కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలు | New Medical Colleges proposals | Sakshi
Sakshi News home page

కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలు

Published Sat, Oct 14 2017 3:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

New Medical Colleges proposals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్త వైద్య విద్య కళాశాలల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి పంపించాలని వైద్య, ఆరోగ్యమంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త వైద్య కాలేజీల ఏర్పాటు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ కొత్త వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన మిగతా విభాగాల అధికారులు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు సహకరించాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement