హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి
హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి
Published Wed, Jul 20 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
ఎంజీఎం : హారితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, గిరి జన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ పిలుపునిచ్చా రు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలలతోపాటు డెంటల్, నర్సింగ్, ఆయుర్వేద కళాశాలల్లో ఒకే రోజు 10వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షిం చే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లా క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు కిమోథెరపీ మెరుగైనా సేవలు అందడంతోపాటు వారి పేరు క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి క్యాన్సర్ విభాగానికి కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అధునాతనపడకలను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వార్డును సైతం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కరుణ, ఏజేసీ ప్రశాంత్‌పాటిల్, హెల్త్‌యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్‌రావు, కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, ఆర్‌ఎంఓ హేమంత్, శివకుమార్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ లీలావతి, టీజీడీఏ ప్రధానకార్యదర్శి మోహన్, వైద్యులు రాంకుమార్‌రెడ్డి, బాలాజీ, టీఎన్జీవోస్ నాయకులు రాజేశ్, రాంకిషన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement