Haritha Haram
-
ఆమే వనమై...
ఎస్.పి గారి డ్యూటీ నేరాలను అరికట్టడం. భూమి మీద చెట్టు చేమా లేకుండా పోయేలా మనిషి వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మించిన నేరం ఉంటుందా? దానినీ అరి కట్టాలి కదా. కామారెడ్డి జిల్లా ఎస్పీగా శ్వేత పనిచేస్తున్న కాలంలో ఒక హరిత వనాన్ని పెంచడం తన కర్తవ్యం అనుకున్నారు. ఆరు ఎకరాల్లో ఎన్నో మొక్కలు నాటించారు. ఇప్పుడది అడవిని తలపిస్తోంది. హరిత రక్షక వనంగా నామకరణం చేసుకుంది.హరితహారం స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగారు అప్పటి కామారెడ్డి ఎస్పీ శ్వేత. కామారెడ్డిలో ఆరు ఎకరాల స్థలంలో 80 రకాలైనవి ఎన్నో మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు ఆమెతోపాటు పోలీసు సిబ్బంది నిరంతరం శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మూడేళ్ల కాలంలో ప్రతీ రోజూ ఎస్పీ శ్వేత అక్కడికి వెళ్లేవారు. జరుగుతున ్న పనులను పర్యవేక్షించేవారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ అక్కడే చేసేవారు. ఈ వనానికి ‘హరిత రక్షక వనం’ అని నామకరణం చేశారు.ఎనభై రకాల మొక్కలు...స్థానికంగా పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు నాటారు శ్వేత. రామ సీతాఫలం, బాదమ్, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, నేరేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మేడి, మునగ, నిమ్మ, ఉసిరి, వెలగ, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచఉసిరి, జిట్రేగి... మొదలైన రకాలకు సంబంధించి ఎన్నో మొక్కలు నాటారు.ప్రతీ మొక్కకు నీరందించడానికి డ్రిప్ ఏర్పాటు చేశారు. అక్కడ రెండు బోర్లు తవ్వించి వాటి ద్వారా నీటిని అందిస్తున్నారు. ‘హరిత రక్షక వనం’లో రెండు నీటి గుంతలు తవ్వించారు. అందులో నీరు నిల్వ ఉండేలా వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పై భాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను పెంచుతున్నారు. నీటిని నిల్వ చేయడం మూలంగా బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఇబ్బంది లేకుండాపోయింది.ఆ శ్రమ వృథా పోలేదు...‘హరిత రక్షక వనం’లో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు శ్రమించారు. ఆ మొక్కలను తమ ఇంటి పెరట్లో నాటిన మొక్కలలాగే చూసుకున్నారు. మొక్కల చుట్టు పెరిగే గడ్డిని తొలగించడం, నీరు మొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం, పనికిరాని చెత్తను తొలగించడంలాంటి పనులెన్నో చేసేవారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తే వారితో మొక్కలు నాటించేవారు. ఆ చెట్లకు వారి పేర్లతో నేమ్ప్లేట్లు ఏర్పాటు చేశారు. ‘చెట్లు అంటే....భూమాత రాసిన కవిత్వం’ అనేది భావుకతతో కూడిన మాటే కాదు బాధ్యతను గుర్తుకు తెచ్చే మాట.వృత్తిబాధ్యత, సామాజిక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ పచ్చటి వనాన్ని సృష్టించడం కష్టమేమీ కాదు అని నిరూపిస్తున్నారు శ్వేతలాంటి అధికారులు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డిమానసిక స్థైర్యాన్ని ఇచ్చారుశాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహరాల్లో బిజీగా ఉంటూనే రకరకాల సామాజిక అంశాలపై స్పందించేవారు శ్వేత. కరోనా కాలంలో పోలీసు సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని కలిగించి ఎంతో మందికి అండగా నిలిచారు. నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించారు. శారీరక« దారుడ్య పరీక్షలకు శిక్షణ ఇప్పించారు.ఇదీ చదవండి: గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్ అమ్మలాంటి చెట్లుకామారెడ్డి జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్థలం కనిపించి నాకు వనం పెంచాలన్న ఆలోచన వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు నిర్మించినపుడు అక్కడ వాతావరణం మారిపోతుంది. చల్లబడాలంటే సమాంతరంగా చెట్లు పెంచాలి. అందుకే 2017 దసరా రోజు నేను, అప్పటి కలెక్టర్ సత్యనారాయణ గారు ఇక్కడ మొక్కలు నాటాం. కామారెడ్డికి పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా వాళ్ళతో అక్కడ మొక్కలు నాటించాను. నాటడంతోపాటు మా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ వాటి సంరక్షణకు నిరంతరం శ్రమించారు. అక్కడి ఉసిరి చెట్టు దగ్గర మా అమ్మ ప్రతీ కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. నేను బదిలీ అయినా ఒక అమ్మలా ఆ చెట్టు గుర్తుకొస్తూ ఉంటుంది. – ఎన్. శ్వేత, ఐపీఎస్ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి! -
‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది
చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ● భద్రాచలం డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● అదే ఏడాది జూన్‌లో అశ్వాపురం రేంజ్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● ఇల్లెందు రేంజ్ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్మాల్ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్‌తోపాటు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్ ఇరవెండి పరిధి లో జామాయిల్ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ఉపేక్షించేది లేదు అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, డీఎఫ్ఓ -
మొక్కలపై శ్రద్ధేది?
వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు రూ.5లక్షలు ఖర్చు చేసి గత ఏడాది మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున కుండీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వాటి రక్షణకు ఎంతో శ్రద్ద చూపిన మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కూడా నీరు పోయడం లేదని స్థానికులు అంటున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేయాలి. అయితే బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు 53 మొక్కలు పూర్తిగా ఎండి పోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోగా, ఉన్న వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
‘హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులేశారు’
సాక్షి, రంగారెడ్డి: హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారాయన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకుంది. కానీ, ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత నాది. అలాగే గోదావరి నీటిని గండిపేట, హిమాయత్ సాగర్‌కు లింక్ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి త్వరలోనే నీళ్లు అందిస్తాం. మహేశ్వరం నియోజకవర్గానిక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు సైతం తీసుకుంటామన్నారాయన. ఇదీ చదవండి: మాజీ ఎంపీల భేటీ.. రోజంతా హడావిడి! -
‘హరితం’లో ప్రథమం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కారాలకు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హరితహారం పచ్చదనం విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాల పంపిణీలో రెండో స్థానం లభించింది. మూడున్నరేళ్ల కాలంలో అనేక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. ముఖ్యంగా పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగులో పేరుకుపోయిన పూడిక తొలిగించి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీరు చేరకుండా చేశారు. బుగ్గవాగును క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో దోమల బెడద తొలిగిపోయింది. కాగా, వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని శిల్పారామంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం అవార్డు అందుకోనున్నారు. పలు సమస్యలు పరిష్కారం.. కోరగుట్ట భగీరథ ట్యాంక్ నుంచి ఇందిరానగర్, ఫైర్ స్టేషన్, జగదాంబ సెంటర్, కోర్టు ఏరియాల్లో వేసవికాలం మినహా రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. మున్సిపాల్టీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు చేరుస్తున్నారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లను శుభ్రం చేశారు. తద్వారా దుర్వాసన సమస్య పరిష్కారం అయింది. పట్టణంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను కూల్చేశారు. రైల్వే పట్టాల వెంట గల ఖాళీ స్థలం, పురాతన భవనాలను తొలిగించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలను స్వాధీనం చేసుకుని వివిధ మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఆరు జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, ఆయా బస్తీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అంధకార సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన మహబూబాబాద్ క్రాస్‌రోడ్, గోవింద్ సెంటర్, కొత్తబస్టాండ్, బుగ్గవాగు, పాత బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, జగదాంబా సెంటర్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలక వర్గం అధికారంలోకి వచ్చాక పట్టణంలో మోడల్ మార్కెట్, మల్టీయుటిలిటీ సెంటర్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్ సెంటర్, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజావసర పనులు చేశారు. కేటీఆర్ ప్రోత్పాహంతో ముందడుగు ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, ఎమ్మెల్యే హరిప్రియ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారం మరువలేనివి. పట్టణాన్ని అన్ని విధాలా అగ్రభాగంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేస్తోంది. మాతోపాటు కార్మికులు, సిబ్బంది, అధికారుల సమష్టికృషితో ఆక్రమణల తొలగింపు, బుగ్గవాగు క్లీనింగ్, ఆంబజార్ రోడ్ నిర్మాణం.. ఇలా రూ.153 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. – డి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ -
‘హరితహారం’ తరహాలో తమిళనాడులో ‘గ్రీన్‌మిషన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ‘హరితహారం’కార్యక్రమం అధ్యయనానికి సుప్రియా సాహు నేతృత్వంలో తమిళనాడు అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులోభాగంగా శనివారం అరణ్యభవన్‌లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ ఎ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ఎనిమిదేళ్లుగా అమలు చేస్తూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని సాహు కొనియాడారు. నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు బాగుందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం బాగుందని అభినందించారు. పర్యటనలో సాహు తీసిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సాçహు వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు పాల్గొన్నారు. -
Haritha Haram: పోడు రైతుకు హరితహారం గండం
పోడు రైతుకు హరిత గండం ముంచుకొస్తోంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు... వామపక్షాల మద్దతుతో తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి స్వరాష్ట్రం తెలంగాణ వరకు పోడు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్‌లు కొడుతుండటంతో పోడు రైతులు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో వారిపై ప్రతియేటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తరతరాలుగా అడవిని ఆధారం చేసుకొని బతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమవుతున్నారు. అడవికీ, ఆదివాసీకీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. అడవుల్లోని ప్రతి చెట్టూ ఆదివాసీలకు పూజనీయమే. అనేక చెట్లూ, జంతువులూ ఆదివాసీల తెగలను సూచిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ అడవీ, అడవిలోని జంతుజాలమూ సురక్షితంగా తమ తరువాతి తరాలకు అందాలని ఆదివాసీలు ప్రగాఢంగా కోరుకుంటారు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసీల అభిప్రాయాలను గౌరవిస్తూ... వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనీ, గ్రామసభల ద్వారా చేసిన తీర్మానాలూ, అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవినీ, ఆదివాసులను పరిరక్షించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ నేడు అటవీశాఖ అధికారులూ, పోలీసులూ రాజ్యాంగ నిర్దేశాలను తుంగలో తొక్కి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి, ఏళ్లుగా పరిష్కారం కాని ఆదివాసీ గిరిజనుల భూములకు పోడు పట్టాలు అందించాలి. అçప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది. – జటావత్ హనుము, హైదరాబాద్ -
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్‌చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్
శంషాబాద్ రూరల్: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రియల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ‘సేవ్ సాయిల్’ పోస్టర్లను ఆవిష్కరించారు. -
హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 19.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది హరితహారాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎనిమిదో విడత హరితహారం కింద సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాల్వ గట్లపై పచ్చదనం పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారంలోగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళితబంధు, యాసంగి వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్దఎత్తున పచ్చదనం పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,400 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపునకు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితబంధు గురించి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిన యూనిట్లకుగాను లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించినవారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలి్పంచాలి ధాన్యం సేకరణ గురించి సోమేశ్ కుమార్ మాట్లాడుతూరాష్ట్రంలో ఏడు కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్ల బ్యాగులు త్వరలో వస్తాయని చెప్పారు. అన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్, పురపాలక శాఖ, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరి్వంద్‌కుమార్, రామకృష్ణారావు, రజత్‌కుమార్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త పీసీసీఎఫ్‌గా డోబ్రియల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎం డోబ్రియల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. హరితహారం అమల్లో గత ఆరేళ్లుగా కీలక బాధ్యతలతో పాటు ప్రస్తుత ఉన్నతా ధికారుల్లో సీనియర్‌గా ఉండడంతో ప్రభుత్వం డోబ్రియల్‌ను పీసీసీఎఫ్‌గా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాలు పూర్తయ్యాక ఆయన పూర్తి స్థాయి పీసీసీఎఫ్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా మొదటి పోస్టింగ్ పొందారు. 1991 –94 వరకు భద్రాచలం డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదా లో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాక అదనపు కార్య దర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. అనంతరం స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు (2003–14). తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్‌గా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పదవీ విరమణ చేసిన పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు. -
