అంతర్జాతీయ సంస్థలకు ‘పారిశుద్ధ్యం’
మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య బాధ్యతలు అప్పగిం చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన పారిశుద్ధ్య విధానంపై శనివారం ఆయన కసరత్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పనితీరును సమీక్షించారు. బోధనాసుపత్రుల్లో ప్రతి బెడ్ నిర్వహణ వ్యయా న్ని రూ.6వేల నుంచి రూ.7వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త మంచాలు, రోజుకో రంగు చొప్పున వారానికి ఏడు రంగుల దుప్పట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ యాప్‌ని ఆవిష్కరించా రు. శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, ప్రజారోగ్య డెరైక్టర్ లలితాకుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
పేద కుటుంబానికి చేయూత...
నల్లగొండ జిల్లా భువనగిరి మండలం సూర్‌పల్లికి చెందిన చెరుకుపల్లి శ్రీరాములు అకాల మరణం చెందారు. దీంతో ఆయన కుటుం బం వీధినపడింది. విషయం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సీఎం సహాయనిధి కింద రూ.లక్ష ఆర్థిక సాయం వచ్చేలా లక్ష్మారెడ్డి చొరవ చూపారు. శ్రీరాములు భార్య స్వరూపను హైదరాబాద్ పిలిపించి ఆమెకు చెక్కును మంత్రి అందజేసినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.