విరివిగా మొక్కలు నాటాలి
చేగుంట: అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చిన్నశివునూర్ డంపుయార్డు సమీపంలోని ఖాళీ స్థలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... విద్యార్థులు, యువకులు, వృద్ధులు అన్ని వయసుల వారు విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఒక్కో మండలంలో లక్షల మొక్కలు నాటి వాటిని పెరిగి పెద్దగా మారేలా సంరక్షించాలని సూచించారు. అధికారులు సైతం విభాగాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో ఎక్కువ సంఖ్యల్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లి రమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది సుజాత, వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఏపీఓ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి బక్కప్ప, నాయకులు జనగామ అంజాగౌడ్, రమేశ్ గౌడ్, ఉప్పరి నాగులు, కుమ్మరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఏఎంసీ డైరెక్టర్
దుబ్బాక: హరిత హారంలో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పేరుడి దయాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత హారంలో మొక్కలు నాటడడంలో రాష్ట్రంలోనే దుబ్బాక నియోజక వర్గాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు.
హరిత ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు గోప కైలాసం, నాయకులు పాతూరి చిన్న శ్రీనివాస్‌గౌడ్, ఎండీ జాకీర్, జూకంటి రాజిరెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బెస్త భూమయ్య, బండి మురళి గౌడ్, దమ్మగౌని శ్రీనివాస్ గౌడ్, మాస్తి సిద్ధిరాములు, జంగం శంకర్ పాల్గొన్నారు.
భవిష్యత్తు తరాల కోసమే హరితహారం
మిరుదొడ్డి: భవిష్యత్తు తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని నిర్వహిస్తోందని ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మోతె శివారులో గల ప్రభుత్వ భూమిలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపాడాలని కోరారు.
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, సర్పంచ్ కోరంపల్లి విజయలక్ష్మి వెంకట్‌రెడ్డి, భూంపల్లి ఎస్‌ఐ పి.ప్రసాద్, ఉపాధి హామీ ఏపీఓ శంకరయ్య, మండల సాక్షర భారత్ కోకన్వీనర్ బొంగాని రాములు, కార్యదర్శి అశోక్, నాయకులు సిద్ది భూపతిగౌడ్ పాల్గొన్నారు.