Telangana: పోడుపై బహుముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎలా ముందుకెళ్లాలి? పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు. పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటవీ అంచున కేటాయింపు! అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 3,31,070 ఎకరాలు ..లక్ష మందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి. 2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు. -
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకోసం యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసర ముందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ఎమెస్కో బుక్స్ ప్రచురించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు’– పల్ల వెంకన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా పల్ల వెంకన్న కుటుంబ సభ్యులకు, ప్రచురణకర్తలకు, పుస్తక రచయిత వల్లీశ్వర్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పల్ల వెంకన్న శక్తి అసాధారణమైనదని, ఐదో తరగతి వరకే చదువుకున్నా, శరీరం పూర్తిగా సహకరించని పరిస్థితుల్లో ఉన్నా ప్రకృ తి విజ్ఞానాన్ని ఔపోసన పట్టి వృక్ష శాస్త్రవేత్తలకు సైతం సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పర్యావరణం– ప్రగతిని సమ న్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పల్ల వెంకన్న తన దివ్యాంగత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడ్డారని, ఆ నిబద్ధతే అర ఎకరా నర్సరీని 40 నుంచి 50 ఏళ్ళలో వం దెకరాల స్థాయికి చేర్చిందని తెలిపారు. వెంకన్న దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, ఎమెస్కో బుక్స్ సీఈవో విజయకుమార్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
ఇటు హరితహారం... అటు హననమా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు చెట్లను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్య క్రమం చేపడుతుండగా.. మరోవైపు రవీంద్రభారతి ఆవరణలో రెండు భారీ వృక్షాలను కొట్టేయడానికి ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుకు సమీపంలో లేకపోగా.. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా కళాభారతి భవనం వెనుక ఉన్న ఈ వృక్షాలను ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించింది. ఆ రెండు వృక్షాలను కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు భారీ వృక్షాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొట్టేయకుండా చూడాలంటూ తాము వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదంటూ అదే ప్రాంత నివాసి, సామాజిక కార్యకర్త డబ్ల్యూ.శివకుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. కళాభారతి భవనం పశ్చిమ భాగంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న 50 ఫీట్లకుపైగా ఎత్తున్న రావిచెట్టు, మలబార్ వేప వృక్షాలు ఉన్నాయని, ఈనెల 18న వీటి కొమ్మలను కొట్టేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డేపల్లి రచన తెలిపారు. ఈ మేరకు పిటిషనర్ అక్కడ సిబ్బందిని ఆరా తీయగా ఈ రెండు చెట్లను కొట్టేస్తున్నట్లు తెలిపారన్నారు. ‘ఈ వృక్షాలు ప్రజల ప్రాణాలకుగానీ, భవనాలకు గానీ నష్టం కల్గించే పరిస్థితి లేదు. భవనాల మధ్య ఉండటంతో భారీ గాలి వీచినా కూలిపోయే పరిస్థితి లేదు. భారీ వృక్షాల కొమ్మలను కొట్టివేయాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి. వృక్షాలను పూర్తిగా తొలగించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా వృక్షాలను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించకుండా ఆదేశించండి’అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. -
ఈ మొక్కకు ఓ లెక్క ఉందండోయ్
