- మొక్కల సంరక్షణలో పోలీసులు ముందునిలవాలి
- రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ
హరిత తెలంగాణే లక్ష్యం
Published Fri, Aug 5 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
మామునూరు : హరిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం విజయవంతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని.. ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని రూరల్ ఎస్పీ, పోలీసు కళాశాల ప్రిన్స్‌పాల్ అంబర్‌కిషోర్‌ఝూ సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం మామునూరులోని పోలీసు కళాశాల ఆవరణ, నవోదయ విద్యాల యలో ఎన్‌సీసీ కల్నల్ పవన్‌డింగ్రా, నవోదయ ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రాంరెడ్డితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారం గొప్ప కార్యక్రమమని, పోలీసులు లక్ష్యానికి మించి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్‌సీసీ కల్నల్ పవన్‌డింగ్రా మాట్లాడుతూ సీబీఎస్‌ఈ బోర్డు ఆధీనంలో అనేక విద్యాలయాలు పనిచేస్తుండగా జవహర్ నవోదయ విద్యాలయ ఫలితాల సాధనలో అగ్రభాగాన నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పీటీసీ పోలీసు అధికారులు బోజరాజు, సాదిక్ అలీ, దేవాసింగ్, పూర్ణచందర్, థామస్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
Advertisement