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో పెద్దఎత్తున వేడుకలను నిర్వంచనున్నారు. జూన్ 2న ప్రారంభమయ్యే ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అథితిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్అండ్బీ అథితి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ స్థూపం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 800 గజాల స్థలంలో 38 అడుగుల ఎత్తుతో కూడిన ఈ స్థూపానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అందుకోసం 8 మంది కళాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థూపం చుట్టూ పచ్చదనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఆవిర్భావ సంబరాలు జరిగే మూడు రోజులపాటు అన్ని ప్రభుత్వ కార్యలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అదే విధంగా పట్టణ ప్రధాన కూడళ్లలో కూడా విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆవిర్భావ వేడుకల ప్రారంభం రోజు జూన్2న పోలీస్ పరేడ్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం వివిధ కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళారూప ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్టతలు ప్రదర్శించిన వారిని సత్కరించనున్నారు. రెండవ రోజు కేసీఆర్ కిట్ పంపిణీ.. ఆవిర్భావ వేడుకల్లో భాగమైన రెండో రోజు జూన్ 3న... ప్రతిష్టాత్మకమైన కేసీఆర్ కిట్ పంపిణీ చేయనున్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పీహెచ్సీలలో కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. వీటి పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీ విషయంలో ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. కిట్ల పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యం చేశారు. వీటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 6154మంది ఒంటరి మహిళలకు పింఛన్లు.. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మూడో రోజు జూన్ 4 తేదీన ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సదరు ఎమ్మెల్యేల చేత పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6154 మంది ఒంటరి మహిళలు అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరికి జూన్ 4న ప్రభుత్వం నిర్దేశించిన రూ.వెయ్యి చొప్పున పింఛన్లు అందజేయనున్నారు. జిల్లాలోని ఒంటరి మహిళల పింఛన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.61.54లక్షలను విడుదల చేసింది. -
ద్విచక్ర వాహనాల ద్వారా టీకాలు
- ఇంటింటికీ వెళ్లి పిల్లలకు సేవలు.. - దేశంలోనే తొలిసారిగా ప్రారంభం - ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘టీకా బండి’అనే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు వారి ఇళ్లకే వెళ్లి అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పది ద్విచక్ర వాహనాలను శనివారం మంత్రి ఏఎన్ఎంలకు అందించారు. ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా 28 శాతం పిల్లలకు టీకాలు అందడం లేదని మంత్రి చెప్పారు. అసలు టీకాలే తీసుకోని వారు 7 శాతం మంది ఉన్నారని చెప్పారు. అర్బన్ స్లమ్ ఏరియాలు, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న చోట్ల పిల్లలను గుర్తించి టీకాలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం 68 శాతం ఉన్న టీకాల శాతాన్ని 80 శాతానికి పెంచాలనే లక్ష్యం తో టీకా ద్విచక్ర వాహనాల రూపకల్పన చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబా ద్‌కు 5, మేడ్చల్‌కు 3, సంగారెడ్డి జిల్లాకు రెండు చొప్పున వాహనాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. సోమ, మంగళ, గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో టీకాలు వేస్తారని వెల్లడించారు. కాగా, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం రెండో విడతలో భాగంగా ఈ నెల 7 నుంచి 18 వరకు 13 జిల్లాల్లో టీకాలు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమణి పాల్గొన్నారు. -
రోగులను డబ్బులడిగితే క్రిమినల్ కేసులు
ఛాతీ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రోగులను డబ్బులు అడిగే ప్రభుత్వ ఆసుప త్రుల వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న నిరుపేద రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినా, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అలాంటి వారిపట్ల కఠినం గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. శనివారం మంత్రి ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి... ఆసు పత్రిలో అందుతున్న వైద్యసేవలు, రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రిలోని పడకలు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ఇటీవల ఐసీయూ లో ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో కొంతమంది రోగులు మృతిచెందిన అంశంపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంపై వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం అడిగితే నాకు చెప్పండి...: ఎవరైనా లంచం అడిగితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా లక్ష్మారెడ్డి రోగులకు సూచించారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఛాతీ ఆస్పత్రిలో త్వరలోనే అధునాతన ఐసీయూ సహా, సీటీ స్కాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాలను అభివృ ద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగానే గర్భవతులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించి, అధునాతన పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికుమార్, ఆర్ఎంఓ నరేందర్ మంత్రి వెంట ఉన్నారు. -
‘వీల్‌చైర్’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక
-
‘వీల్‌చైర్’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక
⇒ నరసింహన్‌కు వివరణ ఇచ్చిన వైద్య శాఖ ఉన్నతాధికారులు ⇒ బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన పలువురు రోగులు హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన వీల్‌చైర్ ఘటనపై వైద్య ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి నివేదిక అందించారు. ఇరువురు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన బేగంపేటకు చెందిన రాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకు రాగా వీల్చైర్లు అందుబాటులో లేవు. మరుసటిరోజు చిన్నపిల్లల సైకిల్‌ను వీల్‌చైర్‌గా వినియోగించి గాంధీ ఓపీ విభాగానికి వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న రాజు చిన్నపిల్లల సైకిల్‌తో వచ్చిన దృశ్యాలతో ‘హేరాం.. ఎంతటి దైన్యం’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పందించి వీల్‌చైర్ ఘటనతోపాటు గాంధీ ఆస్పత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వైద్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ డాక్టర్ రమణి, గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ బీఎస్వీ మంజుల శనివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలసి నివేదిక అందించారు. రాజు విద్యుదాఘాతానికి గురై గాంధీ ఆస్పత్రిలో చేరిన తర్వాత అందించిన వైద్యసేవలను కేస్‌షీట్లతో సహా చూపించారు. వీల్చైర్ల విషయంతో ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు పి.వెంకటరత్నం, ఎస్.మహేంద్రాబాయిలను విధుల నుంచి తొలగించినట్లు వివరించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో ఓపీ, ఐపీ వివరాలతోపాటు మౌలిక సదుపాయాలు, వైద్యపరికరాలు, లిఫ్ట్‌లు, సీటీ, ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు, పడకలు, పారిశుధ్యం తదితర అంశాలపై రూపొందించిన నివేదికను గవర్నర్‌కు అందించారు. గాంధీ ఆస్పత్రిలో నిరుపేదలకు అందిస్తున్న వైద్యసేవలపై గతంలోనే గవర్నర్ నరసింహన్ అధికారులకు హెచ్చరించారు. గతేడాది ఫిబ్రవరి 19వ తేదిన గాంధీ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన గవర్నర్ అక్కడి వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న ఘటనలపై సాక్షి స్పందించిన తీరుపై పలువురు రోగులు, రోగి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలోనే బస చేసి అన్ని అంశాలపై సమీక్షించనున్నారు. -
ఉద్యమంలా రాష్ట్ర పునర్నిర్మాణం
- ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం - హెల్త్ కార్డ్ డిజిటైజేషన్ చేస్తాం - మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, సిరిసిల్ల: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తరహాలోనే తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన వేములవాడ మండలం తిప్పాపూర్‌లో శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డారు. ప్రజల ఆరోగ్య కార్డులను డిజిటైజేషన్ చేసే కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ముందువరుసలో నిలపుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్ర గామిగా నిలిపారని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, 20 శాతం అదనంగా పేషెంట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారని వెల్లడించారు. ఇందుకనుగుణంగా పీహెచ్ సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులను బలో పేతం చేస్తున్నామన్నారు. గర్భిణులకు రూ.12 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలనేది గొప్ప పథక మని, ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనే లక్ష్యంతో ఈపథకాన్ని ప్రవేశ పెట్టారని, బేబీ కిట్ కూడా కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. హెల్త్ డిజిటైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ సిరిసిల్ల: కేటీఆర్ హెల్త్ రికార్డు డిజిటైజేషన్ పైలట్ ప్రాజెక్ట్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసుకోవా లని మంత్రి కేటీఆర్ కోరా రు. జిల్లాలోని ప్రతీపౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటైజే షన్ చేసి మొత్తం సమాచారా న్ని సేకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేయడమే డిజిటైజేషన్ ఆఫ్ హెల్త్ కార్డ్ అని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏ ఆస్పత్రికైనా వెళ్లి ఆధార్ కార్డు చూపిస్తే, ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుస్తుందని తెలిపారు. బీపీ ఉందా, బ్లడ్ గ్రూప్ ఏమిటి, ఏ మందులు వాడొచ్చు లాంటి పూర్తి వివరాలు తెలుస్తుయని పేర్కొ న్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపొటు వచ్చిన అత్యవసర పరిస్థితుల గోల్డెన్ అవర్‌లో విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ వివరాలు ఉపయోగపడుతాయన్నారు. సర్పంచుల భర్తలు మైక్ పట్టొద్దు: మంత్రి కేటీఆర్ క్లాస్ ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులు ఈ ప్రొటోకాల్ పాటించాలని రాష్ట్ర ఐటీ మున్సి పల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. స్థానిక సర్పంచ్ భర్త మైక్ పట్టుకోవడంతో వేదికపై మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు మాట్లా డటం మంచిదికాదని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ మంత్రి లక్ష్మారెడ్డి భార్య, తన భార్య వచ్చి మాట్లాడితే బాగుంటుందా అని చమత్కరించారు. మహిళా ప్రజాప్రతినిధులు వేదికలపై మాట్లాడేస్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి కూపంలో ప్రభుత్వ ఆస్పత్రులు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్లక్ష్యమే దీనికి కారణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటే భయపడే స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో రూ.150 కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటనతోనైనా కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కళ్లు తెరవాలన్నారు. గాంధీ, నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో చాలా సంఘటనలు జరిగాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర
ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేస్తున్న ఆరు ఆసుపత్రుల సీజ్ ⇒ మంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభం ⇒ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు సాక్షి, హైదరాబాద్: అనవసరంగా శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్యశాఖ కన్నెర్ర చేసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తన సొంత జిల్లా కేంద్రంలోనే ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తున్న ఆరు ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేశారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో గుబులు రేగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని యశోధర, షిర్డిసాయి, వసుధ, సాయి చందన్, మేఘన, ధనుష్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఆయా ఆసుపత్రులు అనవసర శస్త్రచికిత్సలు, సిజేరియన్లు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కనీస నిబంధనలు పాటించకపోవడం, మౌలిక వసతులు కల్పించక పోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ ఆసుపత్రుల్లో కొన్ని ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారికి అర్హత లేకున్నా శస్త్రచికిత్సలు చేయడంపై జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని.. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా హెచ్చరించారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులు 90% ఆసుపత్రుల ప్రొటోకాల్ ప్రకారం ప్రతీ శస్త్రచికిత్స వివరాలు ప్రభుత్వానికి నివేదించాలి. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే దానికి గల కారణాలను వివరించాలి. కానీ 90 శాతానికి పైగా ఆసుపత్రులు ఆ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు తీవ్ర యాంటీ బయాటిక్స్ మాత్రలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎందుకు రాయాల్సి వచ్చిందో నివేదించాలి. ఆ మేరకు ఆసుపత్రికి ఒక కమిటీ ఉండాలి. ఇవేవీ ఆయా ఆసుపత్రులు పాటించడం లేదు. ఇక అనేక ఆసుపత్రుల్లో రోగులకు కనీస వసతులు ఉండటం లేదు. అవసరమున్నా లేకున్నా ప్రతీ దానికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులైతే వైద్య పరీక్షలు చేయించే విషయంలో డాక్టర్లకు టార్గెట్లు కూడా పెడుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు వైద్యాధికారులకు సమాచారం ఉంది. మొత్తం ప్రసవాల్లో 58% సిజేరియన్లే రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరిగితే.. అందులో 58 శాతం సిజేరియన్ ఆపరేషన్లే. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 74 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతోన్న కాన్పుల్లో 40 శాతం సిజేరి యన్ ద్వారా జరుగుతున్నాయి. సిజేరి యన్ కోసం రూ. 30 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎటువంటి శస్త్రచికిత్స, సిజేరియన్ అయినా కూడా నిబంధనల ప్రకారమే చేశారా? లేదా? అన్న వివరాలను తప్పనిసరిగా ప్రభు త్వానికి నివేదించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని.. నిబం ధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు విన్నవించినట్లు తెలిసింది. అనవసర సిజేరియన్లు చేస్తే ఆసుపత్రుల సీజ్: లక్ష్మారెడ్డి అనవసర సిజేరియన్లు చేసే ఆసుపత్రులను సీజ్ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ఆసుపత్రిని సీజ్ చేశామన్నారు. ఆసుపత్రుల్లో చేసే ప్రతీ శస్త్రచికిత్స వివరాలను ప్రతి నెలా తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపాల్సిందేనన్నారు. ఏఎన్ఎంలకు ఆన్లైన్ ట్యాబ్ బేస్డ్ యాప్ అన్మోల్ను మంగళవారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. శస్త్రచికిత్సల ప్రొటోకాల్ ఉంటుందని... ఆ వివరాల ద్వారా అనవసరమైన వాటిని గుర్తించొచ్చన్నారు. శస్త్రచికిత్సల వివరాలు పంపని ఆసుపత్రులపైనా చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో 4,900 మంది ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు ఇస్తామని, వారికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం నుంచి ఆరుగురు అధికారులను రాష్ట్రానికి నియమించామని తెలిపారు. కొందరు ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. -
‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం వెళ్లి పాక్షికంగా చూపు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. వారికి అన్ని రకాలుగా చికిత్స అందిస్తున్నామని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ఆపరేషన్‌కు వినియోగించిన కలుషిత రింగర్ లాక్టేట్ ద్రావకం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, అందుకే 8 మంది పాక్షికంగా కంటిచూపు కోల్పోయారని తెలిపారు. ఇందుకు కారణమైన నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని మంత్రి తెలిపారు. -
శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
జిల్లాకో క్రీడా పాఠశాల: పద్మారావు సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జిల్లాకో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉన్న క్రీడా పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలనూ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం విద్యా మంత్రితో మాట్లాడతానని మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజల్లో భయం ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చికిత్స కోసం వెళ్తే ప్రాణం పోతుందన్న భయం పేదల్లో నెలకొందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని అవకాశంగా చేసుకొని ప్రైవేటు ఆసుపత్రులు పేదలను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌కే ఇటీవల ఎదురైందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ వస్తోందన్నారు. ఆలయ భూములపై చర్యలేవీ?: షబ్బీర్ రాష్ట్రంలో దేవాలయ భూములు స్వాహా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. దీన్ని నియంత్రించేందుకు వెంటనే టాస్క్ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు వారి నిధుల నుంచి కొంతమొత్తాన్ని విడుదల చేసినా దేవాదాయశాఖ మాత్రం కామన్‌గుడ్ ఫండ్ నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వటం లేదన్నా. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో దేవాలయాల కింద 82 వేల ఎకరాల భూమి ఉన్నా అందులో పెద్ద మొత్తం కబ్జాలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కొత్త కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పడ్డ అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని ప్రకటించారు. వీటి వల్ల నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని ఎల్బీనగర్లో ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. దాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయాలని సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇటీవల పోలీసు ఆత్మహత్యలు పెరిగినందున వారిలో ఆత్మస్థయిర్యం నింపేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు నారదాసు, భానుప్రసాద్‌లు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతు బజార్లన్నీ నగదు రహితం: హరీశ్ వచ్చే రెండు, మూడు వారాల్లో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో నగదురహిత లావాదేవీలు ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ఈ విధానం ప్రారంభించాక కొనుగోళ్లు పెరిగాయని, రైతులు, వినియోగదారులు దీన్ని స్వాగతించడంతో ఈ విధానాన్ని అన్ని రైతు బజార్లలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. -
లెస్ టెండర్లతో గోదాముల నిర్మాణంలో రూ.150కోట్ల ఆదా
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల నిల్వకోసం 330 ప్రాంతాల్లో గోదా ములను మంజూరు చేశామని, ఇందులో 321 ప్రాంతాల్లో గోదాముల నిర్మాణ పనులను ప్రారంభించామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.1024.50 కోట్ల నాబార్డు రుణంతో మొత్తంగా 17.07లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వీటిని చేపట్టామని వెల్లడించారు. గోదాములకోసం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసాకు ఆన్లైన్ టెండర్లు పిలిచామని, అత్యంత పారదర్శకంగా ఈ జరిగిన టెండర్ల కారణంగా 11.5 లెస్తో మొత్తంగా రూ.150 కోట్ల మేర ఆదా అయిందని తెలిపారు. సోమవారం సభ్యులు మర్రి జనార్దన్‌రెడ్డి, బాజిరెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నిమ్స్‌లో అవినీతిపై చర్యలు: మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో అవినీతి జరగలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రామ్మోమన్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా,అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ప్రాథమిక ఆరోగ్య సేవలన్నీ ఒకేచోట
- త్వరలో ఈహెచ్ఎస్ ఓపీ ప్రారంభం - ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు - పైలట్ ప్రాజెక్ట్‌గా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ఓపీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు ఓ శుభవార్త. జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సాధారణ సమస్యలతోపాటు బీపీ, షుగర్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఈ వర్గాల రోగులకు రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చే సింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్లో అధునాతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ఓపీ సేవలను డిసెంబర్ చివరినాటికల్లా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అల్లోపతి వైద్యంతోపాటు ఆయూస్, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య సేవలను కూడా ఓపీలో అందిస్తారు. దంత వైద్యునితోపాటు మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్, గైనిక్ నిపుణులు అందుబాటులో ఉంటారు. వాక్సినేషన్ ప్రక్రియ, ఫ్యామిలీ ప్లానింగ్ చికిత్సలు కూడా చేస్తారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతోపాటు అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, డార్క్‌రూమ్, ఈసీజీ, క్లినికల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. హెచ్ఐవీ బాధితుల కోసం ఐసీటీసీ సెంటర్‌తోపాటు కౌన్సిలర్‌ను కూడా నియమించారు. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందడం లేదు. అనివార్య పరిస్థితుల్లో ఓపీకి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. ఈ అంశంపై ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆరోగ్య శ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ రోగులకు ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటు లోకి తీసుకురావాలని భావించింది. ఆ మేరకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ ఎస్ సీఈవో పద్మ నేతృత్వంలో ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సభ్యుడు మధుసూదన్‌లు ఓపీ కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. -
రాష్ట్రంలో డెంగీ మృతులు ఇద్దరే
- అదుపులోనే ఉంది.. ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి - అన్ని రకాల వ్యాధులు ఎదుర్కొనేందుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: డెంగీ ప్రాణాంతకం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, గోవిందాపురం, రావినూతలలో విష జ్వరాల విజృంభణ విచారకరమన్నారు. మరణాలపై ఆడిట్ చేరుుంచామని, ఆ నివేదిక ప్రకారం ఇద్దరు మాత్రమే డెంగీ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతి చెందారని వెల్లడించారు. కొందరు గుండెపోటు, కిడ్నీ ఫెరుుల్యూర్, వివిధ వ్యాధి లక్షణాలతో మృతి చెందారని, మరికొందరు డెంగీతో చనిపోరుునట్టు అను మానాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ డెంగీ కనిపిస్తున్నా అదుపులోనే ఉందని చెప్పారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, అనుభవం లేని డాక్టర్లు డెంగీ బూచీతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డెంగీతో అనేక మంది చనిపోతు న్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డెంగీ సహా అన్ని రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ వర్షాకాల సీజన్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. జ్వర లక్షణాలున్న ప్రతి ఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేరుుంచామని పేర్కొన్నారు. -
విధి ముందు తలవంచింది