కరీంనగర్‌రూరల్: తెలంగాణకు హరితహారంలో భాగంగా జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో రెండేళ్ల నుంచి నాటిన మొక్కలపై అటవీశాఖ ఆద్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని15 మండలాలతోపాటు జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఈ నెల 1నుంచి మొక్కలను లెక్కించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని మొక్కల వివరాలను ఈ నెల 15వరకు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. జిల్లావ్యాప్తంగా 148 ప్రాంతాల్లో సర్వే 2019,2020 సంవత్సరాల్లో నాటిన మొక్కలను సమగ్రంగా సర్వే చేసేందుకు వీలుగా జిల్లాలో 148 ప్రాంతాలను ఎంపిక చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ ఆధ్వర్యంలో సర్వేబృందాలను ఏర్పాటు చేసి మొక్కలను లెక్కిస్తున్నారు. రెండేళ్లలో నాటిన మొత్తం మొక్కల్లో ఒకశాతం చొప్పున సర్వే చేస్తున్నారు. 2019లో 85,363 మొక్కలు, 2020లో 52,164 కాగా.. జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో 3,747 మొక్కలు తనిఖీ చేస్తారు. కరీంనగర్ రేంజ్‌లోని కరీంనగర్ మండలం, కొత్తపల్లి మున్సిపాలిటీకి మహ్మద్ మునీర్ అహ్మద్, చొప్పదండి మండలానికి వీవీ భరణ్, గంగాధర మండలానికి కిరణ్మయి, రామడుగు మండలానికి సుజాత, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాలకు చైతన్య, హుజూరాబాద్ రేంజ్లో ఎఫ్ఆర్వోలు రాజేశ్వర్‌రావు,ఎల్లయ్య, సరిత, బీర్బల్, పూర్ణిమల ఆద్వర్యంలోని 10 బృందాలు సర్వే చేస్తున్నాయి. మొక్కల సమాచారం ఆన్లైన్లో నమోదు ఆయా ప్రాంతాల్లో సర్వే బృందాల ప్రతినిధులు స్థానిక గ్రామపంచాయతీల కార్యదర్శుల సహకారంతో మొక్కల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. నాటిన మొక్కల్లో ఎండిపోయిన, బతికిన మొక్కలు, ఒకే వరుసలో ఉన్న మొత్తం మొక్కలు, వాటిఎత్తు వివరాలను సేకరిస్తున్నారు. రహదారులకు రెండువైపుల నాటిన మొక్కలను వందశాతం లెక్కించడంతోపాటు గృహాల్లో నాటిన మొక్కలను 10శాతం లెక్కిస్తున్నారు. ప్రతి రోజు మొక్కల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో పూర్తి చేసి టీజీఎఫ్ఐఎంఎస్లో నమోదు చేస్తున్నట్లు కరీంనగర్ ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో మొక్కల సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్ -
వారి ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది: ఎంపీ సంతోష్
సాక్షి, మెదక్: హరితహారానికి మేముసైతం అంటున్నారు రేపటి పౌరులు. నాటిన మొక్కలు ఎండిపోకుండా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటాకింద బస్తీ పిల్లలు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపరుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బాకట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకూ నీళ్లు పోస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్‌కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలోకి తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు నీరందిస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ప్రాణవాయువుతో పాటు నీడనూ ఇస్తాయని వారు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంపీ సంతోష్ అభినందనలు.. వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. Gives me immense pleasure to see these little hearts from Veldurthi(V) of Medak, taking care of the saplings. Look at their enthusiasm and love for the plants. It is very much required for today’s generation for their better future with sustainable environment. LoveYou boys. 👌😊 pic.twitter.com/xEwshTvVjK — Santosh Kumar J (@MPsantoshtrs) August 5, 2021 -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారాలు–2021కు పాఠశాల విద్యా శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అన్నిరకాల స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, ఐఏఎస్ఈ, డైట్‌కు చెందిన ప్రిన్సిపాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్) తదితరులకు ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత గ్రేడ్ కలిగిన హెడ్ మాస్టర్లకు కనీసం 15 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఉపాధ్యాయులకు పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సాధారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులు కాదు. కానీ కొన్ని ప్రత్యేకతలున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఏఎస్ఈ, డైట్, సీటీఈఎస్లో పనిచేసే లెక్చరర్లు లేదా సీనియర్ లెక్చరర్లకు కనీసం పదేళ్ల బోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పరిగణనలోకి ‘హరితహారం’.. హరితహారం కార్యక్రమంలో అత్యుత్తమ కృషి సాధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను పరిగణనలోకి తీసుకుంటారు. 2019–21 మధ్య కాలంలో పాఠశాలల్లో చేపట్టిన హరితహారం మొక్కల మనుగడను పరిగణిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పేర్లను ఖరారు చేస్తాయి. ప్రతి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు.. జిల్లా స్థాయి ఎంపిక కమిటీలో కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్, మరో జిల్లా స్థాయి అధికారి ఉంటారు. జిల్లా నుంచి ఈ కమిటీ మూడు పేర్లు ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్ ఉంటారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు సిల్వర్ మెడల్ (గోల్డ్ ప్లేటెడ్), శాలువా, రూ.10 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను జిల్లా కమిటీలు వచ్చే నెల 10 లోపు రాష్ట్ర కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయా పేర్ల నుంచి జ్యూరీ కొందరిని ఎంపిక చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను ఖరారు చేస్తుంది. మొత్తంగా వివిధ కేటగిరీల్లో 43 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. -
