- రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా
హరిత తెలంగాణే లక్ష్యం
Published Thu, Jul 28 2016 12:19 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
నల్లబెల్లి: రాష్ట్రంలో విస్తృతంగా మొక్కలు నాటి హరిత తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని రంగాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం హరి తహారం నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విరివిగా మొక్క లు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో రెంకరాల భూములు పోలీస్ శాఖకు అప్పగిస్తే ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పెం చుతూ మోడల్ నర్సరీలుగా తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు మహిళలు, గ్రామస్తు లు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డీ ఎస్పీ దాసరి మురళీధర్, రూరల్ సీఐ బోనాల కిషన్, ఎంపీపీ బానోత్ సారంగపాణి, సర్పంచ్ గొనే రాంబాబు, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట ఎస్సైలు మేరుగు రాజమౌళి, వెంకటేశ్వర్లు, పులి వెంకట్‌గౌడ్, పీఎస్సై ఆర్ స్వామి, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ఉప్పుల మొగిలి, జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం రవీంద్రకుమార్ తది తరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement