ప్రభుత్వాసుపత్రులను బద్నాం చేయొద్దు | Dont blame the government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రులను బద్నాం చేయొద్దు

Published Mon, Jul 25 2016 1:52 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

ప్రభుత్వాసుపత్రులను బద్నాం చేయొద్దు - Sakshi

ప్రభుత్వాసుపత్రులను బద్నాం చేయొద్దు

మీడియాకు మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి

 జడ్చర్ల టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులను బద్నాం చేయొద్దని మీడియాకు వైద్య ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందలేక చివరి క్షణంలోనే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తీసుకురావడం వల్ల సహజంగానే ప్రతిరోజు మరణాలు అధికంగా ఉంటాయని, అంతమాత్రానా ప్రభుత్వ ఆస్పత్రులను అప్రతిష్ట పాల్జేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆదివారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో పవర్‌కట్ వల్లే 20 మంది చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చిన డాక్టర్ రఘును సస్పెండ్ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement