సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు.
మణిపూర్ తరహాలో కొడంగల్‌లో అత్యాచారాలు: కేటీఆర్
- సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్‌లో గిరిజనులను బెదిరిస్తున్నాడు
- లగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు
- ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?
- పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదు
- మణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయి
- రాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలి
- గిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలి
- గిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదు
- ఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులు
- రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారు
- తొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాం
- కలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదు
- మా భూముల జోలికి రావొద్దు
- మా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలి
- రాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారు
- మా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదు
- మా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారు
- భూమి పై ఆధారపడి బతుకుతున్నాం
- మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారు
- ఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారు
- రైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారు
- నాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారు
- మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు
- పోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment