
నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి
మంత్రి డాక్టర్ సి.ల క్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి. నాపై వచ్చిన ఆరోపణలు రుజువైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా. నాపై విమర్శలు చేసిన వారు సవాలు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. తన విద్యార్హతలపై ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనంపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలోని పార్టీ శాసన సభాపక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తన విద్యార్హతలపై ప్రజలకు అపోహ కలిగేలా ఆరోపణలు చేసిన నేతతో పాటు, సదరు పత్రికపై న్యాయపరమైన చర్యలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. తన విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను మీడియా సమావేశంలో చూపుతూ, తను చదివిన విద్యాలయంలో విచారణ జరుపుకోవచ్చన్నారు.