ఉద్యమంలా రాష్ట్ర పునర్నిర్మాణం
- ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం
- హెల్త్ కార్డ్ డిజిటైజేషన్ చేస్తాం
- మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, సిరిసిల్ల: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తరహాలోనే తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన వేములవాడ మండలం తిప్పాపూర్‌లో శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డారు. ప్రజల ఆరోగ్య కార్డులను డిజిటైజేషన్ చేసే కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ముందువరుసలో నిలపుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్ర గామిగా నిలిపారని ప్రశంసించారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, 20 శాతం అదనంగా పేషెంట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారని వెల్లడించారు. ఇందుకనుగుణంగా పీహెచ్ సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులను బలో పేతం చేస్తున్నామన్నారు. గర్భిణులకు రూ.12 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలనేది గొప్ప పథక మని, ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనే లక్ష్యంతో ఈపథకాన్ని ప్రవేశ పెట్టారని, బేబీ కిట్ కూడా కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు.
హెల్త్ డిజిటైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ సిరిసిల్ల: కేటీఆర్
హెల్త్ రికార్డు డిజిటైజేషన్ పైలట్ ప్రాజెక్ట్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసుకోవా లని మంత్రి కేటీఆర్ కోరా రు. జిల్లాలోని ప్రతీపౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటైజే షన్ చేసి మొత్తం సమాచారా న్ని సేకరించి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడమే డిజిటైజేషన్ ఆఫ్ హెల్త్ కార్డ్ అని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏ ఆస్పత్రికైనా వెళ్లి ఆధార్ కార్డు చూపిస్తే, ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుస్తుందని తెలిపారు. బీపీ ఉందా, బ్లడ్ గ్రూప్ ఏమిటి, ఏ మందులు వాడొచ్చు లాంటి పూర్తి వివరాలు తెలుస్తుయని పేర్కొ న్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపొటు వచ్చిన అత్యవసర పరిస్థితుల గోల్డెన్ అవర్‌లో విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ వివరాలు ఉపయోగపడుతాయన్నారు.
సర్పంచుల భర్తలు మైక్ పట్టొద్దు: మంత్రి కేటీఆర్ క్లాస్
ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులు ఈ ప్రొటోకాల్ పాటించాలని రాష్ట్ర ఐటీ మున్సి పల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. స్థానిక సర్పంచ్ భర్త మైక్ పట్టుకోవడంతో వేదికపై మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు మాట్లా డటం మంచిదికాదని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ మంత్రి లక్ష్మారెడ్డి భార్య, తన భార్య వచ్చి మాట్లాడితే బాగుంటుందా అని చమత్కరించారు. మహిళా ప్రజాప్రతినిధులు వేదికలపై మాట్లాడేస్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.