హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో హరిత హారానికి రూ. 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం మున్సిపాలిటీల్లో హరితహారం అమలుపై కేటీఆర్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఉన్నతాధికారులలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమానికి నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.