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి హర్షిత - కారుణ్యమరణం కోసం గతంలో హెచ్ఆర్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు - వైద్య, ఆరోగ్య మంత్రి ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స - కాలేయం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు.. ముందుకు రాని దాతలు - చివరకు రక్తపు వాంతులు చేసుకుని..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత సాక్షి, హైదరాబాద్: మృత్యువుతో కడవరకూ పోరాడిన చిన్నారి హర్షిత చివరికి విధి ముందు తలవంచక తప్పలేదు. కుమార్తె ప్రాణాలతో దక్కుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల(జగద్గిరిగుట్టలో తాత్కాలిక నివాసం)కు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత(11) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా.. వైద్యులు బాలికను పరీక్షించి కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. కారుణ్య మరణానికి అనుమతించాలని.. బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక హర్షిత కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాంచంద్రారెడ్డి దంపతులు జూలై 14న ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ‘మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి’ శీర్షికతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైంది. దీంతో చిన్నారికి వైద్యం చేయించాలని హెచ్ఆర్సీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైద్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి హర్షిత చికిత్సకయ్యే ఖర్చంతా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కాలేయ మార్పిడికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సదరు ఆస్పత్రికి లేఖ కూడా రాశారు. ఆస్పత్రి ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. రక్తపు వాంతులు: బిడ్డకు కాలేయాన్ని దాన ం చేసేందుకు తండ్రి రాంచంద్రారెడ్డి ముందుకు రావడంతో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అయితే తండ్రి కాలేయంలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. మూడు నెలలు కాలేయ దాత కోసం ఎదురు చూసినా ఫలితం లేక పోయింది. చిన్నారి హర్షిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రక్తపు వాంతులు చేసుకోవడంతో చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హర్షిత మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హర్షిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి బంధువులు, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తెకు కాలేయాన్ని దానం చేసేందుకు తండ్రి ముందుకొచ్చినా వైద్యులు చికిత్సలో జాప్యం చేశారని ఆరోపించారు. హర్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చికిత్సలో జాప్యం చేసిన వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హర్షితకు చికిత్స అందించడంలో వైద్య పరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించినా.. దాతలు దొరక్కపోవడం వల్లే కాలేయ మార్పిడి చికిత్స చేయలేకపోయామని వివరించింది. -
నర్సింగ్ కళాశాల ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలో నర్సింగ్ కళాశాలను గురువారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి ఇతోధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
'నర్సుల సంక్షేమానికి ప్రత్యేక డైరెక్టరేట్'
హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర కీలకమని, వారి సంక్షేమం కోసం అతి త్వరలోనే ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్‌ఏఐ) తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ బైనియల్ కాన్ఫరెన్స్ ను ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ప్రాంగణంలోని జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. అలాగే ‘నర్సెస్: ఏ ఫోర్స్ ఫర్ ఛేంజ్: ఇంఫ్రూవింగ్ హెల్త్ సిస్టమ్స్ రెజీలియన్స్’ అనే థీమ్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పటికీ సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా 20 శాతం అవుట్ పేషెంట్ రోగులు పెరిగారని చెప్పారు. కాళోజీ హెల్త్ వర్సిటీలో నర్సింగ్ విద్య కోసం ప్రత్యేకంగా రిజిస్ర్టార్ పోస్టును ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు త్వరలోనే ఆ పోస్టును కూడా ప్రవేశపెట్టి నియామకం జరపనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే తెలంగాణను గొప్ప రాష్ట్రంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. -
'తగిన చర్యలు తీసుకుంటున్నాం'
హైదరాబాద్: భారీ వర్షాలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా.. తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన నగరవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వాను సిద్ధం చేసి ఉంచామని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. -
పాలమూరును నాశనం చేశారు
చంద్రబాబుపై మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన పాలమూరు జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని మరింత నాశనం చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , గువ్వల బాలరాజుతో కలసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజే సీఎం కేసీఆర్ పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పాలమూరు ప్రజల జీవితాలు బాగుపడుతుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు అభివృద్ధికి పార్టీలకతీతంగా రాజకీయనేతలంతా కలసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బుధవారం జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి సీఎం కేసీఆర్ ధీటుగా మాట్లాడారన్నారు. పాలమూరు ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అపెక్స్ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీని టీటీడీపీ నేతలు ఇప్పటికైనా వదిలేయాలని మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు కపటబుద్ధి బయటపడింది: ఎమ్మెల్యే శ్రీనివాస్ బాబుకు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావడం ఇష్టం లేదని, ఢిల్లీలో బాబు కపట బుద్ధి బయట పడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఏపీ సర్కారు ఇప్పుడు పాలమూరుపై విషం కక్కుతోందన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు విషయంలో కమిటీని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తుంటే టీటీడీపీ నేతలు నోరు మెదపలేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేత డీకే అరుణ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముట్టడి
హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. -
ప్రైవేటు మెడికల్ ఫీజుల పెంపు
- కాలేజీ యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు - ఎన్నారై కోటా ఫీజు రూ.55 లక్షల వరకు పెరిగే అవకాశం - బీ కేటగిరీ ఫీజు రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలకు.. - ప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలను సీఎంకు విన్నవించనున్న మంత్రి సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ ఫీజులను పెంచాలని యాజమాన్యాలు కోరగా... మంత్రి అందుకు అంగీకరించారు. అయితే ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నివేదించాక దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. త్వరలో ప్రైవేటు మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నందున ఆ లోపే ఫీజులను ఖరారు చేసి జీవో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫీజులు పెంచాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు గతనెల అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)కి విన్నవించాయి. అందులో భాగంగా మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. గతేడాదే ఫీజులు పెంచిన ప్రభుత్వం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి ఈ ఏడాది కూడా ఫీజులు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి ఫీజులను సవరించాలి. కానీ ఏడాదికే పెంచడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘నీట్’ ద్వారా భర్తీ చేస్తే పూర్తిగా ర్యాంకుల ఆధారంగానే సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని... ఇది తమకు నష్టమని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అందుకే పెంచుతున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ కేటగిరీలో ఎంతెంత..? రాష్ట్రంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలుండగా.. వాటిలో మొత్తం 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లున్నాయి. 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లున్నాయి. అవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.10 వేల ఫీజు వసూలు చేస్తారు. 13 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 2,100 ఎంబీబీఎస్ సీట్లలో 50 శాతం (1,050) సీట్లను ఎంసెట్ ద్వారా ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తారు. వారికి కన్వీనర్ కోటా కింద రూ.60 వేల ఫీజు వసూలు చేస్తారు. 35 శాతం (735) బీ కేటగిరీ సీట్లకు, మరో 15 శాతం (315) ఎన్నారై కోటా సీట్లకు మాత్రం ఏపీలో మాదిరిగా ఫీజులు పెంచుతారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీటుకు ఏడాదికి రూ.9 లక్షలు వసూలు చేస్తుండగా.. దాన్ని ఏపీ తరహాలో రూ.11 లక్షలకు పెంచనున్నారు. అలాగే సీ కేటగిరీ (ఎన్నారై) సీట్ల ఫీజు ప్రస్తుతం రూ.11 లక్షలుంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజును ఐదు రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ప్రకారమే తెలంగాణలో పెంచితే ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ.55 లక్షలు కానుంది. ఇక మైనారిటీకి చెందిన రెండు కాలేజీల్లో 300 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 60 శాతం, బీ కేటగిరీ సీట్లు 25 శాతం, ఎన్నారై కోటా సీట్లు 15 శాతం ఉన్నాయి. మైనారిటీ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు రూ.11 లక్షలుంది. దాన్ని రూ.15 లక్షలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి. ఎన్నారై కోటా ఫీజు ప్రస్తుతం రూ.13 లక్షలుండగా.. రూ. 30 లక్షలకు పెంచాలని కోరారు. ఆ ప్రకారమే ఫీజులు పెరగనున్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా.. వాటిలో 1,040 సీట్లున్నాయి. అందులో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లను కూడా ఏపీ మాదిరిగానే భర్తీ చేసే అవకాశాలున్నాయి. -
ప్రభుత్వాసుపత్రులను బద్నాం చేయొద్దు
మీడియాకు మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి జడ్చర్ల టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులను బద్నాం చేయొద్దని మీడియాకు వైద్య ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందలేక చివరి క్షణంలోనే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తీసుకురావడం వల్ల సహజంగానే ప్రతిరోజు మరణాలు అధికంగా ఉంటాయని, అంతమాత్రానా ప్రభుత్వ ఆస్పత్రులను అప్రతిష్ట పాల్జేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో పవర్‌కట్ వల్లే 20 మంది చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చిన డాక్టర్ రఘును సస్పెండ్ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. -
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష
విపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఉలిక్కి పడుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు మానుకుని అభివృద్ధికి కలసి రావాలని మంత్రి హితవు పలికారు. జిల్లా ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని, తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల 4.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. కాం గ్రెస్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది కానీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ సంస్థలకు ‘పారిశుద్ధ్యం’
మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య బాధ్యతలు అప్పగిం చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన పారిశుద్ధ్య విధానంపై శనివారం ఆయన కసరత్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పనితీరును సమీక్షించారు. బోధనాసుపత్రుల్లో ప్రతి బెడ్ నిర్వహణ వ్యయా న్ని రూ.6వేల నుంచి రూ.7వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త మంచాలు, రోజుకో రంగు చొప్పున వారానికి ఏడు రంగుల దుప్పట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం టీఎస్ఎంఎస్ఐడీసీ యాప్‌ని ఆవిష్కరించా రు. శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, ప్రజారోగ్య డెరైక్టర్ లలితాకుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పేద కుటుంబానికి చేయూత... నల్లగొండ జిల్లా భువనగిరి మండలం సూర్పల్లికి చెందిన చెరుకుపల్లి శ్రీరాములు అకాల మరణం చెందారు. దీంతో ఆయన కుటుం బం వీధినపడింది. విషయం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సీఎం సహాయనిధి కింద రూ.లక్ష ఆర్థిక సాయం వచ్చేలా లక్ష్మారెడ్డి చొరవ చూపారు. శ్రీరాములు భార్య స్వరూపను హైదరాబాద్ పిలిపించి ఆమెకు చెక్కును మంత్రి అందజేసినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఎంసెట్ కలవరం...
- పేపరు లీక్ వదంతులతో తల్లిదండ్రుల్లో ఆందోళన - విచారణకు సర్కార్ ఆదేశం సాక్షి, హైదరాబాద్/వరంగల్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 పేపరు లీక్ అయిందన్న వదంతులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. తాజా గందరగోళ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఎంసెట్ 81 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి తెలంగాణ ఎంసెట్-1లో 88 మార్కులు వచ్చాయి. అదే విద్యార్థికి ఎంసెట్-2లో 133 మార్కులు రావడంతో కొంతమంది తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తా యి. మరో విద్యార్థి మొదటి.. రెండో ఎంసెట్ మార్కులకు మధ్య 30 మార్కుల తేడా ఉండటంపైనా సందేహాలొచ్చాయి. అయితే, దీని ఆధారంగా పేపరు లీకయిందనడం అవాస్తవమని కొందరు కొట్టి పారేశారు. ఎంసెట్-1 పేపరుకు, ఎంసెట్-2 పరీక్షలకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పైగా మే 22న నిర్వహించిన ఎంసెట్-1 పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మినహాయించి నిర్వహించింది అయినందున... అప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు ఆ పరీక్షపై పెద్దగా శ్రద ్ధపెట్టకపోవచ్చంటున్నారు. ఎంసెట్-2 పూర్తిగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసమే నిర్వహించింది కనుక దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటారని వాదిస్తున్నారు. దీంతో మార్కుల్లో కచ్చితంగా తేడాలు వస్తాయంటున్నారు. మరోవైపు ఒక పరీక్ష పేపరు, మరో పరీక్ష పేపరు రూపకల్పనకు, వాటిల్లో ఇచ్చే ప్రశ్నలకు తేడాలుంటాయంటున్నారు. ఏదేమైనా ఆరోపణలు, అనుమానాలు వచ్చినందున వాటిని నివృత్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని ఉన్నత విద్యా మండలి వర్గాలు వెల్లడించాయి. జేఎన్టీయూహెచ్లో ధర్నా... ర్యాలీ ఇదిలావుంటే... పేపరు లీకేజీ వదంతుల నేపథ్యంలో మంగళవారం జేఎన్టీయూహెచ్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వర్సిటీలోని ఎంసెట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విచారణను నిష్పక్షపాతంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వర్సిటీలో ర్యాలీ చేపట్టారు. ఎంసెట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సీఐడీ విచారణ చేయాలి... పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్క నర్సయ్య డిమాండ్ చేశారు. ఆ వార్తలు అవాస్తవం ఎంసెట్-2 పేపరు లీక్ అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవం. నాకు తెలిసినంత వరకు పేపరు లీక్ అయ్యేందుకు ఆస్కారం లేదు. - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విచారణ చేపడతాం ప్రశ్నపత్రం లీక్ అయిందన్నదాంట్లో వాస్తవం లేదు. ఆరోపణలు వచ్చినందున అత్యున్నత కమిటీచే విచారణ చేపడతాం. లీక్ నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటాం. - వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశం ఆరోపణలపై ప్రాథమిక విచారణకు ఆదేశించాం. ఏ దశలోనైనా పేపరు లీక్‌కు సంబంధించి ఆస్కారం ఉన్నట్లు తేలితే పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. - ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి పేపరు లీక్ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాం. - ఎంసెట్-2 కన్వీనర్ ఎన్వీ రమణరావు -
హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి
ఎంజీఎం : హారితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, గిరి జన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ పిలుపునిచ్చా రు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలలతోపాటు డెంటల్, నర్సింగ్, ఆయుర్వేద కళాశాలల్లో ఒకే రోజు 10వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షిం చే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లా క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు కిమోథెరపీ మెరుగైనా సేవలు అందడంతోపాటు వారి పేరు క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి క్యాన్సర్ విభాగానికి కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అధునాతనపడకలను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వార్డును సైతం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కరుణ, ఏజేసీ ప్రశాంత్‌పాటిల్, హెల్త్యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు, కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, ఆర్ఎంఓ హేమంత్, శివకుమార్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ లీలావతి, టీజీడీఏ ప్రధానకార్యదర్శి మోహన్, వైద్యులు రాంకుమార్‌రెడ్డి, బాలాజీ, టీఎన్జీవోస్ నాయకులు రాజేశ్, రాంకిషన్ పాల్గొన్నారు. -
వైద్య పరికరాల టెండర్లలో సంస్కరణలు
ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే మందుల కొనుగోలు: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : వైద్య పరికరాలు, సర్జికల్స్, మందుల కొనుగోళ్ల టెండర్లలో భారీ సంస్కరణలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఎల్-1 పేరుతో నాసిరకం పరికరాలు సరఫరా చేసే కంపెనీల నుంచి కాకుండా.. నిర్ణీత ప్రమాణాలు పాటించే కంపెనీల ద్వారా నేరుగా వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేస్తామన్నారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. పశ్చిమబంగలో హసీబ్ కంపెనీకి చెందిన స్టెరైల్ వాటర్ బాటిళ్లు ప్రమాణాల మేరకు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ కంపెనీ నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొనే అర్హత ఉందన్నారు. గతేడాది జూన్ నెలలో హసీబ్ కంపెనీ సెలైన్ బాటిళ్ల టెండర్లలో పాల్గొందని మంత్రి వివరించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచే పదేళ్లుగా ఆ కంపెనీ సెలైన్లు సరఫరా చేస్తోందన్నారు. సరోజిని కంటి ఆస్పత్రి ఘటనలో ప్రాథమిక నివేదిక ప్రకారం సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలిందన్నారు. సెలైన్ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామనీ, దానిపై ఒక కమిటీ వేశామన్నారు. పరీక్షల నివేదిక, కమిటీ రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఈ కంటి ఆసుపత్రి ఘటనలో 13 మందిలో 8 మంది పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. మిగిలిన ఐదుగురికి పూర్తిగా కళ్లు పోయినట్లుగా భావించలేమన్నారు. అందులో ఒకరికి శస్త్రచికిత్స చేస్తే సాధారణ పరిస్థితి వస్తుందన్నారు. మిగతా నలుగురికి కూడా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి వైద్య నిపుణులను రప్పించి చికిత్స చేస్తున్నామని.. వారు వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. కేంద్రం నుంచి రాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే లక్ష దోమ తెరలు కొనుగోలు చేసి గిరిజనులకు అందజేస్తుందన్నారు. ఎక్కడికక్కడ ఫాగింగ్ చేపడుతున్నామని, ఏజెన్సీల్లో మలేరియా, డెంగీ నిర్దారణ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు లేవని.. పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. హైదరాబాద్‌లో కేవలం ఒక కలరా కేసే నమోదైందని, సామూహిక కలరా కేసులు ఎక్కడా నమోదు కాలేదన్నారు. -
‘కెమిస్ట్రీ’తోనే అధిక సమయం
- ఎక్కువ ప్రశ్నలు సమస్యాపూరకంగా రావడంతో రాయలేకపోయామన్న విద్యార్థులు - పరీక్షకు 90.76 శాతం హాజరు - ప్రాథమిక కీ విడుదల, 12 వరకు అభ్యంతరాల స్వీకరణ, 14న ర్యాంకులు సాక్షి, హైదరాబాద్ : కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే అధిక సమయం పట్టడంతో మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాయలేకపోయామని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు ఫిజిక్స్‌లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు రావడం, బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉండటం ఎక్కువ సమయం తీసుకున్నాయని అన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76% మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,964 మంది హాజరయ్యారు. 5,189 మంది గైర్హాజరయ్యారు. ఒక్క హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ప్రశ్నల విషయానికి వస్తే సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. కీని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) ఉంచింది. ఈ నెల 12 మధ్యాహ్నం 2 గంటల వరకు కీపై అభ్యంతరాలను (keyobjectionstseamcet2016@gmail.com) మెయిల్ ద్వారా స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈ నెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, డీఎంఈ డాక్టర్ రమణి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్ష శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఇక ఏపీ విద్యార్థుల కోసం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అధికారులు ముందు నుంచి సూచించినప్పటికీ పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని లోనికి అనుమతించకపోవటంతో గేటు వద్ద నుంచే వెనుదిరిగారు. కాగా ప్రాథకమిక కీని ఈరోజు సాయంత్రం, ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. కాగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సెట్ కోడ్ 'ఆర్'ను ఎంపిక చేశారు. -
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
-
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణలో శనివారం జరగనున్న ఎంసెట్-2 ప్రశ్నాపత్రం కోడ్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి రెడ్డి విడుదల చేశారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం పేపరు కోడ్‌గా ‘ఆర్’ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వాహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 63 కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వినర్ చెప్పడంతో.. బయోమెట్రిక్ కోసం విద్యార్థులను గంట ముందునుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
బీపీ చెకింగ్‌కు ప్రత్యేక ఏఎన్ఎంలు
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం - దీర్ఘకాలిక రోగాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ - నేడు ఖమ్మంలో కీమోథెరపి కేంద్రం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: మాతా శిశు సంరక్షణకు, అంటువ్యాధుల నుంచి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం గ్రామాల్లో ఏఎన్ఎంలు పనిచేస్తుండగా.. ఇకనుంచి మరో ఏఎన్ఎంను గ్రామాల్లోకి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అదనంగా నియమించే ప్రత్యేక ఏఎన్ఎంలు కేవలం బీపీ, షుగర్లను మాత్రమే చెక్ చేస్తారు. వారికి ఇతరత్రా బాధ్యతలు ఏవీ అప్పగించారు. ఎవరెవరికి బీపీ, షుగర్లు ఉన్నాయో రికార్డు చేసి ఆయా రోగులను అప్రమత్తం చేస్తారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వీరు పనిచేస్తారు. వారికి బీపీ, షుగర్ పరీక్షించేందుకు అవసరమైన పరికరాల కిట్‌ను అందజేస్తారు. వారు ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్తారు. నిత్యం ఏఎన్ఎంలు ఇదే పనిలో నిమగ్నమవుతారు. నిర్ధారణ.. నియంత్రణ.. నిర్మూలన దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించి వాటిని శస్త్రచికిత్సల ద్వారా నిర్మూలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నిమ్స్‌లో కిడ్నీ సెంటర్‌ను, లివర్ టవర్‌ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా ముందుగా ఖమ్మంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన కీమోథెరపి యూనిట్‌ను ప్రారంభిస్తారు. -
నిమ్స్‌లో గుండె, కాలేయ మార్పిడి టవర్స్
- నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి - రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాల కొనుగోలు - స్టెమ్‌సెల్ రీసెర్చ్ సెంటర్, అధునాతన డయాగ్నొస్టిక్స్ ల్యాబ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం మరో రెండు అధునాతన టవర్స్ నిర్మిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నిమ్స్‌లో అందుతున్న వైద్య సదుపాయాలు... రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఏఎంసీ, సూపర్‌స్పెషాలిటీ, ఎమర్జెన్సీ మిలీనియం బ్లాక్, పాత భవనం ఇలా అన్ని వార్డుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో దేశంలోనే తొలి స్టెమ్‌సెల్ థెరపీ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిలీనియం బ్లాక్‌లో అడ్వాన్స్డ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రూ.27 కోట్లతో వివిధ వైద్య పరికరాల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని, మరో రూ.36 కోట్ల విలువ చేసే వైద్య పరికరాల కొనుగోలుకు త్వ రలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలోనే ఇన్ పేషెంట్ సర్వీసులను కూడా అందజేస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి బీబీనగర్ నిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కేడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయని, ఇకపై లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైద్యసేవల్లో జరుగుతున్న జాప్యం, ఆస్పత్రిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది ఆరోగ్యశ్రీ రోగులు యత్నించగా సెక్యురిటీ సిబ్బంది వారిని నిలువరించారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు. -
‘పోలియో’పై పోరు
- కదలిన కేంద్రం, అంతర్జాతీయ యంత్రాంగం - హైదరాబాద్‌కు యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధుల రాక - వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే మకాం - పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్ - ఆ వైరస్ ప్రమాదకరం కాదు.. పోలియోను - విస్తరింపజేయదు: మంత్రి లక్ష్మారెడ్డి - ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు - చెన్నై నుంచి 3 లక్షల డోసుల మందు - ఈ నెల 20 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతాం: కేంద్రం - భారత్ పోలియో రహిత దేశంగానే కొనసాగుతుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ యంత్రాంగం అప్రమత్తమైంది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులు ఐదుగురు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు వారిక్కడే మకాం వేస్తారు. 2011 తర్వాత హైదరాబాద్‌లో పోలియో వైరస్ వెలుగుచూడడంతో జాతీయ, అంతర్జాతీయ చానళ్లు సైతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక ఇంట ర్వ్యూలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతినిధి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్రం కూడా ఆగమేఘాలపై కదిలింది. కేంద్ర ఇమ్యునైజేషన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హల్దార్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతో సమీక్ష జరిపారు. వైరస్ బయటపడిన మూడు వారాల్లోగా ఇమ్యునైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. చెన్నై నుంచి 3 లక్షల డోసుల ఇంజెక్షన్ మందు బుధవారం రాత్రికి చెన్నై నుంచి 3 లక్షల డోసుల పోలియో ఇంజెక్షన్ మందు హైదరాబాద్‌కు రానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నందున ఇంటింటికి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు. హైదరాబాద్‌లో నిర్దేశించిన ప్రాంతంలో 700 బూత్‌లు, రంగారెడ్డి జిల్లాలో 126 బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలున్న వారంతా ఆ బూత్‌ల వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తారు. పిల్లలకు ఇంజెక్షన్ మందు వేయడానికి రెండు వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. వారికి శిక్షణ మొదలు పెట్టారు. 500 మంది సిబ్బంది ని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. మొత్తం వ్యాక్సినేషన్‌ను ప్రజారోగ్య సంచాలకులు పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో ప్రైవేటులో ఎక్కడా లభ్యం కాదని, ప్రైవేటు ఔషధ కంపెనీల ద్వారా కేంద్రమే కొనుగోలు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో వైద్య సిబ్బంది పర్యటన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యటించారు. బస్తీల్లో ఇంటింటికి తిరిగి ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు ఉన్న చిన్నారులను గుర్తించే పనిలో పడ్డారు. అమీర్‌పేట్, శ్రీరాంనగర్, గోల్కొండ క్లస్టర్ల పరిధిలో వైరస్ ఉండే అవకాశం లేకపోవడంతో సర్వే నుంచి వాటిని మినహాయించారు. అంబర్‌పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట, కోఠి, లాలాపేట, డబీర్‌పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్మండి, సూరజ్‌భాను తదితర ప్రాంతాల్లో వైరస్ ఉండే అవకాశం ఉండటంతో వాటిని హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా వైద్యాధికారులు ఆయా బస్తీల్లో పర్యటించి మూడేళ్లలోపున్న చిన్నారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్లో ఐదేళ్లలోపు 9.6 లక్షల మంది చిన్నారులు ఉండగా, వీరిలో ఆరు మాసాల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు నాలుగున్నర లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 20 నుంచి హైదరాబాద్, రంగారెడ్డిల్లో వ్యాక్సిన్: కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్‌పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్ పోలియో రహిత దేశంగా కొనసాగుతుందని, గత ఐదేళ్లలో ఎక్కడా వైరస్ బయటపడలేదని బుధవారం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్.. వ్యాక్సిన్ కారణంగానే ఏర్పడిందేనని, చిన్నారులెవరూ దాని ప్రభావానికి గురికాలేదని వివరించింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 20 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 3 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 6 వారాల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులకు అదనంగా ఒక డోస్ ఇస్తామని తెలిపింది. దాదాపుగా 17 ఏళ్ల క్రితం 1999లో ప్రమాదకర పోలియో వైరస్‌ను చివరిసారిగా గుర్తించామని, వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్‌తో పోలియో రహిత స్థితిలో మార్పురాదని వివరించింది. వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్ జన్యుపరమైన మార్పునకు గురై ఉంటుందని పేర్కొంది. ప్రమాదమేమీ లేదు: లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్ చుక్కల మందు వ్యాక్సిన్ ద్వారా మనిషి శరీరంలోంచి బయటకు వచ్చిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. చుక్కల మందులో సజీవంగా వైరస్ ఉంటుందని, అది రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లల నుంచి బయటకు వచ్చి మురుగునీటిలో ప్రవేశించి ఉంటుందన్నారు. ఈ వైరస్‌కు పోలియోను కలిగించే శక్తి లేదని, ఏమాత్రం ఆందోళన చెందవద్దని సూచించారు. ముందు జాగ్రత్త కోసమే వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించామన్నారు. చుక్కల మందు కంటే ఇంజెక్షన్ ద్వారా వేసే ఇన్ యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ) సురక్షితమని చెప్పారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని, ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని వివరించారు. అందుకే చుక్కల మందుతోపాటు ఇంజెక్షన్లు ఇస్తున్నామన్నారు. గతంలో చుక్కల మందు వేసినందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 20 నుంచి 26 వరకు ఐపీవీ ఇంజెక్షన్ మాత్రమే ఇస్తామన్నారు. 2018 నుంచి కేవలం ఇంజెక్షన్ ద్వారానే పోలియో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. అప్పటివరకు చుక్కల మందుతోపాటు ఐపీవీ ఇంజెక్షన్ ఇస్తామని పేర్కొన్నారు. -
నీటిలోనే ఉందా.. ఎవరికైనా సోకిందా?
- రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూడటంపై ప్రజల ఆందోళన - 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సాక్షి, హైదరాబాద్: మహానగర డ్రైనేజీ నీటిలో బయటపడిన పోలియో వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ మురుగునీటిలోనే ఉండిపోయిందా... లేక అక్కడి నుంచి తాగునీటిలో కలసి పిల్లలెవరికైనా సోకిందా... అన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్నారు. పిల్లల్లో ఉంది కాబట్టే అది మలం ద్వారా డ్రైనేజీలోకి వెళ్లి ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులపాటు ప్రత్యేకంగా పోలియో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. నోటి ద్వారా వ్యాక్సినేషన్ వల్లేనా? అమెరికా వంటి దేశాల్లో పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. పోలియో వైరస్ ద్వారానే తయారైన వ్యాక్సిన్‌ను మన వద్ద ఎక్కువగా చుక్కల రూపంలో అందిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి వైరస్ రాకుండా నిరోధిస్తుంది. అయితే చుక్కల రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి వైరస్ బతికుండే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన పిల్లలు మలం విసర్జిస్తే డ్రైనేజీ ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలుంటాయంటున్నారు. అదే ఇంజెక్షన్ల ద్వారా ఇస్తే వైరస్ విస్తరించే అవకాశాలుండవంటున్నారు. ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాత్రం 2 రూపాల్లోనూ ఇచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలియో రహితంగా ఎలా ప్రకటించారు? నూటికి నూరు శాతం పోలియో రహిత దేశంగా 2014 మార్చి 27న భారత్‌ను ప్రకటించారు. పూర్తి స్థాయిలో నిర్మూలించకుండా ఇలా ప్రకటనలు చేయడం వల్ల పోలియో నిర్మూలనకు సంబంధించిన చర్యలు తగ్గాయన్న విమర్శలూ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఢిల్లీలో వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత బిహార్, గుజరాత్‌లోనూ ఇది కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలియో రహిత దేశంగా ఎలా చెప్పుకోగలం? వాస్తవానికి తెలంగాణలో పోలియో వ్యాక్సినేషన్‌తోపాటు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా కూడా వ్యాక్సిన్ వేశారు. అయినా వైరస్ వెలుగు చూసిందంటే నిర్లక్ష్యం ఎవరిది.. కారణం ఏమిటి.. అన్నదానిపై చర్చ జరుగుతోంది. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష.. పోలియో వైరస్ సోకిందన్న నిర్ధారణతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులతో చర్చించారు. అంబర్‌పేట, బార్కస్, కంటోన్మెంట్, డబీర్‌పురా, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట్, మలక్‌పేట్, నాంపల్లి, పానిపురా, సీతాఫల్మండి, సూరజ్భాన్ తదితర ప్రాంతాల్లో పోలియో వైరస్ ఉండే అవకాశముందని గుర్తించారు. ఈ 12 ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ఈ ప్రాంతాల్లో 2.82 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాల్సిన అవసరం ఉందని అధికారులు నిర్ధారించారు. అపోహలు వద్దు.. పోలియో వైరస్‌పై ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలూ అక్కర్లేదు. వైరస్ వల్ల ఇతరులకు సోకిందన్న అనుమానాలు అవసరం లేదు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
రాష్ట్రంలో కరువు నివారణకు చర్యలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: రాష్ట్రంలో శాశ్వత కరువునివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే పెండింగ్ప్రాజెక్టులు పూర్తిచేయడంతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జడ్చర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. కరువు మండలాలను ప్రకటించాక ఎలాంటి సహాయక చర్యలు తీసుకోలేదని సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు. కరువుపై కేంద్రానికి నివేదికలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుందని వివరించారు. తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల డిజైన్లను సక్రమంగా చేయకపోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరు పారాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు పారలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల అలా కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఏడాదిలో ఆరునెలల పాటు తీసుకునే వెసులుబాటు ఉందని, అందుకే ముందుగా రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. రిజర్వాయర్లు ఉంటే నీటిని నింపుకునే వీలుందని, లేదంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లాగే అవుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మిశంకర్, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్ని, వైస్ ఎంపీపీ రాములు, సింగిల్‌విండో చైర్మన్లు బాల్‌రెడ్డి, దశరథరెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచన - స్వయంగా సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం - బదిలీలు, డిప్యుటేషన్లకు నో - ఒకసారి నియమితులైతే రిటైరయ్యే వరకు అక్కడే విధులు - అవసరమైన సౌకర్యాలు, పరిపాలనా నిర్ణయాలు తీసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. పరిపాలన, విధానపరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడంతోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీనీ చేపట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనిని ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తిని అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ మంచి ఫలితాలు వ స్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బదిలీలు, బాదరబందీలు ఉండవు రాష్ట్రంలో మొత్తం 18 మెడికల్ కాలేజీలుండగా.. వాటన్నింటిలో కలిపి 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా స్వయం ప్రతిపత్తి విధానాన్ని అమలు చేస్తారు. అక్కడ విజయవంతమైతే మిగతా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అమల్లోకి తెస్తారు. మరోవైపు ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది కొంతకాలానికే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడమో, డిప్యుటేషన్లపై వెళ్లడమో చేస్తున్నారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇది వైద్య విద్యార్థులకు, బోధనాసుపత్రులకు వస్తున్న రోగులకు శాపంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే స్వయం ప్రతిపత్తి విధానం వైపు సర్కారు మొగ్గుతోంది. ఇది అమల్లోకి వస్తే ఆయా మెడికల్ కాలేజీల్లో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా.. రిటైరయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే ఉద్యోగంలో చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది దాదాపు 400 మందికిపైగా ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తారు. ఆ కాలేజీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే వారంతా రిటైరయ్యే వరకూ అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిమ్స్‌లో ఇటువంటి విధానమే అమలవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసి వీలైనంత త్వరలో జీవో జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. పాలమూరు కాలేజీలో ప్రయోగాత్మకంగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్ణాటకలో అలాంటి విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా రాబోయే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో దానిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్
జూలై 9న ప్రవేశ పరీక్ష - ఆ తర్వాత వారంలో ఫలితాలు.. ఆగస్టు 1 నుంచి తరగతులు - నీట్‌పై ఆర్డినెన్స్‌తో ప్రవేశాలపై తొలగిన సందిగ్ధం - ప్రభుత్వ, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఎంసెట్ ద్వారానే - ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు నీట్ ద్వారా భర్తీ - ప్రైవేటు వైద్య సీట్లకు జూలై 24న నీట్-2 సాక్షి, హైదరాబాద్: నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం మెడికల్ ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 9న మెడికల్ ఎంసెట్-2 నిర్వహిస్తారు. అదే రోజు కీ విడుదల చేస్తారు. వారానికి ఫలితాలు విడుదల చేస్తారు. నీట్-2 ప్రవేశ పరీక్ష జూలై 24న నిర్వహించనున్నారు. ఇక నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లతోపాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్-2 ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ(35 శాతం), 15 శాతం ఎన్నారై కోటా సీట్లను మాత్రం ‘నీట్’ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 1,025 ప్రైవేటు సీట్లకు నీట్ తెలంగాణలో మొత్తం 18 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నా యి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో(కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి సీట్లున్నా యి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను, 10 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం(725) సీట్లను ప్రభుత్వం నిర్వహించే మెడికల్ ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 1,725 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35శాతం(507) బీ కేటగిరీ సీట్లను, మరో 15శాతం(218) సీట్లను ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. అలాగే మైనారిటీ కాలేజీల్లోని 300 సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. మొత్తం 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక డెంటల్‌లో ప్రభుత్వ కాలేజీ ఒకటి ఉండగా అందులో 100 సీట్లున్నాయి. ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా... వాటిలో 1,040 సీట్లున్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ఆధారంగా.. మేనేజ్మెంట్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలపై పిడుగు కేంద్ర ఆర్డినెన్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పిడుగులాంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే బీ కేట గిరీ, ఎన్నారై మెడికల్ సీట్ల భర్తీ జరిగితే కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడినట్లేనంటున్నారు. అయితే నీట్ ర్యాంకులను ప్రకటిం చాక.. అడ్మిషన్లు ఎవరు నిర్వహిస్తారన్న దానిపైనే ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు పడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు. ర్యాంకులు ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది. ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ఎంసెట్ నిర్వహించాలనడం సమంజసం. ఎందుకంటే ఆ సీట్లకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాస్తారు. బయటి రాష్ట్రాల వారు రాయరు. ప్రైవేటులోని బీ కేటగిరీ సీట్లకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఎన్నారై సీట్లను వారిష్టం వచ్చినట్లు భర్తీ చేసుకునేవారు. కాబట్టి నీట్ పరిధిలోనే వాటిని భర్తీ చేయాలనడం సమంజసంగా ఉంది. నీట్ వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుతుంది. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రైవేటు సీట్లలోనూ ప్రవేశాలకు అవకాశం దక్కుతుంది. - కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ -
ఈ ఏడాది మినహాయించండి
♦ ‘నీట్’పై మరోసారి కేంద్రానికి రాష్ట్రం విన్నపం ♦ కనీసం రెండేళ్ల సమయం కావాలన్న ఆంధ్రప్రదేశ్ ♦ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేంద్రం సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నీట్ కథ రోజుకో మలుపు తిరుగుతోంది! ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరే విద్యార్థులను మరింత గందరగోళ పరిచేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ‘నీట్’ ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా.. అనేక రాష్ట్రాలు తమ అభ్యంతరాలను తెలియజేస్తూనే ఉన్నాయి. సుప్రీం తీర్పును గౌరవిస్తామని, అయితే ఈసారికి మినహాయింపు ఇస్తే వచ్చే ఏడాది నుంచి నీట్‌కు సిద్ధమవుతామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరయ్యారు. నీట్ నుంచి ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని ఆయన ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరోసారి విన్నవించింది. ఒకవేళ నీట్ తప్పనిసరైతే తెలుగులో ప్రశ్నపత్రం ఉండాలని కోరింది. నీట్ నుంచి తమకు కనీసం రెండేళ్ల మినహాయింపు కావాలని ఈ సమావేశానికి హాజరైన ఏపీ ఆరో గ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా కేంద్రాన్ని కోరారు. దాదాపు 20కిపైగా రాష్ట్రాలు ఈ ఏడాది మినహాయింపు కోరినట్లు ఆయన వివరించారు. ఇలా పలు రాష్ట్రాలు విన్నవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలు, ఆందోళనలపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. కేంద్రం మళ్లీ సుప్రీంను ఆశ్రయిస్తే న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందోనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు ‘నీట్’ ద్వారా జరుగుతాయా? లేక ఎంసెట్ ద్వారా జరుగుతాయా? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. ఎంసెట్-2 తప్పదా..? కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాలను, ఎంపీల మొరను పరిశీలిస్తోంది. నీట్‌పై జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు రాష్ట్రాల అభ్యంతరాలను పునరాలోచిస్తే సరేసరి! అలా కాకుండా మళ్లీ పాత తీర్పునే పునరుద్ఘాటిస్తే కేంద్రం ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా ఆర్డినెన్స్‌ను తీసుకొస్తుందన్న చర్చ జరుగుతోంది. అలా ఆర్డినెన్స్ తీసుకొస్తే నీట్ నుంచి ఈ ఏడాదికి మినహాయింపు వచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు. అలాగైతే తెలంగాణలో ఎంసెట్ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష రెండ్రోజుల క్రితమే జరిగింది. దీన్ని కేవలం ఆయుష్ వైద్య సీట్లకు, వ్యవసాయ కోర్సులకు మాత్రమే నిర్వహించారు. ఈ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేస్తూ ప్రకటన కూడా జారీచేసింది. కాబట్టి ఎంబీబీఎస్, బీడీఎస్‌ల కోసం మరోసారి ఎంసెట్ నిర్వహించే అవకాశాలుంటాయని వైద్య ఆరోగ్య శాఖ అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మెడికల్ ఎంసెట్-2 రాయక తప్పదన్న చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన మెడికల్ ఎంసెట్‌ను 89,792 మంది రాశారు. ఈ సంఖ్య గతేడాది కన్నా ఎక్కు వ. నీట్‌పై ఇంకా గందరగోళమే నెలకొని ఉండడం వల్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో మెడికల్ ఎంసెట్‌కు హాజరయ్యారంటున్నారు. వాస్తవానికి ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో అడ్మిషన్లకు అంతమంది రాసే అవకాశమే లేదంటున్నారు. ఒకవేళ ఈసారి నీట్ నుంచి మినహాయింపు ఇస్తే మరోసారి ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష తప్పదని వైద్య, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మినహాయింపు కోరాం ఈసారికి నీట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నారు. నీట్లో తెలుగు ప్రశ్నపత్రం అంశాన్ని లేవనెత్తారు. కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించాక న్యాయస్థానం మినహాయింపు ఇస్తే ఎంసెట్-2 తప్పకపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడే ఈ విషయంపై మాట్లాడటం సమంజసం కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
‘పార్టీ కార్యక్రమమా.. అధికారిక కార్యక్రమమా’
మంత్రిని ప్రశ్నించిన ఎమ్మెల్యే దొంతి నర్సంపేట : వైద్య ఆరోగ్యశాఖ వుంత్రి లక్ష్మారెడ్డి నర్సంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన సవూవేశంలో దొంతి, పెద్ది అనుచరుల నినాదాల హోరుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వుంత్రి సాయుంత్రం 4.30 గంటలకు సివిల్ ఆస్పత్రికి చేరుకొని రోగులతో వూట్లాడి యోగ క్షేవూలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఎదుట జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలోని వసతుల లేమి గురించి వుంత్రికి వివరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు మొదలయ్యూరుు. దీంతో ఇద్దరు నాయకులు కార్యకర్తలను సముదారుుంచారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి స్పందిస్తూ ‘ఇది పార్టీ కార్యక్రవువూ...అధికారిక కార్యక్రవువూ’ అంటూ వుంత్రి లక్ష్మారెడ్డిని పశ్నించారు. పార్టీ కార్యక్రవుమే అరుుతే వుంత్రిగా వచ్చిన మివ్ముల్ని ఎక్కడ, ఎప్పుడు కలవాలో చెప్పాలన్నారు. వెంటనే వుంత్రి జోక్యం చేసుకొని సమీక్ష సవూవేశం వద్దకు వెళ్లండి వస్తున్నా అంటూ బదులిచ్చారు. అనంతరం వుంత్రి ప్రసంగించకుండా వెళ్లిపోయూరు. గతంలోనూ ఎంపీ సీతారాంనాయుక్ పాల్గొన్న కార్యక్రవూల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయుకులవుధ్య వాగ్వాదం చోటుచేసుకున్నసంగతి విదితమే. -
108 ఉద్యోగుల వేతనాల పెంపు
♦ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్య మంత్రికి సీఎం ఆదేశం ♦ త్వరలోనే ఉద్యోగులు, అధికారులతో చర్చలు సాక్షి, హైదరాబాద్: ‘108’ ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని... ఉద్యోగులు, అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లను, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే 104 వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా పోలీస్, వైద్యశాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వైద్య శాఖపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇటీవల సీఎంతో ముఖాముఖిలో వరంగల్ జిల్లాకు చెందిన 108 ఉద్యోగి రమేశ్ ప్రస్తావించిన అంశాలపై చర్చించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ సేవల మెరుగుదలకు, విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి లక్ష జనాభాకు ఒక 108 చొప్పున 312 వాహనాలుండేవన్నారు. తాము 75 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 ఉండాలని నిర్ణయించామని, ఫలితంగా 169 అంబులెన్స్‌లు పెరిగాయని చెప్పారు. వీటిలో 145 వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, మిగతావి కొద్ది రోజుల్లోనే సేవలందిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఇక ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలతో అపార ప్రాణనష్టం జరుగుతోందని... దీన్ని నివారించడానికి పోలీసులు, వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని, కావాల్సిన వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రహదారుల వెంట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లుఉండాలని, ట్రామా సెంటర్లు ఆన్లైన్ హెల్త్‌కేర్ సేవలను ఉపయోగించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామీణ డాక్టర్లకు నగదు ప్రోత్సాహకం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని, అదే సమయంలో డాక్టర్లు కచ్చితంగా సమయ పాలన పాటించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. నాలుగు పెద్దాసుపత్రులకు స్థలాన్వేషణ హైదరాబాద్‌లో 4 పెద్దాసుపత్రులు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాల గుర్తింపు జరగాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే గుర్తించిన కొన్ని స్థలాల వివరాలను సీఎంకు మంత్రి లక్ష్మారెడ్డి అందజేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి చర్చించి అనువైన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని వాటి ఫలితం పేదలకు అందేలా పనిచేయాలని సూచించారు. -
‘ఆరోగ్యశ్రీ’ యాప్‌తో అరచేతిలో వైద్య సేవలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్టు రూపొందించిన యాప్‌తో వైద్య సేవలు అరచేతిలో ఉన్న మొబైల్‌లోకి వచ్చి చేరుతాయని వెద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ‘ఆరోగ్యశ్రీ’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా వైద్య సేవలను సరళతరం చేస్తామన్నారు. ఇలాంటి యాప్‌ను తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా 77.19 లక్షల మంది పేద కుటుంబాలు, 11.45 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులు, 23 వేల మంది వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులు ప్రయోజనం పొందుతారని ఆయన వెల్లడించారు. ఈ యాప్ ద్వారా సమీపంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల వివరాలు జీపీఎస్ ద్వారా ప్రత్యక్షమవుతాయన్నారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలు, గుండెపోట్లు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. రోగి నుంచి ఆసుపత్రి వారు డబ్బులు వసూలు చేసినా... సరిగా వైద్యం అందించకపోయినా, వైద్యం నిరాకరించినా దీనిద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. గురువారం నుంచే గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో డాక్టర్ ఎం.చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యసేవలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆస్పత్రులకు కావలసిన వసతులు కల్పించామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 వేల డాక్టర్, సిబ్బంది పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్‌ను లక్ష్మారెడ్డి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగి మం దులు, పరీక్షలకు బయటకు వెళ్లకుండా అన్నీ ఆస్పత్రుల్లోనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ తయారీకి ముందుగానే సీఎం కేసీఆర్ ఆస్పత్రులను బలోపేతం చేయడానికి కావలసిన నిధుల గురించి అడిగి తెలుసుకుని వైద్య వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు 20 మంజూరు చేశామని, మరో 20 సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారుల వెంట ఉన్న పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