రికార్డు: గంటలో 3.5 లక్షల మొక్కలు నాటారు!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి బి.నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రకృతి సహజంగా ఆక్సిజన్ అందించేందుకు తన పుట్టినరోజు సందర్భంగా మిలియన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. -
Photo Feature: నకిలీ టీకా.. నిరసన బాట
వర్షాల కారణంగా వచ్చి చేరుతున్న నీటితో తెలుగు రాష్ట్రాల్లోని చెరువులు, చెలమలు జలకళ సంతరించుకున్నాయి. నీటి ప్రవాహంతో వాగులు కళకళలాడుతున్నాయి. కోవిడ్ టీకాలకూ నకిలీల బెడద తప్పడం లేదు. ఫేక్ వ్యాక్సిన్ల బారి నుంచి ప్రజలను కాపాడాలని పాలకులను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కారణంగా అమర్నాథ్ వార్షిక యాత్ర రద్దు కావడంతో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు పడుతుండటంతో తెలంగాణలో ‘హరితహారం’ సందడి మొదలయింది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన
భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్‌గా మారిన గ్రీన్ ఛాలెంజ్.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్లైన్ యాప్, వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఇప్పటికే వాట్సప్ నంబర్ 9000365000, ఇగ్నైటింగ్ మైండ్స్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు. సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్ ఛాలెంజ్.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్‌లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్‌లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్ జన్మదినం) వ్యాసకర్త ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు ఎం. కరుణాకర్‌రెడ్డి మొబైల్ : 98494 33311 -
మొక్కలు నాటిన సినీ నటుడు సామ్రాట్
-
జంగల్ బచావో.. జంగల్ బడావో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలతో భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా మార్చే లక్ష్యాలతో హరితహారం అమలవుతోంది. రాష్ట్రాన్ని పర్యావరణహితంగా మలచుకోవాలనే ఆకాంక్షలోంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ఐదు విడతలు పూర్తి చేసుకుని, ఆరవ విడతలోకి అడుగుపెడుతోంది. ఇందులో ప్రజలంతా పాల్గొని మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో కేసీఆర్ మొక్కలు నాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి పెరుగుతుండటంతో ఈ కార్యక్రమం కొనసాగింపులో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతోపాటు నాటే ఒక్కో మొక్క దగ్గర ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తుల మధ్య ఆరడుగుల దూరాన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ జిల్లాలోని నర్సరీలు, వాటిల్లో లభిస్తున్న మొక్కల సంఖ్య, రకాలు, ఆయా నర్సరీల సమాచారంతో డైరెక్టరీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడాది దాదాపు 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విడత హరితహారం ప్రత్యేకతలు... ► జంగల్ బచావో.. జంగల్ బడావో (అడవిని కాపాడుదాం.. అడవిని విస్తరిద్దాం) నినాదం. ► వర్షాలకు అనుగుణంగా జిల్లాల్లో కొనసాగింపు. ► టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం. ► ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం. ► హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్లు, జీహెచ్ఎంసీలో 2.5 కో ట్లు. మిగతా పట్టణప్రాంతాల్లో 5 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ► పట్టణ ప్రాంతాలకు సమీప అడవుల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు. ► స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, కేంద్ర సంస్థల్లో హరితహారం. ► ప్రతీ ఊరికో చిన్న పార్కు ఏర్పాటు. ► ప్రతీ నియోజకవర్గంలో ఉన్న అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు విధులు ► ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వడం, బాధ్యతగా పెంచేలా పంచాయతీల పర్యవేక్షణ. ► కోతుల బెడద నివారణకు 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళిక. ► గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పు చేయటం. ► ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత, రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపు. ► కేంద్ర ప్రభుత్వ వెదురు ప్రోత్సాహక సంస్థ సహకారంతో చిన్న, సన్నకారు రైతుల్లో వెదురు పెంపకానికి ప్రోత్సాహం. ► హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేక హరితహారం. 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధి. ► హైవేలు, రాష్ట్ర రహదారుల వెంట 30 కిలోమీటర్లకో నర్సరీ. -
