కుండీల్లో కానరాని మొక్కలు
వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు రూ.5లక్షలు ఖర్చు చేసి గత ఏడాది మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున కుండీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వాటి రక్షణకు ఎంతో శ్రద్ద చూపిన మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కూడా నీరు పోయడం లేదని స్థానికులు అంటున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేయాలి. అయితే బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు 53 మొక్కలు పూర్తిగా ఎండి పోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోగా, ఉన్న వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment