
‘పార్టీ కార్యక్రమమా.. అధికారిక కార్యక్రమమా’
మంత్రిని ప్రశ్నించిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట : వైద్య ఆరోగ్యశాఖ వుంత్రి లక్ష్మారెడ్డి నర్సంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన సవూవేశంలో దొంతి, పెద్ది అనుచరుల నినాదాల హోరుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వుంత్రి సాయుంత్రం 4.30 గంటలకు సివిల్ ఆస్పత్రికి చేరుకొని రోగులతో వూట్లాడి యోగ క్షేవూలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఎదుట జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలోని వసతుల లేమి గురించి వుంత్రికి వివరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు మొదలయ్యూరుు.
దీంతో ఇద్దరు నాయకులు కార్యకర్తలను సముదారుుంచారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి స్పందిస్తూ ‘ఇది పార్టీ కార్యక్రవువూ...అధికారిక కార్యక్రవువూ’ అంటూ వుంత్రి లక్ష్మారెడ్డిని పశ్నించారు. పార్టీ కార్యక్రవుమే అరుుతే వుంత్రిగా వచ్చిన మివ్ముల్ని ఎక్కడ, ఎప్పుడు కలవాలో చెప్పాలన్నారు. వెంటనే వుంత్రి జోక్యం చేసుకొని సమీక్ష సవూవేశం వద్దకు వెళ్లండి వస్తున్నా అంటూ బదులిచ్చారు. అనంతరం వుంత్రి ప్రసంగించకుండా వెళ్లిపోయూరు. గతంలోనూ ఎంపీ సీతారాంనాయుక్ పాల్గొన్న కార్యక్రవూల్లోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయుకులవుధ్య వాగ్వాదం చోటుచేసుకున్నసంగతి విదితమే.