నేడు చెన్నూర్‌లో మెగా హరితహారం | tomorroe a mega harith haram programme will be conduct by mla | Sakshi
Sakshi News home page

నేడు చెన్నూర్‌లో మెగా హరితహారం

Published Wed, Jul 27 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

tomorroe a mega harith haram programme will be conduct by mla

చెన్నూర్‌ : పట్టణంలో గురువారం ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో  మెగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అ«ధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సర్వర్‌ బుధవారం తెలిపారు.
        ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో హరితహారం పై మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులతో ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు  సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి గోదావరి రోడ్డులోని శనిగకుంట వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని సర్పంచ్‌లు,  ఎంపీటీసీలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement