ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి
ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి
Published Mon, Aug 1 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
మట్టపల్లి (మఠంపల్లి): హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు సూచించారు. సోమవారం మండలంలోని మట్టపల్లిలో జరుగుతున్న కృష్ణా పుష్కర పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు స్థానిక ఎన్‌సీఎల్ సమీపంలోని ప్రధాన రహదారి వెంట నూతనంగా నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డుపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు పులిచింతల ముంపులో నష్టపరిహారం ఇచ్చిన అధికారులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మత్స్యకారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. అదేవిధంగా మండలంలోని అమరవరం ఎత్తిపోతలను వెంటనే ప్రారంభించాలని స్థానిక ప్రజాప్రతిని«ధులు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, నాయకులు సాముల శివారెడ్డి, కాసోజు శంకరమ్మ, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.కృష్ణంరాజు, ఎం.కృష్ణగౌడ్, ఎం.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ అంజమ్మ బుచ్చయ్య, మాజీ ఎంపీపీలు లక్ష్మీ వెంకటనారాయణ, కొండానాయక్, నర్సింగ్ వెంకటేశ్వర్లుగౌడ్, నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాసరావు, పిచ్చిరెడ్డి, ఎంపీటీసీలు జయమ్మ, రంగమ్మ, సీఐ నర్సింహారెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీవో శాంతకుమారి, ఎస్‌ఐ రమేష్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు.
Advertisement