rural sp amber kishor jha
-
డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన సీపీ, ఎస్పీ
వరంగల్ : రాష్ట్రపతి పోలీస్ (శౌర్యపతకం) గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ప్రభాకర్‌రావుకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయంలో ఆయనను కలిసి బొకే అందించారు. కాగా, తనను గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ, ఐజీ, పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. -
హరిత తెలంగాణే లక్ష్యం
మొక్కల సంరక్షణలో పోలీసులు ముందునిలవాలి రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ మామునూరు : హరిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం విజయవంతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని.. ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని రూరల్ ఎస్పీ, పోలీసు కళాశాల ప్రిన్స్‌పాల్ అంబర్‌కిషోర్‌ఝూ సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం మామునూరులోని పోలీసు కళాశాల ఆవరణ, నవోదయ విద్యాల యలో ఎన్సీసీ కల్నల్ పవన్‌డింగ్రా, నవోదయ ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రాంరెడ్డితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారం గొప్ప కార్యక్రమమని, పోలీసులు లక్ష్యానికి మించి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్సీసీ కల్నల్ పవన్‌డింగ్రా మాట్లాడుతూ సీబీఎస్ఈ బోర్డు ఆధీనంలో అనేక విద్యాలయాలు పనిచేస్తుండగా జవహర్ నవోదయ విద్యాలయ ఫలితాల సాధనలో అగ్రభాగాన నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పీటీసీ పోలీసు అధికారులు బోజరాజు, సాదిక్ అలీ, దేవాసింగ్, పూర్ణచందర్, థామస్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. -
హరిత తెలంగాణే లక్ష్యం
రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నల్లబెల్లి: రాష్ట్రంలో విస్తృతంగా మొక్కలు నాటి హరిత తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని రంగాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం హరి తహారం నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విరివిగా మొక్క లు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో రెంకరాల భూములు పోలీస్ శాఖకు అప్పగిస్తే ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పెం చుతూ మోడల్ నర్సరీలుగా తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు మహిళలు, గ్రామస్తు లు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డీ ఎస్పీ దాసరి మురళీధర్, రూరల్ సీఐ బోనాల కిషన్, ఎంపీపీ బానోత్ సారంగపాణి, సర్పంచ్ గొనే రాంబాబు, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట ఎస్సైలు మేరుగు రాజమౌళి, వెంకటేశ్వర్లు, పులి వెంకట్‌గౌడ్, పీఎస్సై ఆర్ స్వామి, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ఉప్పుల మొగిలి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రవీంద్రకుమార్ తది తరులు పాల్గొన్నారు.