
ఆర్‌ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్‌కు తక్కువ
మంత్రి లక్ష్మారెడ్డి చదువుపై రేవంత్ వ్యాఖ్య
కొడంగల్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చదువు ఆర్‌ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్‌కు తక్కువ అని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కొడంగల్‌లోని ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మారెడ్డి బీహెచ్‌ఎంఎస్ ధ్రువీకరణపై అనుమానాలు ఉన్నాయన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తి ప్రజలను మోసం చేయడం కష్టం కాదన్నారు.
లక్ష్మారెడ్డి చదువు మున్నాభాయి ఎంబీబీఎస్ లాంటిది కాదా? అని ప్రశ్నించారు. గుల్బర్గాలో ఉన్న హెచ్‌ఎంసీహెచ్‌కు కర్ణాటక ప్రభుత్వం 1987లో అనుమతి ఇచ్చిందని, అయితే మంత్రిఎన్నికల అఫిడవిట్‌లో 1987లో బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ పాసైనట్లు పేర్కొన్నారని చె ప్పారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.