
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా కోసం లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటన చేశారు.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం
అయితే.. తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లగచర్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి అవసరం. ఆ భూమిని సేకరించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. దీనిపై రేపో మాపో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పొల్యూషన్ లేకుండా.. ఉపాధి కల్పించడమే ప్రధాన అజెండాగా ఈ ప్రతిపాదన ఉండనున్నట్లు సమాచారం.
