పేదలకు ఉచితంగా డయాలసిస్
పేదలకు ఉచితంగా డయాలసిస్
Published Sat, Aug 19 2017 3:27 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా డయాలసిస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మం త్రి హరీశ్‌రావుతో కలసి ఆయన ప్రారం భించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీ బాధితుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియ నెలలోగా పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్ పరికరాలను వాడుతున్నామని తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఖరీదైన వైద్యం చేయిం చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేశా రని చెప్పారు. ప్రైవేట్ వైద్యులు చిన్నాచితకా వ్యాధులకూ అనవసరంగా ఆపరేషన్లు చేస్తే సహించమని మంత్రి హెచ్చరించారు.
సర్కార్ ఆస్పత్రుల వద్ద క్యూలు
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’అని పాడుకున్న తెలంగాణ ప్రజలే ఇప్పుడు అవే ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. ఆర్థికంగా బక్కచిక్కిన తెలంగాణ పల్లెల్లో కిడ్నీ వ్యాధి భూతంలా విస్తరి స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్, జర్మనీ మెడికల్ టెక్నాలజీ లతో కూడిన అధునాతన పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. మొదటి డయాలసిస్ సెంటర్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఆస్పత్రుల ఆధునీకర ణకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మని మంత్రి వివరించారు.
Advertisement
Advertisement