గ్రేటర్లో జపాన్ మియా వాక్
మియావాకీ..తక్కువ విస్తీర్ణంలోనే పెరిగే పచ్చని వనం..జపాన్‌లోని ప్రత్యేక విధానం!. నగరంలో రోజురోజుకూ హరించుకుపోతున్న లంగ్‌స్పేస్‌ను పెంచేందుకు ఈసారి హరితహారంలో ఈ విధానానికి ప్రాధాన్యమివ్వనున్నారు.నగరవ్యాప్తంగా వీలైనన్ని చోట్ల ఈ వనాలను పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్న హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ హరితహారం లక్ష్యం 50 లక్షల మొక్కలు. ఖాళీ ప్రదేశాలతోపాటు ఈసారి ఎక్కువగా రోడ్లు, చెరువు గట్లు, బఫర్జోన్లు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీటితోపాటు మూసీ వెంబడి గ్రీనరీ పెంచేందుకు దాని పొడవునా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన గ్రేటర్ నగరంలో లంగ్‌స్పేస్ పెంచేందుకు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ పద్ధతి మియావాకీకి ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మార్గాల్లోని మేజర్ రోడ్లు, మైనర్ రోడ్లలో అవకాశమున్న అన్ని చోట్లా మొక్కలు నాటుతారు. కాలనీల్లోని రహదారుల్లోనూ స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో మొక్కలు నాటనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో వీలున్న ప్రాంతాల్లోనూ, గతంలో నాటిన మొక్కలు బతకని ప్రాంతాల్లోనూతిరిగి మొక్కలు నాటనున్నారు. అన్ని జోన్లలో.. జీహెచ్ఎంసీ లోని ఆరు జోన్లలోనూ ఈవిధానాన్ని అమలు చేయడంతోపాటు జోన్ల పరిధిలో ఈసారి అవెన్యూ ప్లాంటేషన్లు, గ్రీన్‌కర్టెన్లు వంటì వాటికి శ్రద్ధ చూపుతున్నారు. ఖాలీ ప్రదేశాలున్న ప్రాంతాల్లో ట్రీపార్కులుగా తీర్చిదిద్దడంతోపాటు అక్కడ వాకింగ్ ట్రాక్‌లు, తదితరసదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ల కింద, మీడియన్లలో తక్కువఎత్తుతో ఉండే ప్రత్యేక మొక్కలు నాటనున్నట్లు అడిషనల్ కమిషనర్ క్రిష్ట (బయోడైవర్సిటీ) క్రిష్ణ తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల కనుగుణంగా నగరంలో పచ్చదనాన్ని పెంచి, కాలుష్యాన్ని నియంత్రించి, ఉష్ణోగ్రతలు తగ్గించి, ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించేకు ప్రతియేటా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హరితహారం కోసం జీహెచ్ఎంసీ ఆయా నర్సరీల్లో మొక్కల్ని సిద్ధం చేస్తోంది. మియావాకీ అంటే.. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన బొటానిస్ట్ అకీరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది. సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్‌లలో అర్బన్ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేయనున్నారు. అక్కడ మియావాకీ విధానాన్ని అమలు చేయనున్నారు. నగరవ్యాప్తంగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
యుద్ధప్రాతిపదికన మొక్కల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో పట్టణాల్లో హరితహారం నిర్వహణపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణలనుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్‌ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్ల లోని 188 ఫారెస్ట్ బ్లాక్‌లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతీ చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ ద్వారా కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరుప్రక్కల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్ల వెంట నాటాలన్నారు. మెట్రో కారిడార్ల ఇరుప్రక్కలు, మీడియంలు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించాలన్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, అటవీ శాఖల ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.క్యాంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధికి గాను కేంద్రానికి పంపడానికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల కోసం క్యాంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్ బ్లాక్‌ల భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, డీఎఫ్ఓ, సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్ బ్లాక్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్ తెలిపారు.