మృతులను స్వగ్రామాలకు తరలిస్తాం
సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదలు ఏదైనా కారణం వల్ల చనిపోతే మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం వారికి ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఈ ఉచిత సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల నుంచి కూడా గ్రామాలకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచి చనిపోయిన వారిని ప్రభుత్వ ఖర్చుతోనే స్వగ్రామాలకు తరలిస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. తమిళనాడులో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బృందం ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. -
పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం
కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ విభాగం ప్రారంభం త్వరలో ఇన్ పేషంట్ విభాగాన్ని ప్రారంభిస్తామని వెల్లడి బీబీనగర్: రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీలో ఆదివారం ఔట్ పేషంట్ (ఓపీ) విభాగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఔట్ పేషెంట్ విభాగంలో అన్ని రకాల ప్రాథమిక వైద్యం అందిస్తామని, అవసరమైన రోగులను అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేయనున్నట్లు తెలిపారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి పేర్కొన్నారు. బీబీనగర్ నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించి హైదరాబాద్ నిమ్స్ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీ రెడ్డి పాల్గొన్నారు. -
దశలవారీగా 'నిమ్స్' అభివృద్ధి
బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు ప్రకటన భువనగిరి (నల్లగొండ జిల్లా) : నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి నిమ్స్ ఓపీ సేవల ప్రారంభోత్సవంలో ప్రకటించారు. ఆదివారం ఉదయం బీబీనగర్‌లోని 'నిమ్స్' ఓపీ సేవలను ప్రారంభించిన అనంతరం వారు మట్లాడుతూ ఆసుపత్రిని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు. -
ఇక ‘108’ ద్విచక్ర వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో ‘108’ అత్యవసర అంబులెన్సులు సకాలంలో బాధితుల వద్దకు చేరుకోవడం లేదు. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా వెళ్లే అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్దకు వెళ్లింది. అనంతరం సీఎం సంతకం చేశాక ఇవి రోడ్లపైకి వస్తాయి. ముందుగా హైదరాబాద్ నగరంలో 50 వాహనాలను ప్రవేశపెట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. 50 వాహనాలకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి రూ.70 లక్షలు కేటాయించారు. ప్రాథమిక చికిత్సే లక్ష్యం... తమిళనాడులో ప్రస్తుతం ఇలాంటి ‘108’ ద్విచక్ర వాహనాలు వైద్య సేవలు అందిస్తున్నా యి. ఆ రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని పరిశీలించారు. అంతకుముందే ఈ ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... తమిళనాడులో పరిశీలించాక ఆగమేఘాల మీద అందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు పంపింది. ప్రమాదం లేదా ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించేలా ద్విచక్ర వాహనంలో వైద్య పరికరాలు, మందులతో కిట్టు ఉంటుంది. ప్రాథమిక వైద్య చికిత్స తెలిసిన వ్యక్తే నడుపుతాడు. వాహనానికి నేవిగేటర్ సౌకర్యం కల్పిస్తారు. దాని ఆధారంగా బాధితుడు ఉన్న చోటుకు చేరేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుత ‘108’ అంబులెన్స్ సగటున 20 నిముషాల్లో చేరితే అదే ప్రాంతానికి ద్విచక్ర వాహనం 10 నిముషాల్లోపే వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి. -
ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్ కంపెనీ
♦ రూ.5 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ సుముఖం ♦ సీఎం కేసీఆర్‌తో కంపెనీ భారతీయ ప్రతినిధుల భేటీ ♦ శ్రీలంకలో కంపెనీ నిర్మించిన ఆసుపత్రులను పరిశీలించనున్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మొత్తాన్ని రుణంగా అందజేయనుంది. ఈ మేరకు ఆ దేశ ఎన్రాఫ్-నోనియస్ కంపెనీకి చెందిన భార తదేశ అధిపతి సునీల్ అగర్వాల్, లైసన్ డెరైక్టర్ హిలాల్ రాదర్, నిర్మాణ డెరైక్టర్ సురేష్‌గుప్తా తదితరులు మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రుల డిజైన్, నిర్మాణం, నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. ఆసుపత్రుల నిర్మాణానికి నెదర్లాండ్ కంపెనీ ముందుకు రావడం పట్ల సీఎం సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో 5 వేలకుపైగా పడకలతో ఆసుపత్రులను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. కాలవ్యవధిని, రుణానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేయాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీలంక, దుబాయ్‌ల్లో ఇలాంటివి నిర్మించామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ వారంలో శ్రీలంకలో పర్యటించి ఎన్రాఫ్-నోనియస్ నిర్మించిన ఆసుపత్రులను, వసతులను అధ్యయనం చేసి రావాల్సిందిగా మంత్రి లక్ష్మారెడ్డిని, ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డయాగ్నస్టిక్ విభాగాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆ కంపెనీ నిర్మించిందని సీఎం కార్యాలయం పేర్కొంది. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అధికారులు రాజేశ్వర్ తివారీ, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో సిబ్బంది పనితీరు, తదితర సమస్యలను పరిశీలించేందుకు వీలుగా ఈ వెబ్ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మొబైల్ ఫోన్ ద్వారా వెబ్ కెమెరాలను లింక్‌చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగాన్ని పరిశీలించారు. వెబ్ కెమెరాలతో సిబ్బంది పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీంతో రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
‘ఐసీయూ’ సెటప్‌పై మంత్రి సీరియస్
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ)ను తాత్కాలిక పద్ధతిలో నెలకొల్పి అభాసుపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజున మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో తాత్కాలికంగా ఐసీయూ ఏర్పాటు చేసి వెంటనే ఎత్తేయడంపై దుమారం రేగడం, ‘ఐసీయూ సెటప్.. అంతా బిల్డప్’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో మంత్రి చర్యలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐసీయూ ఏర్పాట్లు చేశాం. వాటిని నిర్వహించాల్సిన బాధ్యత ఆసుపత్రి అధికారులది. సమాచార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అధికారుల వైఫల్యం ఉంది. ఇక నుంచి అలా జరగదు..’’ అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుం టాం’’ అని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన ఐసీయూ యూనిట్ ఏర్పాటు చే శామన్నారు. ఐసీయూల నిర్వహణపై హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశం ఐసీయూ ఒక్కో యూనిట్ కోసం రూ. కోటి వరకు ఖర్చు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి టెండర్లూ పిలిచా రు. టెండర్లు ఖరారు కాకున్నా అధికారులు మాత్రం హడావుడి తంతుకు తెరలేపారు. ఈ విషయాలేవీ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి రాలేదని తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అవి డెమో ఐసీయూ పరికరాలు కావడంతో కంపెనీ వాళ్లు ప్రారంభం అయిన వెంటనే తీసుకొని వెళ్లారు. ఇందులో టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారుల పాత్రపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఈ నెల 25న సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో ఐసీయూలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది. -
వైద్య ఆరోగ్యశాఖకు రూ.7 వేల కోట్లు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రూ.7 వేల కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ విభాగాల అధిపతులతో మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పలు విడతలుగా సమీక్ష సమావేశాలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతిపాదనలను అంచనా వేసి రూ.7 వేల కోట్లు ఉండాలని నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. 2015-16 బడ్జెట్లో (ప్రణాళిక వ్యయం రూ.2,500 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.2,400 కోట్లు) మొత్తం రూ.4,900 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 2016-17 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ.4 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.3 వేల కోట్లుగా నిర్థారించారు. ప్రణాళిక బడ్జెట్లో అత్యధికంగా వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాల, ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనాల ఏర్పాటు, కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో భారీగా కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఆరోగ్యశ్రీకి కేటాయించే నిధులను కూడా డీఎంఈ పరిధి పద్దులోనే ఉంచారు. తర్వాత అధికంగా నిమ్స్‌కు రూ.400 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.200 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. కాగా, ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులను నేరుగా విడుదల చేయడంలేదు. డీఎంఈ కార్యాలయం ద్వారా ఆసుపత్రుల బిల్లులను పరిశీలించి ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పంపిస్తున్నారు. దీంతో నెలలుగా బిల్లుల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. దీనివల్ల ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి వచ్చే పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు గగనంగా మారాయి. ఈసారీ అదే తరహాలో నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వెయ్యి కోట్లతో ఐయూఐహెచ్ ఆస్పత్రి
♦ హైదరాబాద్‌లో వెయ్యి పడకలతో స్థాపనకు ముందుకు.. ♦ ఇండో-యూకే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ♦ మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి సమక్షంలో ఎంవోయూ ♦ హైదరాబాద్‌లో మరో రెండు మెగా ప్రభుత్వ ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తరహాలో హైదరాబాద్‌లో మరో రెండు మెగా ఆసుపత్రులను ప్రభుత్వపరంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పెరిగిన హైదరాబాద్ నగర జనాభాకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఐయూఐహెచ్ ప్రతినిధులతో కలసి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వెయ్యి పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, పరిశోధన సంస్థ తదితరాల స్థాపనకు ముందుకు వచ్చిన ఐయూఐహెచ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఐయూఐహెచ్ పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆసుపత్రి స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ నిర్ణీత గడువులోగా ఇస్తామని... హైదరాబాద్‌ను మెడికల్ హబ్‌గా మార్చేందుకు ప్రస్తుత పెట్టుబడులు దోహదం చేస్తాయని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణలో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపడాన్ని ఐయూఐహెచ్ చైర్మన్ మైక్ పార్కర్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ రమణి, ఐయూఐహెచ్ తరఫున సంస్థ ఎండీ, సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా ఎంవోయూపై సంతకాలు చేశారు. సమావేశంలో ఐయూఐహెచ్ ప్రతినిధులు జేన్ గ్రేడీ, మైక్, అమన్, వినయ్ సింఘాల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఉప కార్యదర్శి వి.సైదా, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒప్పందంలోని ప్రత్యేకతలు.. గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సమక్షంలో భారత్‌లో పెట్టుబడులకు ఐయూఐహెచ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో సుమారు బిలియన్ డాలర్ల పెట్టుబడులతో... 11 వేల పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రులతోపాటు 25 వేల మంది నర్సులు, ఐదు వేల మంది వైద్యులకు ఉపాధి, 20 నుంచి 30 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. అందులో భాగంగా చండీగఢ్‌లో కింగ్స్ కాలేజీ ఆసుపత్రి స్థాపనకు ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు, ఇండో-యూకే హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఆస్పత్రి ఏర్పాటుకు ఐయూఐహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం... రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన వెయ్యి పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, పరిశోధన కేంద్రం తదితరాలు ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో మరిన్ని యూకే సంస్థలు భారత్‌లో వైద్య, ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఐయూఐహెచ్ ప్రతినిధులు వెల్లడించారు. -
ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
ఆరోగ్య వర్సిటీలో 80 పోస్టులు
భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. సీఎం ఆమోదానికి వెళ్లిన ఫైలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 80 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజిస్ట్రార్, వైస్చాన్స్లర్లను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిగేలా పరిపాలనా సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పోస్టులకు అంగీకారం తెలిపారు. అయితే సంబంధిత ఫైలుపై సంతకం కోసం వైద్య ఆరోగ్యశాఖ సీఎం వద్దకు పంపినట్లు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కాళోజీ వర్సిటీ పనిచేయాల్సి ఉన్నందున భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరలో చేపట్టాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీ విశ్వవిద్యాలయానికే అప్పగిస్తారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేస్తారు. కార్యనిర్వాహక మండలి నియామకం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి(ఈసీ)కి సభ్యులను నామినేట్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.శ్రీనాథ్‌రెడ్డి, నిమ్స్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ డి.రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్య మాజీ సంచాలకుడు పుట్టా శ్రీనివాస్, అన స్థీషియా ప్రొఫెసర్ మంతా శ్రీనివాస్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ ప్రొఫెసర్ కె.ఇందిర, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆప్తమాలజీ ప్రొఫెసర్ జె.పాండురంగ, కరీంనగర్ పిమ్స్ రేడియాలజీ ప్రొఫెసర్ బి.రమేశ్‌లను నామినేట్ చేశారు. వీరు మూడేళ్లపాటు ఈసీ సభ్యులుగా కొనసాగుతారు. -
స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ఏర్పాట్లు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలరావు ఇతర అధికారులతో కలిసి బుధవారం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, డిజాస్టర్, మెడికల్ తదితర వార్డులను మంత్రి సందర్శించారు. స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న సేవలు, ప్రాథమిక సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి జ్వరాలను అదుపు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతనెలలో 130 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు జరపగా 13 మందికే పాజిటివ్ వచ్చిందని, ఈ నెలలో 221 మందిలో 35 మందికి పాజిటివ్ వచ్చిందని, మూడు మరణాలు సంభవించాయన్నారు. వారి మృతికి, స్వైన్‌ఫ్లూతో పాటు ఇతర వ్యాధులు కూడా కారణమన్నారు. స్వైన్‌ఫ్లూ ఒక్కటే వస్తే వందశాతం రికవరీ అవుతుందనీ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నారాయణగూడ ఐపీఎంతోపాటు ఫీవర్ ఆస్పత్రిలో కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రోగులంటే ఇంత చులకనా... గాంధీ ఆస్పత్రిలో రోగులంటే వైద్యులు, సిబ్బంది చాలా చులకనగా చూస్తూ ఈసడించుకుంటున్నారని పలువురు రోగులు మంత్రి లక్ష్మారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. కల్వకుర్తి పోల్కంపల్లికి చెందిన వి. దయాకర్ అనే రోగి తీరుపట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరును అతని బంధువులు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రి ఆర్ఐసీయును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
'సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు'
నల్లగొండ రూరల్ : నిరవధిక సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు జరుపుతామని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.10 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తుండడంతో మంత్రి ఈ విధంగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడకండా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. -
గత పాలకుల వల్లే తాగు, సాగునీటి ఇబ్బందులు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బాలానగర్ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతకాలం తెలంగాణలో సాగు, తాగునీటికిఇబ్బందులు పడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గత పాలకుల అరవై ఏళ్ల పాపాలను ఐదేళ్లలో కడిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆయన చెప్పారు. శుక్రవారం మోతిఘనాపూర్లో నిర్మించిన గ్రామ సచివాలయంతోపాటు గంగధర్పల్లిలో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును, అమ్మపల్లిలో అంగన్వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగధర్పల్లిలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవని మహిళలు మంత్రికి విన్నవించుకున్నారు. దానికి స్పందించిన మంత్రి సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి వెంటనే రూ. 5 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులు తొందరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మోతిఘనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా తోడ్పాటునందించాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని, అది పూర్తయితే లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
కాలుష్యం వెదజల్లితే చర్యలు
కొత్తూరు : రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తామని అదే సమయంలో కాలుష్యాన్ని వెద జల్లి ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రాష్ట్రంలో మూతపడినవాటితో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన మంగ ళవారం మండలంలోని పలు పరిశ్రమలను సందర్శించారు. ఆయన వెంట మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. కొత్తరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో త్వరలో జిల్లాలో పలు బహుళజాతి పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు షాద్‌నగర్ పట్టణంలో పలు శిక్షణకేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలో వేల ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. త్వరలో జిల్లాకు సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఓ పెద్దసంస్థ కృషిచేస్తుంద న్నారు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ కాలుష్యంపై ఆగ్రహం మండలంలోని నర్సప్పగూడ గ్రామంలో కొనసాగుతున్న శ్యాంబాబా ఫెర్రోఅల్లాయిస్ ఐరన్ పరిశ్రమను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ పరికరాలు ఉన్నప్పటికీ కరెంట్ బిల్లులు తగ్గించాలనే ఉద్ధేశంతో వాటిని వినియోగించడం లేదని తెలుసుకున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్ర మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. టెక్సైటైల్ పార్కు సబ్సిడీని రికవరీ చేయాలి చేగూరు శివారులో హైటెక్స్ టెక్స్టైల్ పార్కు పేరుతో కొందరు గతంలో సుమారు 121ఎకరాలు తీసుకుని పూర్తిచేయలేదని.. నిర్వాహకులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రూపంలో తీసుకున్న రూ.13కోట్లను తక్షణమే రికవరీచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం సిద్ధాపూర్ శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదే వి, ఎస్పీ విశ్వప్రసాద్, జేసీ రాంకిషన్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ నేత వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు ఉన్నారు. స్థానికులను నియమించుకోవాలి జడ్చర్ల: జిల్లాను పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయరంగం, ఇతర రంగా ల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం వారు మండలంలోని పోలేపల్లి సెజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హెటెరో ఫార్మా పరిశ్రమలో విలేకరులతో మాట్లాడారు. సెజ్, తదితర పరిశ్రమల్లో దాదాపు 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పోస్టులకు స్థానికంగా అభ్యర్థులు లేని సమయంలో ఇతర ప్రాంతానికి చెందిన వారిని నియమించుకున్నా ఫర వాలేదని, అన్‌స్కిల్డ్, తదితర పోస్టులకు స్థానికులకే అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు సూచించామని చెప్పారు. భవిష్యత్‌లో ఫార్మా, బయోటెక్నాలజీ, డిఫెన్స్, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, సెల్‌ఫోన్ తదితర అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. నిరుద్యోగుల్లో స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు శిక్షణ ఇచ్చేందుకుగాను పాలమూరు యూనివర్సిటీలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్, ఐకే వంటి పరిశ్రమలకు సంబంధించి కూడా గ్రామస్థాయిలో ఉపాది అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తామన్నారు. -
ఆర్ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్‌కు తక్కువ
మంత్రి లక్ష్మారెడ్డి చదువుపై రేవంత్ వ్యాఖ్య కొడంగల్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చదువు ఆర్ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్‌కు తక్కువ అని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కొడంగల్‌లోని ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మారెడ్డి బీహెచ్ఎంఎస్ ధ్రువీకరణపై అనుమానాలు ఉన్నాయన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తి ప్రజలను మోసం చేయడం కష్టం కాదన్నారు. లక్ష్మారెడ్డి చదువు మున్నాభాయి ఎంబీబీఎస్ లాంటిది కాదా? అని ప్రశ్నించారు. గుల్బర్గాలో ఉన్న హెచ్ఎంసీహెచ్కు కర్ణాటక ప్రభుత్వం 1987లో అనుమతి ఇచ్చిందని, అయితే మంత్రిఎన్నికల అఫిడవిట్లో 1987లో బీహెచ్ఎంఎస్ డిగ్రీ పాసైనట్లు పేర్కొన్నారని చె ప్పారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి
మంత్రి డాక్టర్ సి.ల క్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : ‘నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి. నాపై వచ్చిన ఆరోపణలు రుజువైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా. నాపై విమర్శలు చేసిన వారు సవాలు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. తన విద్యార్హతలపై ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనంపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలోని పార్టీ శాసన సభాపక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన విద్యార్హతలపై ప్రజలకు అపోహ కలిగేలా ఆరోపణలు చేసిన నేతతో పాటు, సదరు పత్రికపై న్యాయపరమైన చర్యలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. తన విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను మీడియా సమావేశంలో చూపుతూ, తను చదివిన విద్యాలయంలో విచారణ జరుపుకోవచ్చన్నారు. -
బిందెలతో మంత్రి లక్ష్మారెడ్డి ఇల్లు ముట్టడి
జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) : తాగు నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక తాలుకా క్లబ్, విద్యానగర్, మసీద్ ఏరియా ప్రాంతాలకు సంబంధించి గత కొంత కాలంగా తాగు నీటి ఏర్పాట్లు లేవని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న పైపు లైను పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని, అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయని, తమ సమస్యను పరిష్కరించడంలో మంత్రి లక్ష్మారెడ్డి నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మంత్రి సతీమణి తమ దగ్గరకు వచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అనంతరం తమ సమస్యను పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుండి కదలబోమని స్పష్టం చేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, సంగిల్ విండో మాజీ చైర్మన్ పిట్టల మురళి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి మూడు రోజులలో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని, ఇంటింటికి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ జంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు.సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు. -
పెద్ద ఘాట్లలో వైద్య శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వైద్య సౌకర్యాలు కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారమిక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదారు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 106 పుష్కర ఘాట్లు ఉండగా, అందులో 17 ఘాట్లు పెద్దవని చెప్పారు. పెద్ద ఘాట్ల వద్ద 24 గంటలూ వైద్య శిబిరాలు పనిచేస్తాయన్నారు. ఆయా శిబిరాల వద్ద స్పెషలాఫీసర్, ముగ్గురు చొప్పున మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, అటెండర్లు పనిచేస్తారని వివరించారు. చిన్న ఘాట్లను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానం చేస్తామన్నారు. 104, 108 వాహనాలు, మందులు, పరికరాలను శిబిరాల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదు జిల్లాల్లో పుష్కరాల వద్ద వైద్య సేవలను పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లాకు రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమిస్తామని, ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు పర్యవేక్షిస్తారని చెప్పారు. నీటి కాలుష్యం వల్ల డయేరియా వంటివి వస్తాయని, తొక్కిసలాట, నీళ్లలో మునిగిపోవడం, గుండెపోటు వంటి ఘటనలు సంభవించే అవకాశాలు ఉంటాయని... వీటి బారినపడే వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లనూ అప్రమత్తం చేస్తామని తెలిపారు. 17 పెద్ద పుష్కర ఘాట్లు ఇవే... బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కందకుర్తి, సోన్గూడెం, మంచిర్యాల, చెన్నూరు, మల్లూరు, మంగపేట, రాగన్నగూడెం, ముల్లకట్ట, పర్ణశాల, పోచంపాడు, తడపాగులు, కోటి లింగాల, మంథని. వైద్య ఏర్పాట్లపై ప్రణాళిక * తాత్కాలిక బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద వైద్య శిబిరాలు * డీఎంహెచ్‌వో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే జిల్లాస్థాయి పర్యవేక్షణ సెల్ * హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కార్యాలయం నుంచి 24 గంటలూ పనిచేసే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్ * వెద్య సేవల కోసం రూ. 2.37 కోట్ల కేటాయింపు. అందులో మందుల కోసం రూ. 1.22 కోట్లు.