హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.. కోట్ల మొక్కలు పెంచి.. నాటేందుకు రూ.కోట్లు ఖర్చు చేసింది.. వాటి రక్షణపై పర్యవేక్షణ కొరవడింది.. నీరందక.. చుట్టూ కంచె ఏర్పాటు చేయక.. అర్ధంతరంగా వాడిపోతూ.. ఎండిపోతున్నాయి.. వీటిలో ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట నాటిన మొక్కలే ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విడతలవారీగా చేపట్టి.. మొక్కలు నాటుతోంది. 2017–18లో హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా 1.80 కోట్ల మొక్కలు జిల్లాలో నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రూ.కోట్లు ఖర్చు చేసి నర్సరీల్లో మొక్కలు పెంచి.. నాటిన అధికార యంత్రాంగం వేసిన మొక్కలను రక్షించేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ నాటిన మొక్కలు పూర్తిస్థాయిలో బతకడం లేదు. మూడో దశ హరితహారంలో జిల్లాలో 1.80 కోట్ల మొక్కలు నాటారు. వాటికి సరైన రక్షణ, నీటి సౌకర్యం లేకపోవడంతో సుమారు 60 లక్షల మొక్కలకుపైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేవలం 65 శాతం మొక్కలు మాత్రమే బతికున్నాయి. చనిపోయిన వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంబడి నాటిన మొక్కలే అధికంగా ఉన్నాయి.
రూ.కోట్లు ఖర్చు..
హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నర్సరీల ద్వారా మొక్కలు పెంచేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టలేకపోతోంది. జిల్లాలో మూడో విడత హరితహారానికి ఐదు శాఖలు మొక్కలను పెంచాయి. వీటిలో డీఆర్‌డీఏ నుంచి జిల్లాలో 25 నర్సరీల ద్వారా రూ.1.17కోట్లు ఖర్చు చేసి 28 లక్షల మొక్కలను పెంచారు. వీటిలో ఉపాధిహామీ పథకం ద్వారా 11,32,041 మొక్కలు నాటారు. వీటికోసం తీసిన గుంటకు, మొక్కను నాటినందుకు కూలీ ఖర్చు, మెటీరియల్, నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ కోసం రూ.2.94కోట్లు ఖర్చు చేశారు. దీంతో డీఆర్‌డీఏ ద్వారా మొక్కలను పెంచి.. నాటినందుకు రూ.4కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో వాటిని బతికించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ఒక్కో మొక్కకు రూ.25 ఖర్చు..
నాటిన మొక్కలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకం గా నిధులు ఖర్చు చేస్తోంది. రోడ్ల వెంట మొక్కలు నాటిన తర్వాత వాటిని పశువులు తినకుండా ప్రత్యేకంగా రక్షణ వలయాలు ఏర్పాటు చేసేందుకు రూ.139 చొప్పున ఖర్చు చేస్తోంది. ప్రతి మొక్కకు నీళ్లు పోసి నెలకు రెండుసార్లు ఎరువు అందించేందుకు రూ.25 వెచ్చిస్తోంది. రోడ్ల వెంబడి, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కల కోసం ఆ నిధులను ఖర్చు చేస్తున్నా రు. ఇంత చేస్తున్నా.. పూర్తిస్థాయిలో మొక్కల రక్షణకు చర్యలు చేపట్టకపోవడం.. పలు ప్రాంతాల్లో వేసిన మొక్కలు ఎదగకపోవడంతోపాటు చనిపోతున్నాయి. దీంతో హరితహారం లక్ష్యం నీరుగారిపోతోంది.
నీరు లేదు.. ఎరువు లేదు..
హరితహారంలో నాటిన మొక్కల రక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. వాటికి రక్షణ వలయాలు ఏర్పాటు చేయడంతోపాటు నీరు పోయడం, ఎరువులు అందించేందుకు nప్రత్యేకంగా ఖర్చు చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద నాటిన ఒక్కో మొక్కకు రూ.25 పెంపకం ఖర్చుకు కేటాయించింది. అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలకు నీరు పోసేవారు కరువయ్యారు. పలు ప్రాంతాల్లో మొక్కలు ఎదగడం లేదు. కొన్నిచోట్ల చనిపోతున్నాయి.
ప్రజల భాగస్వామ్యం కరువు..
పంచాయలో తీల పరిధిప్రభుత్వ శాఖలు వేసిన మొక్కలను రక్షించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. అధికారు లు కూలీలను ఏర్పాటు చేసి.. మొక్కలను నీరందిస్తున్నా.. ఎదుగుదలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. ఇందులో ప్రజలు భాగస్వాములు కాలేకపోతున్నారు. గ్రా మాల్లో ఇళ్ల వద్ద, పొలం గట్లు, రోడ్ల వెంబడి వేసిన మొ క్కలను కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో పశువుల కు ఆహారంగా మారుతున్నాయి. కార్యక్రమంలో ప్రజల ను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తే నాటిన మొ క్కలన్నింటినీ బతికించొచ్చు. ఇందుకు అవగాహన కల్పించాలని పలువురు పర్యావరణవేత్తలుపేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment